Mahesh Babu : మహేష్ బాబుతో సౌత్ ఇండస్ట్రీ స్పెషల్ ఫోటో.. అంబానీ పెళ్ళిలో మన స్టార్స్ హంగామా..

అనంత్ అంబానీ పెళ్లి నుంచి నయనతార భర్త, డైరెక్టర్ విగ్నేష్ శివన్ మహేష్ బాబుతో దిగిన ఫోటో షేర్ చేసాడు.

Mahesh Babu : మహేష్ బాబుతో సౌత్ ఇండస్ట్రీ స్పెషల్ ఫోటో.. అంబానీ పెళ్ళిలో మన స్టార్స్ హంగామా..

Director Vignesh Shivan Shares Photo With Mahesh Babu and some South Actors

Updated On : July 17, 2024 / 11:12 AM IST

Mahesh Babu : ఇటీవల అనంత్ అంబానీ – రాధికా పెళ్ళికి సౌత్ నుంచి కూడా చాలా మంది స్టార్ నటీనటులు వెళ్లిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుంచి మహేష్ బాబు ఫ్యామిలీ, రామ్ చరణ్ ఫ్యామిలీ, వెంకటేష్ ఫ్యామిలీ, అఖిల్.. పలువురు వెళ్లారు. తమిళ్ నుంచి నయనతార ఫ్యామిలీ, సూర్య ఫ్యామిలీ, రజినీకాంత్ ఫ్యామిలీలు ఆ పెళ్ళికి హాజరయ్యాయి. ఇప్పటికే అనంత్ అంబానీ పెళ్లి నుంచి మన సెలబ్రిటీల ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Also Read : Double Ismart : అప్పులు, ఫ్లాపులు.. పూరి జగన్నాద్ హిట్ కొట్టాల్సిందే.. డబల్ ఇస్మార్ట్ పరిస్థితి ఏంటి?

తాజాగా ఈ పెళ్లి నుంచి మరో కొత్త ఫోటో వైరల్ అవుతుంది. నయనతార భర్త, డైరెక్టర్ విగ్నేష్ శివన్ మహేష్ బాబుతో దిగిన ఫోటో షేర్ చేసాడు. అయితే ఈ ఫొటోలో మహేష్ బాబు, నయనతార, విగ్నేష్ శివన్, సూర్య, జ్యోతిక, నమ్రత, జెనీలియా, అఖిల్.. పలువురు ప్రముఖులు అందరూ ఒకేచోట కూర్చొని ఉన్నారు. మొత్తం సౌత్ యాక్టర్స్ అంతా ఒక చోటు కూర్చొని దిగినట్టు ఉంది ఈ ఫోటో.

View this post on Instagram

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

విగ్నేష్ శివన్ ఈ ఫోటో షేర్ చేస్తూ.. బ్యూటిఫుల్ పీపుల్ తో బ్యూటిఫుల్ టైం గడిపాము అంటూ తన సంతోషాన్ని పంచుకున్నాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. అయితే ఈ ఫొటోలో మహేష్ బాబు తన సరికొత్త లుక్ తో సెంటర్ లో కూర్చోవడంతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనబడుతున్నాడు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఈ ఫోటోని షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.