Cows on Apartment Balcony : అపార్ట్‌మెంట్ బాల్కనీలో ఆవుల్ని పెంచుతున్న యజమాని .. ఎన్నో ఫ్లోర్‌లోనో తెలుసా..?

అపార్ట్ మెంట్ లో ఆవులు పెంపకం.. ఏంటీ షాక్ అయ్యారా..? ఓ వ్యక్తి అదే చేస్తున్నాడు.పైగా అందరు కోళ్లను పెంచుకుంటున్నారు..నేను ఆవుల్ని పెంచుకుంటే తప్పేంటీ అంటూ వాదిస్తున్నాడు.

Cows on Apartment Balcony : అపార్ట్‌మెంట్ బాల్కనీలో ఆవుల్ని పెంచుతున్న యజమాని .. ఎన్నో ఫ్లోర్‌లోనో తెలుసా..?

Cows on Apartment Balcony

apartment flat owner seven cows on balcony : అపార్ట్ మెంట్ లో గంజాయి పండించారనే వార్తలు విన్నాం. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఆవుల్నే పెంచేస్తున్నాడు. ఒకటీ రెండు కాదు ఏకంగా ఏడు ఆవుల్ని తన ప్లాట్ అపార్ట్ మెంట్ లో పెంచుతున్నాడు. పశువుల్ని పెంచినట్లుగానే తను నివాసం ఉండే ఐదో అంతస్తు బాల్కనీలో వాటిని పెంచుతున్నాడు.వాటికి గడ్డి వేస్తున్నాడు..నీరు పెడుతున్నాడు.

కానీ పశువులు ఉండే ప్రాంతంలో వచ్చే పేడ వాసన..రొచ్చు వాసన రావటంతో అపార్ట్ మెంట్ వాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏకంగా అపార్ట్ మెంట్ బాల్కనీలో ఆవుల్ని పెంచేస్తున్న ఇతకాడు మామూలోడు కాదనేలా ఉంది. ఐదో ఫ్లోర్ అపార్ట్ మెంట్ బాల్కనీలో ఏడు ఆవులు గడ్డి మేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

చైనాలోని సిచువాన్ ప్రావిన్సుకు చెందిన ఓ రైతు తాను నివసిస్తున్న అపార్ట్ మెంట్ ఐదవ అంతస్తు బాల్కనీలో ఏడు ఆవుల్ని పెంచుతున్నాడు. ఇది కాస్తా వివాదంగా మారింది. ఆ అపార్ట్ మెంట్ చుట్టుపక్కల ఫ్లాట్లలో నివసిస్తున్నవారికి ఆవుల అరుపులు, పేడ వాసన రావటంతో ఆశ్చర్యపోయారు? ఈ ఘాటుగా వాసన ఎక్కడనుంచి వస్తోంది..? అని ఆశ్చర్యపోయారు. రోజు రోజుకు ఆ వాసన ఎక్కువైపోవటంతో చుట్టుపక్కల అపార్ట్ మెంట్ వాసులు నగర అధికారులకు ఫిర్యాదు చేశారు.

Tomato prices : ప్రజలు తినడం మానేస్తే టమోటా ధరలు తగ్గుతాయి…యూపీ మంత్రి ప్రతిభా శుక్లా వివాదాస్పద వ్యాఖ్యలు

దీంతో అధికారులు సదరు అపార్ట్ మెంట్ కు వచ్చి పరిశీలించారు. అసలు విషయం తెలిసింది. ఆ ఆవుల్ని అక్కడనుంచి తరలించాలని తోటి నివాసులకు ఇబ్బంది కలిగించవద్దని చెప్పారు. దీంతో సదరు రైతు అధికారులప ఆగ్రహం వ్యక్తంచేశాడు. మేం గ్రామాల్లో నివసించేవాళ్లం. కానీ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మాతోపాటే మా పశువులు కూడా ఉంటాయని వాదించాడు. ఇక్కడే కొంతమంది కోళ్లను పెంచుకుంటున్నారని అలాగే నేన నా పశువుల్ని పెంచుకుంటే తప్పేంటి..? అని వాదించాడు. కానీ అపార్ట్ మెంట్ లోకి పశువులు ఉండకూడదని అధికారులు అతనికి సూచించారు.వాటిని వేరే ప్రాంతానికి తరలించటంపై మండిపడ్డాడు.

కాగా గ్రామీణ ప్రాంతంలో జీవనం సాగిస్తున్నవారిని పునరావాసం పేరుతో ఇటీవల అపార్ట్‌మెంటులోకి తరలించారు. అదే ఈ సమస్యకు కారణమైంది. వారిలో కొందరు కోళ్లు కూడా పెంచుతున్నట్లు అపార్ట్‌మెంటువాసులు చెబుతున్నారు. కాగా అపార్ట్ మెంట్ బాల్కనీలో ఏడు ఆవులు గడ్డి మేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.