Strange Customs : శ్రావణమాసంలో మహిళలు దుస్తులు ధరించని ఆచారం .. భర్తను కూడా కన్నెత్తి చూడరు

ఏడాదిలో ఐదురోజుల పాటు ఆ గ్రామంలో మహిళలు దుస్తులు ధరించరు. ఇంటినుంచి బయటకు రారు. కనీసం భార్యాభర్తలు ఆ ఐదురోజులు మాట్లాడుకోరు. ఇదంతా వారు వేల ఏళ్లుగా పాటిస్తున్నారు.

Strange Customs : శ్రావణమాసంలో మహిళలు దుస్తులు ధరించని ఆచారం .. భర్తను కూడా కన్నెత్తి చూడరు

Pini Village Strange customs

Pini Village Strange Customs : భిన్నత్వంలో ఏకత్వం..ఏకత్వంలో భిన్నత్వం భారతదేశం సొంతం. భారత్ లో ఎన్నో సంప్రదాయాలు మరెన్నో వింత వింత ఆచారాలు. వందలు వేల ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాలను పాటిస్తు ఈనాటికి వింతగొలుపుతుంటాయి కొన్ని ఆచారాలు. అటువంటి సంప్రదాయాల గురించి వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆదిమానవులు దుస్తులు ధరించేవారు కాదని చరిత్రలో చదువుకున్నాం. కానీ ఈ కంప్యూటర్ యుగంలో కూడా దుస్తులు ధరించని సంప్రదాయాలు ఉన్నాయంటే షాక్ అవుతాం. మరి ముఖ్యంగా మహిళలు దుస్తులు ధరించని ఆచారం ఉందంటే కచ్చితంగా ఆశ్చర్యపోతాం..

ఏడాదిలో ఐదురోజుల పాటు ఆ గ్రామంలో మహిళలు దుస్తులు ధరించరు. ఇంటినుంచి బయటకు రారు. కనీసం భార్యాభర్తలు ఆ ఐదురోజులు మాట్లాడుకోరు. ఇదంతా వారు వేల ఏళ్లుగా పాటిస్తున్నారు. అటువంటి అరుదైన సంప్రదాయం గల ఆ గ్రామం పేరు ‘పిని’ (Pini Village). హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో మణికర్ణ లోయలో ఉండే ఈ గ్రామంలో ఏడాదిలో ఐదు రోజుల పాటు అంటే శ్రావణమాసంలో ఐదురోజుల పాటు మహిళలు దుస్తులు ధరించరు. అంతేకాదు ఆ ఐదురోజుల మగవారు మద్యం తాగరు.మాంసం తినరు. భార్యాభర్తలు ఇద్దరు దూరంగా ఉంటారు. కనీసం మాట కూడా మాట్లాడుకోరు. ఈ వింత ఆచారం గల గ్రామాన్ని చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు. కానీ ఆ ఆ ఐదు రోజులు గ్రామంలో పెద్దగా ప్రజలు కనిపించరు. పెద్దగా జనసంచారం లేక గ్రామం నిశ్శబ్దంగా ఉంటుంది.

Snakes : పాములు అంతరించిపోవటం వల్ల .. ఆడబిడ్డలకు వివాహాలు కావటంలేదట

ఏటా శ్రావ‌ణ మాసంలో ఐదురోజుల‌పాటు మహిళలు దుస్తులు ధరించరు. గతంలో అయితే పూర్తి వివస్త్రగా ఉండేవారు. ఇప్పటికే పెద్ద వయస్సుగల స్త్రీలు పూర్తిగా వివస్త్రగానే ఉంటారు. కొంతమంది మాత్రం చున్నీ లాంటివి క‌ప్పుకుంటారు. ఈ ఐదురోజులు వారు ఇంటినుంచి బ‌య‌టికి రారు. భార్య‌భ‌ర్త‌లు ఒక‌రు మాట్లాడుకోరు. దూరంగాఉంటారు. క‌నీసం ఒక‌రినొక‌రు కంటితో కూడా చూసుకోరు.

కానీ ఇప్పుడిప్పుడే ఆ గ్రామంలో చాలా స్వల్పంగా మార్పులు వస్తున్నాయి. యువత పాత సంప్రదాయాలను పాటించటానికి ఆసక్తి చూపటంలేదు. పూర్తి న‌గ్నంగా కాకుండా కాస్త ప‌లుచ‌టి వ‌స్రాల‌ను ధ‌రిస్తున్నారు. కానీ మగవారు మాత్రం ఆ ఐదు రోజులు మ‌ద్యం తాగ‌కుండా, మాంసాహారం తినకుండా ఉంటారు. ఈ సంప్రదాయాలను పాటించకపోతే వారి కొలుచుకునే దేవుళ్లకు కోపం వ‌స్తుంద‌నే నమ్ముతారు. నమ్మకమే వారిని ఈ కంప్యూటర్ యుగంలో కూడా వేల ఏళ్లనాటి సంప్రదాయాన్ని పాటించేలా చేస్తోంది.

Also Read: రజస్వల అయిన కుమార్తె.. సెలబ్రేట్ చేసి సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసిన తండ్రి

ఈ 5 రోజుల ఆచారం ఎందుకు వచ్చింది అనే ఆసక్తికర విషయం గురించి గ్రామ పెద్దలు మాట్లాడుతు.. కొన్ని శతాబ్దాల క్రితం ఈ పిని గ్రామాన్ని దయ్యాలు ఆక్రమించాయట. గ్రామంలోని పెళ్లయిన స్త్రీలకు అందమైన దుస్తులు వేసి తమతో పాటు తీసుకువెళ్లిపోయాయట. దీంతో ఆ గ్రామ దేవత ఆ దెయ్యాలను అడ్డుకుని మహిళలను విడిపించిందట. ఈ విషయాలను తమ తాత ముత్తాలు చెప్పారు అని తెలిపారు. ఇది శ్రావణమాసంలో జరిగింది కాబట్టి అప్పటి నుంచి మహిళలు మంచి వస్త్రాలు వేసుకుంటే రాక్షసులు వస్తారని.. వారిని తీసుకెళ్లిపోతారని భయం పాతుకుపోయింది. దీంతో గ్రామ పెద్దలు శ్రావణమాసంలో మహిళలు దుస్తులు ధరించకూడదని నిర్ణయించారట. అలా ఆ సంప్రదాయం కొనసాగిస్తున్నారు పిని గ్రామస్తులు.