Aham Reboot : ఆహాలో ఏకంగా అన్ని కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో.. సుమంత్ సరికొత్త రికార్డ్..

అహం రీబూట్ సినిమా ఇటీవల జులై 1 నుంచి ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

Aham Reboot : ఆహాలో ఏకంగా అన్ని కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో.. సుమంత్ సరికొత్త రికార్డ్..

Sumanth Aham Reboot Movie Creates New Record in AHA OTT With Highest Streaming Minutes

Updated On : July 19, 2024 / 6:20 PM IST

Aham Reboot : సుమంత్ హీరోగా ఒక్క పాత్రతోనే తెరకెక్కిన థ్రిల్లర్ సినిమా ‘అహం రీబూట్’. వాయుపుత్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రఘువీర్ గొరిపర్తి నిర్మాణంలో ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వంలో ఈ అహం రీబూట్ సినిమా తెరకెక్కింది. ఇటీవల జులై 1 నుంచి ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఆహాలోకి వచ్చిన రెండు వారాల్లోనే ఈ సినిమా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అహం రీబూట్ సినిమా ఆహాలో ఏకంగా ఇప్పటివరకు రెండు కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ ని సాధించి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. సినిమా మొత్తం కేవలం ఒక్క సుమంత్ పాత్ర తోనే ప్రయోగాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే రిస్క్ చేయాల్సిందే. హీరో సుమంత్, నిర్మాత రఘువీర్, దర్శకుడు కలిసి ఈ సరికొత్త ప్రయోగం చేసి సక్సెస్ కొట్టారు.

Also Read : Thangalaan release date : రామ్‌తో పోటీకి సై అంటున్న చియాన్ విక్ర‌మ్‌.. ‘తంగ‌లాన్’ రిలీజ్ డేట్ ఫిక్స్‌..

ఇక అహం రీ బూట్ సినిమా కథ విషయానికొస్తే.. నిలయ్(సుమంత్) ఒక ఆర్జేగా పనిచేస్తూ ఉంటాడు. ఎప్పుడో అయిదేళ్ల క్రితం తన ర్యాష్ డ్రైవింగ్ వల్ల చనిపోయిన అమ్మాయిని గుర్తుచేసుకుంటూ, తన ఫుట్ బాల్ లైఫ్ పోయినందుకు, ఆ అమ్మాయి ఎవరో తెలియనందుకు రోజూ బాధపడుతూ ఉంటాడు. ఓ రోజు ఆర్జేగా వర్క్ మొదలుపెట్టాక తన రేడియో స్టేషన్ కి ఒక కాల్ వస్తుంది. ఒక అమ్మాయి తనని ఎవరో కిడ్నాప్ చేసారంటూ, కాపాడమని కాల్ వస్తుంది. అది ముందు ప్రాంక్ కాల్ అనుకున్నా తర్వాత నిజమే అని తెలుస్తుంది. తాను మాట్లాడేది రేడియోలో అందరూ వింటూ ఉంటారు కాబట్టి డైరెక్ట్ గా చెప్పకుండా ఫోన్ లోనే ఆమె గురించి అన్ని వివరాలు తెలుసుకొని కాపాడాలి. పోలీసులు కూడా ఈ విషయంలో రంగప్రవేశం చేస్తారు. మరి ఆ అమ్మాయిని ఆర్జే నిలయ్ కాపాడాడా? పోలీసులు ఏం చేసారు? నిలయ్ వల్ల చనిపోయిన అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి కిడ్నాప్ అయిన అమ్మాయికి సంబంధం ఏంటి తెలియాలంటే సినిమా ఆహాలో చూడాల్సిందే.