Sitara – Mahesh Babu : బర్త్ డే రోజు సితార పాప ఎంత మంచి పని చేసింది.. ఆ అమ్మాయి కోసం ఏకంగా అప్పటివరకు..

తాజాగా ఇటీవల సితార పుట్టిన రోజు సందర్భంగా ఓ అమ్మాయికి హెల్ప్ చేసింది.

Sitara – Mahesh Babu : బర్త్ డే రోజు సితార పాప ఎంత మంచి పని చేసింది.. ఆ అమ్మాయి కోసం ఏకంగా అప్పటివరకు..

Sitara Ghattamaneni Helped to a Neet Qualified Girl for MBBS from Mahesh Babu Foundation

Updated On : July 22, 2024 / 8:15 AM IST

Sitara – Mahesh Babu : మహేష్ బాబు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాడని తెలిసిందే. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే 1000 కి మందికి పైగా హార్ట్ సమస్య ఉన్న చిన్నపిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్, ఊర్లని దత్తత తీసుకోవడం, మెడికల్ క్యాంప్స్, పలువురు పిల్లలకు చదుకు హెల్ప్ చేయడం.. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తండ్రి బాటలోనే కూతురు అన్నట్టు సితార కూడా మహేష్ బాటలోనే చిన్నప్పట్నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఇటీవల సితార పుట్టిన రోజు సందర్భంగా ఓ అమ్మాయికి హెల్ప్ చేసింది. ఒక మాములు పేద కుటుంబానికి చెందిన నవ్య అనే అమ్మాయి నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయింది. కానీ డాక్టర్ చదువుకోడానికి స్థోమత లేకపోవడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ద్వారా మహేష్ బాబు ఫౌండేషన్ కి సమాచారం తెలిసిందే. దీంతో ఆమెకు డాక్టర్ అయ్యేంతవరకు ఫీజులు, చదువుకు సంబంధించిన ఖర్చులు అన్ని మహేష్ బాబు ఫౌండేషన్, సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ ద్వారా ఆమెకు సహాయం చేస్తున్నట్టు ప్రకటించారు.

Also Read : Niharika – Pawan Kalyan : నిహారిక ఫోన్‌లో పవన్ కళ్యాణ్ ఫోన్ నంబర్ ఏమని సేవ్ చేసి ఉంటుందో తెలుసా?

సితార పాప పుట్టిన రోజు సందర్భంగా నవ్యతో బర్త్ డే సెలబ్రేట్ చేసుకొని అడ్వాన్స్ గా 1,25,000 రూపాయల చెక్ ని ఆమెకు సితార చేతుల మీదుగా అందించారు. అలాగే ఆ అమ్మాయికి సితార చేతుల మీదుగా ల్యాప్ టాప్, స్టెతస్కోప్ అందించారు. తన మెడిసిన్ పూర్తయ్యేవరకు కూడా మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆ అమ్మాయి సంతోషం వ్యక్తం చేస్తూ సితారకు, మహేష్ బాబు ఫౌండేషన్ కు ధన్యవాదాలు తెలిపింది. దీంతో మరోసారి సితారను, మహేష్ బాబుని అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు.