Siva Karthikeyan : కేవలం 1000 రూపాయలు అడ్వాన్స్ తీసుకొని సినిమాకు ఓకే చెప్పిన స్టార్ హీరో..

ఇప్పటి రోజుల్లో స్టార్ హీరోల రెమ్యునరేషన్స్ చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి. హిట్స్ పడితే రెమ్యునరేషన్స్ పెంచేస్తారు. 5 కోట్ల నుంచి 100 కోట్లు తీసుకునే స్టార్ హీరోలు ఉన్నారు ఇప్పుడు. వీళ్ళందరికీ సినిమా ఓకే అయితే అడ్వాన్స్ కోట్లల్లో ఇవ్వాల్సిందే.

Siva Karthikeyan :  కేవలం 1000 రూపాయలు అడ్వాన్స్ తీసుకొని సినిమాకు ఓకే చెప్పిన స్టార్ హీరో..

Siva Karthikeyan taken only 1000 rupees advance for mahaveerudu movie

Siva Karthikeyan : ఇప్పటి రోజుల్లో సినిమా ఖర్చు కంటే హీరోల రెమ్యునరేషన్స్ ఎక్కువవుతుంది ఒక్కోసారి. ఇక సినిమా ఓకే అయిందంటే కొన్ని కోట్లు అడ్వాన్స్ తీసుకుంటున్నారు. అడ్వాన్స్ లేకుండా సినిమా చేయడం ఈ రోజుల్లో అరుదు. గతంలో అయితే ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి.. ఇలాంటి స్టార్ హీరోలు చాలామంది అప్పట్లో నష్టాల్లో ఉన్న నిర్మాతలకు సపోర్ట్ గా నిలవడానికి అడ్వాన్సులు, ముందే రెమ్యునరేషన్స్ తీసుకోకుండా సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి. సినిమా మొత్తం అయ్యాకే డబ్బులు తీసుకునేవాళ్ళు. లాభాలు రాకపోతే పర్లేదని ఇంకో సినిమాకు డేట్స్ ఇచ్చేవాళ్ళు.

కానీ ఇప్పటి రోజుల్లో స్టార్ హీరోల రెమ్యునరేషన్స్ చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి. హిట్స్ పడితే రెమ్యునరేషన్స్ పెంచేస్తారు. 5 కోట్ల నుంచి 100 కోట్లు తీసుకునే స్టార్ హీరోలు ఉన్నారు ఇప్పుడు. వీళ్ళందరికీ సినిమా ఓకే అయితే అడ్వాన్స్ కోట్లల్లో ఇవ్వాల్సిందే. కానీ తాజాగా ఓ స్టార్ హీరో హిట్స్ ఉన్న కూడా కేవలం 1000 రూపాయలు అడ్వాన్స్ తీసుకొని సినిమా ఓకే చేశాడు.

తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ఇటీవల మంచి ఫామ్ లో ఉన్నాడు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా శివ కార్తికేయన్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉంది. ఇటీవల అతని సినిమాలు తెలుగు, తమిళ్ లో రిలీజ్ చేస్తున్నారు. శివకార్తికేయన్, అదితి శంకర్ నటించిన మహావీరుడు సినిమా జులై 14న రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

Anand Deverakonda : ర‌ష్మిక ను వ‌దిన అని పిల‌వ‌డంపై ప్ర‌శ్న‌.. ఆనంద్ దేవ‌ర‌కొండ స‌మాధానం ఏంటంటే..?

ఈ ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత శివ కార్తికేయన్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. నిర్మాత అరుణ్ విశ్వ మాట్లాడుతూ.. హీరో శివ కార్తికేయన్ మాకు చాలా సపోర్ట్ చేశారు. కొన్నాళ్ల క్రితం మా మదర్ యాక్సిడెంట్ అయి హాస్పిటల్ లో ఉన్నప్పుడు శివ కార్తికేయన్ చాలా సహాయం చేశారు. అప్పుడే మాకు సినిమా కూడా చేస్తా అని మాట ఇచ్చారు. కేవలం 1000 రూపాయలు మాత్రమే అడ్వాన్స్ తీసుకొని శివకార్తికేయన్ ఈ సినిమా చేశాడు. ఆయన మాకు చాలా హెల్ప్ చేశారు. ఆయన ఋణం తీర్చుకోలేనిది అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు. దీంతో అభిమానులు, పలువురు నెటిజన్లు శివకార్తికేయన్ ని అభినందిస్తున్నారు.