America : అమెరికాలో భారతీయ విద్యార్థినిపై పిడుగుపాటు .. మెదడు,గుండెపై ప్రభావం..మృత్యువుతో పోరాటం

అమెరికా వెళ్లిన భారతీయ యువతి పిడుగుపాటుకు గురైంది. పిడుగుపాటుకు యువతి మెదడుకు డ్యామేజీ అయ్యిందని, గుండె కాసేపు లయ తప్పిందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ప్రాణాలతో పోరాడుతోంది.

America : అమెరికాలో భారతీయ విద్యార్థినిపై పిడుగుపాటు .. మెదడు,గుండెపై ప్రభావం..మృత్యువుతో పోరాటం

Indian student suffers lightning In USA

Indian student suffers lightning In USA : ఉన్నత చదువుల కోసం అమెరికా (USA)వెళ్లిన భారతీయ యువతి (Indian student)పిడుగుపాటు(suffers lightning)కు గురైంది. పిడుగుపాటుకు యువతి మెదడుకు డ్యామేజీ అయ్యిందని, గుండె కాసేపు లయ తప్పిందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ప్రాణాలతో పోరాడుతోంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్‌ ( usa university of houston)లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాస్టర్స్ (Masters in Information Technology)చేస్తున్న 25 ఏళ్ల సుశ్రూణ్య కోడూరు అనే విద్యార్ధిని స్నేహితులతో కలిసి ఓ కొలను వెంబడి నడుచుకుంటు వెళుతున్న క్రమంలో పిడుగు పడింది. దీంతో ఆ పిడుగుపాటుకు ఆమె ఎగిరి కొలనులో పడిపోయింది. జులై మొదటి వారంలో జరిగిన ఈ ఘటనలో ఆమె ప్రస్తుతం కోమాలో ఉంది. డాక్టర్లు ఆమెకు చికిత్సనందిస్తున్నారు.

పిడుగుపాటు ప్రభావానికి ఆమె గుండె 20 నిమిషాల పాటు లయతప్పడంతో మెదడు దెబ్బతిని కోమాలోకి వెళ్లిపోయింది. ఆమె పరిస్థితి క్రిటికల్ గా ఉందని సుదీర్ఘాకాలంపాటు చికిత్సపొందాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో సుశ్రూణ్య బంధువు సురేంద్రకుమార్ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆమెను పెర్క్యుటేనియస్ ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్టోమీ ట్యూబ్ (Percutaneous Endoscopic gastrostomy) సహాయంతో చికిత్సనందిస్తున్నారు.

Johannesburg Explosion : జోహన్నెస్‌బర్గ్‌లో పేలుడు ఒకరి మృతి, 48 మందికి గాయాలు

ఆమెకు చేసిన MRI రిపోర్టులో అనాక్సిక్ ఎన్సెఫలోపతి (anoxic Encephalopathy) ఏర్పడిందని అంటే మెదడుకు ఎక్కువ కాలం ఆక్సిజన్ అందకుండాపోయినప్పుడు ఏర్పడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇది మెదడు కణజాలానికి సెరిబ్ర్ రక్తప్రవాహాన్ని నిలిపివేయడంతో ప్రారంభమయ్యే ప్రక్రియ అని తెలిపారు.

అనాక్సిక్ ఎన్సెఫలోపతితో బాధపడేవారు న్యూరోలాజి సమస్యలు వస్తాయి. ఈ సమస్య ఉన్నవారు ఏకాగ్రతలో సమస్య,తనొప్పి, తలతిరగటం చర్మం నీలం రంగులోకి మారటం వంటివి జరుగుతుంటాయని నిపుణులు తెలిపారు. కాగా సుదీర్ఘకాలంపాటు సుశ్రూణ్యకు వైద్యం అందించాల్సిన పరిస్థితి రావటంతో వైద్య ఖర్చుల కోసం క్రౌడ్ ఫండింగ్ వేదిక ‘గోఫండ్‌మీ’ ద్వారా ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.