ladies finger Cultivation : బెండతోటలకు మొజాయిక్ వైరస్ ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

బెండ ఉష్ణ మండల పంట. నీటిపారుదల కింద రైతులు సంవత్సరం పొడవునా ఈ కూరగాయను సాగుచేస్తున్నారు . మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులున్నా ఒకసారి కాకపోతే మరోసారి రేటు కలిసొస్తుండటంతో రైతులకు, సాగు లాభదాయకంగా మారింది. తొలకరి పంటగా జూన్ నుంచి ఆగష్టు వరకు ఈ పంటను విత్తుకోవచ్చు.

ladies finger Cultivation : బెండతోటలకు  మొజాయిక్  వైరస్ ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ladies finger Cultivation

ladies finger Cultivation : సంవత్సరం పొడవునా స్థిరమైన , నమ్మకమైన ఆదాయాన్ని అందించే కూరగాయ పంట బెండ. ఎకరాకు 80 నుండి 100 క్వింటాళ్ల దిగుబడినిచ్చే ఈ పంటను రైతులు అన్నికాలాల్లోను సాగుచేస్తున్నారు. అయితే ఈ పంటకు ప్రధాన సమస్య ఎల్లోవీన్ మొజాయిక్ వైరస్. నివారణ లేని ఈ వైరస్ ఉధృతి పెరిగితే, పంటపై పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందే. నీటి వసతికింద మే నెల చివరి వారంలో విత్తిన బెండతోటల్లో మొజాయిక్ వైరస్ వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది. దీన్ని అధిగమించే చర్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

READ ALSO : Vegetable Farming : రెండు ఎకరాల్లో కూరగాయలు సాగు.. ఏడాదికి రూ. 4 లక్షల నికర ఆదాయం పొందుతున్న నల్గొండ రైతు

బెండ ఉష్ణ మండల పంట. నీటిపారుదల కింద రైతులు సంవత్సరం పొడవునా ఈ కూరగాయను సాగుచేస్తున్నారు . మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులున్నా ఒకసారి కాకపోతే మరోసారి రేటు కలిసొస్తుండటంతో రైతులకు, సాగు లాభదాయకంగా మారింది. తొలకరి పంటగా జూన్ నుంచి ఆగష్టు వరకు ఈ పంటను విత్తుకోవచ్చు. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటులో వుండటంతో రైతులు ఎకరాకు 10టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారు. బెండ పంటకాలం 90 రోజులు.

READ ALSO : Lady Fingers Cultivation : బెండసాగుతో.. రైతులకు లాభాలు అధికం

మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే 4 నెలల వరకు దిగుబడి తీయవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో మే చివరి వారం నుండి బెండను విత్తారు. బెట్ట పరిస్థితులు ఏర్పడటం వల్ల ఈ తోటల్లో రసంపీల్చు పురుగుల ఉధృతి పెరిగింది. దీంతో బెండకు ప్రధాన శత్రువైన ఎల్లోవీన్ మొజాయిక్ వైరస్ ఉధృతమైంది. దీన్ని తొలిదశలోనే గుర్తించి వెంటనే దీన్ని అధిగమించేందుకు సత్వర చేపట్టాలని సూచిస్తున్నారు కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వి.రత్నాకర్ .

READ ALSO : Lady’s Finger Cultivation : బెండ సాగుకు సిద్ధమవుతున్న రైతులు.. ఎరువులు, కలుపు యాజమాన్యం చేపడితేనే అధిక దిగుబడులు

ఎల్లోవీన్ మొజాయిక్ వైరస్ తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది కనుక తోటలో తెల్లదోమను గమనించిన వెంటనే తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తెల్లదోమ నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి వారం రోజుల వ్యవధితో రెండు సార్లు పిచికారిచేయాలి. పిచికారీచేసే ముందు కోతకు వచ్చిన కాయలను కోసివేస్తే కాయల్లో పురుగు మందుల అవశేషాలు లేకుండా నాణ్యంగా వుంటాయి.