Salman Khan : ఒక్క సిగరెట్ ఎఫెక్ట్.. ‘బిగ్‌బాస్’ని వదిలేసిన సల్మాన్ ఖాన్?

బిగ్‌బాస్ షూటింగ్ గ్యాప్ లో సల్మాన్ స్టేజిపైనే సిగరెట్ తాగినట్టు సమాచారం. సల్మాన్ చేతిలో సిగరెట్ ఉన్న ఫోటో వైరల్ గా మారడంతో సల్మాన్ పై దారుణమైన విమర్శలు వచ్చాయి.

Salman Khan : ఒక్క సిగరెట్ ఎఫెక్ట్.. ‘బిగ్‌బాస్’ని వదిలేసిన సల్మాన్ ఖాన్?

Salman Khan Quits BiggBoss due to Cigarette Issue news goes viral

Salman Khan :  బాలీవుడ్(Bollywood) టాప్ రియాలిటీ షో బిగ్‌బాస్(BiggBoss) ఆల్మోస్ట్ 16 సీజన్లు పూర్తి చేసుకుంది. ఓటీటీలో కూడా ఒక సీజన్ పూర్తి చేసుకొని రెండో సీజన్ ప్రస్తుతం నడుస్తుంది. హిందీ బిగ్‌బాస్ లో దాదాపు 13 సీజన్లు సల్మాన్ ఖాన్ హోస్ట్ చేశాడు. ఇప్పుడు ఓటీటీ(OTT) కూడా సల్మాన్ హోస్ట్ చేస్తున్నాడు. త్వరలో మొదలవనున్న బాలీవుడ్ బిగ్‌బాస్ 17వ సీజన్ కూడా సల్మానే హోస్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం హిందీలో ఓటీటీ బిగ్‌బాస్ జరుగుతుంది. ఇటీవల సల్మాన్ ఖాన్ ఓ ఎపిసోడ్ లో స్టేజిపై సిగరెట్ తాగుతూ కనిపించాడు. సల్మాన్ చేతిలో సిగరెట్ ఉన్న ఫోటో వైరల్ అయింది. షూటింగ్ గ్యాప్ లో సల్మాన్ స్టేజిపైనే సిగరెట్ తాగినట్టు సమాచారం. సల్మాన్ చేతిలో సిగరెట్ ఉన్న ఫోటో వైరల్ గా మారడంతో సల్మాన్ పై దారుణమైన విమర్శలు వచ్చాయి. షూటింగ్ లో స్టేజిపై తాగుతారా? సెలబ్రిటీలు ఇలా తాగి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అంటూ పలు విమర్శలు వచ్చాయి.

Taapsee : పెళ్లిపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు.. పెళ్లి చేసుకోవడానికి నేనేమన్నా ప్రగ్నెంట్ నా?

దీంతో సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ ని వదిలేసినట్టు వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. గత వారం వీకెండ్ ఎపిసోడ్స్ లో బిగ్‌బాస్ కి ఒక రోజు యాంకర్ అభిషేక్, మరో రోజు భారతీ సింగ్ హోస్ట్ చేశారు. దీంతో సల్మాన్ ఖాన్ నిజంగా తప్పుకున్నాడు అనే వార్తలు వచ్చాయి. అయితే దీనిపై సల్మాన్ కానీ, బిగ్‌బాస్ టీం కానీ స్పందించలేదు. ఈ వీకెండ్ ఎపిసోడ్ కి సల్మాన్ వస్తే బిగ్‌బాస్ లో ఉన్నట్టే లేకపోతే తప్పుకున్నట్టే అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో రాబోయే బిగ్‌బాస్ 17వ సీజన్ కి మాత్రం సల్మాన్ ఖాన్ ఉంటాడు హోస్ట్ గా, దాంట్లో మాత్రం మార్పు ఉండదని సమాచారం.