Uttarakhand : రజస్వల అయిన కుమార్తె .. సెలబ్రేట్ చేసి సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసిన తండ్రి

కాలం మారుతోంది. మనుషుల ఆలోచనల్లోను మార్పులొస్తున్నాయి. మార్పు మంచిదే. ఆ మార్పులో భాగంగా ఓ తండ్రి తన కుమార్తె రజస్వల అయ్యిందని ఇది దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదంటూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు.

Uttarakhand : రజస్వల అయిన కుమార్తె .. సెలబ్రేట్ చేసి సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసిన తండ్రి

Parents celebrates daughter first menstruation

Parents celebrates daughter first menstruation : ఇంట్లో ఆడబిడ్డ రజస్వల అయితే మేనమామ రావాలి..తాటాకులు స్వయంగా చెట్టునుంచి నరికి పట్టుకొస్తే ముత్తైదువలు ఆ ఆడబిడ్డను సంప్రదాయాలు పాటించి ఆ తాటాకుల మీద కూర్చోపెడతారు. అలా ఆ ఆడపిల్ల 11 నుంచి 15 రోజుల పాటు అక్కడే కూర్చోపెడతారు. ఎవ్వరు ఆమెను ముట్టుకోకూడదు. అన్ని రోజులు ఆమెకు స్నానం కూడా చేయించరు. ప్రత్యేక వంటకాలువండి ఆమెకు పెడతారు. ఆ తరువాత ఆమెకు ప్రత్యేకంగా స్నానం చేయించి వేడుక చేస్తారు. కానీ కాలం మారిపోయింది. రజస్వలను మైల అనకూడదని..తొలిసారి రుతుస్రావం అయినంత మాత్రాన ఆడపిల్లను అంటరానిదానిలా ఎవ్వరు ముట్టుకోకుండా ఓ మూల కూర్చోపెట్టకూడదంటున్నారు. తొలిసారి రజస్వల అయిన ఆడపిల్లను మైల అనే ఆచారంతో కొన్ని రోజుల పాటు ఓ మూల కూర్చోపెట్టటం మూఢత్వం అని అది మైల కాదు అంటూ ఓ ఆడపిల్ల తల్లిదండ్రులు రసజ్వల అయిన ఆడబిడ్డకు అదే రోజున సంబరాలు చేశారు. బంధు మిత్రులను పిలిచి కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్నారు.

అమ్మాయిలకు పెళ్లి, మాతృత్వం ఎలా ముఖ్యమైనదో… రజస్వల కావడం అనేది కూడా సామాజికపరంగా ఎంతో ప్రాధాన్యతాంశం అనే అవగాహన కలగాలనే ఉద్ధేశంలో ఇలా తమ ఆడబిడ్డ రజస్వల రోజునే ఇలా వేడుక జరుపుకున్నాంటున్నారు ఆ ఆడపిల్ల తల్లిదండ్రులు. ప్రకృతి ప్రకారం స్త్రీలలో రుతుస్రావం అత్యంత సహజ అంశమైన అంశం. అదే సృష్టికి మూలాధారం. కంప్యూటర్ యుగం అని చెప్పుకునే ఈరోజుల్లో కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉండటం మైల అనే పేరుతో దూరంగా పెట్టటం మూఢత్వం అంటున్నారు ఉత్తరాఖండ్ కు చెందిన దంపతులు. అందుకే తమ కుమార్తె తొలి రుతుస్రావాన్ని కూడా ఘనంగా వేడుకలా జరుపుకోవాలని భావించామని చెబుతున్నారు.

Rajasthan minister : మహిళల భద్రతపై సొంత ప్రభుత్వంపైనే విమర్శలు…రాజస్థాన్ మంత్రిపై సీఎం వేటు

ఉత్తరాఖండ్ (Uttarakhand)లో కాశీపూర్ (Kashipurji)లో నివసిస్తున్న జితేంద్ర భట్ (Jitendra Bhatt) అనే వ్యక్తి భార్యా కూతురు ఉన్నారు.వారి కుమార్తె రాగిణి (Ragini) రజస్వల (first menstruation)అయ్యింది. మైల పేరుతో అమ్మాయిని కొన్ని రోజుల పాటు ఎవ్వరు ముట్టుకోకుండా ఓ గదికి పరిమితం చేయటం సరికాదని భావించిన జితేంద్ర దంపతులు తమ కుమార్తె రుతుస్రావాన్ని అందరికీ తెలియజేసారు. బంధుమిత్రులను పిలిచారు. బంధుమిత్రులందరితో కలిసి కుమార్తెతో కేక్ కట్ చేయించి వేడుక ( celebrates )చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆ దంపతులు కుమార్తెకు రుతుస్రావంపై అవగాహన కలిగించేలా కొన్ని విషయాలు తెలిపారు. ఇది సిగ్గుపడాల్సిన అంశం కాదని..దాచిపెట్టుకోవాల్సిన అంశం అంతకన్నా కాదని..ఎటువంటి ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలో అనే విషయాలు తెలిపారు. కుమార్తె తొలి రుతుస్రావ వేడుకకు సంబంధించిన ఫొటోలను జితేంద్ర భట్ తన సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో అవి  వైరల్ అవుతున్నాయి.

కాగా ఈ కంప్యూటర్ యుగంలో కూడా రుతుస్రావాన్ని ఇప్పటికీ మైలగా భావించే ఆచారం దేశంలో ఉంది. ఇది బహిరంగంగా చెప్పుకునే అంశం కాదన్న ధోరణి పాతుకుపోయింది. నెలసరి వచ్చిన స్త్రీలు ఆలయాలకు, శుభకార్యాలకు వెళ్లకూడదనే ఆంక్షలు ఉన్నాయి. ఇది సరైంది కాదని జితేంద్ర దంపతులు తమ కుమార్తె రజస్వల కార్యక్రమాన్ని వేడుకల జరిపారు.