Delhi Rains: ఢిల్లీలో యమునా నది డేంజర్ మార్క్…తెగిపోయే ప్రమాదం

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కురుస్తున్న భారీవర్షాలతో నమునా నది ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తోంది. పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటిమట్టం సోమవారం రాత్రి 11 గంటలకు 206.04 మీటర్లకు పెరిగింది. యమునా నది డేంజర్ మార్క్‌ను బద్దలు కొట్టడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు....

Delhi Rains: ఢిల్లీలో యమునా నది డేంజర్ మార్క్…తెగిపోయే ప్రమాదం

Yamuna River Breaches Danger Mark

Delhi Rains: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కురుస్తున్న భారీవర్షాలతో నమునా నది ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తోంది. పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటిమట్టం సోమవారం రాత్రి 11 గంటలకు 206.04 మీటర్లకు పెరిగింది. యమునా నది డేంజర్ మార్క్‌ను బద్దలు కొట్టడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. (Yamuna River Breaches Danger Mark) యమునా నదిలో వరదనీరు పెరగడంతో దేశ రాజధానిలోని మయూర్ విహార్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో ,ఒడ్డున నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Heavy Rainfall : భీకర వర్షాలు, పోటెత్తిన వరదలు..

ఢిల్లీలో ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. (Orange Alert Sounded) మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు యమునా నది నీటిమట్టం 206.65 మీటర్లకు చేరింది. పొరుగున ఉన్న హర్యానా భారీ వర్షాల మధ్య హత్నికుండ్ బ్యారేజీ నుంచి యమునా నదిలోకి ఎక్కువ నీటిని విడుదల చేయడంతో దీనిలో నీటి మట్టం నిరంతరం పెరుగుతోంది. యమునా నదీ వరదలను ఎదుర్కోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చెప్పారు.

Heavy Rains : నదులను తలపిస్తున్న ఢిల్లీ రహదారులు.. 22కి పెరిగిన మృతుల సంఖ్య

యమునా నదిలో నీటి మట్టం పెరిగిన దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో వరద పరిస్థితులపై సమీక్షించిన సీఎం కేజ్రీవాల్ లోతట్టుప్రాంతాలను ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్నారు. వరదనీరు అధికంగా వస్తుండటంతో యమునా నది కట్టలు తెగిపోయే ప్రమాదం పొంచి ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమై వరద పరిస్థితులను ఎదుర్కొనేలా చర్యలు తీసుకున్నారు.