Bandla Ganesh : నేను కాంగ్రెస్‌లోనే ఉంటాను.. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారు.. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలి..
పవన్ ఫ్యాన్ అని చెప్పినా బండ్ల గణేష్ మొదట్నుంచి తెలంగాణలో కాంగ్రెస్ లో ఉంటున్నారు.

Bandla Ganesh Gives Clarity on Party Changing Congress to Janasena
Bandla Ganesh : బండ్ల గణేష్ చాలా రోజుల తర్వాత సినీ మీడియా ముందుకు వచ్చారు. గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బండ్ల గణేష్ మాట్లాడారు. అలాగే మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం పవన్ ఏపీ డిప్యూటీ సీఎం అని తెలిసిందే. కానీ పవన్ ఫ్యాన్ అని చెప్పినా బండ్ల గణేష్ మొదట్నుంచి తెలంగాణలో కాంగ్రెస్ లో ఉంటున్నారు.
తాజాగా దీనిపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఓ మీడియా ప్రతినిధి తెలంగాణ జనసేనలోకి వస్తారా అని అడగ్గా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ఏడేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పాను. నేను చెప్తే అవుతుంది. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు బయటకి వస్తారు, ఆంధ్రని ఏలుతారు అని చెప్పాను, జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారు. నా బ్లడ్ కాంగ్రెస్. నేను రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్ లో ఉంటాను లేకపోతే రాజకీయాలు వదిలేస్తాను. నేను కాంగ్రెస్ వాదిని. పవన్ కళ్యాణ్ కి అభిమానిని, సినిమా నిర్మాతని, చిరంజీవి అంటే ప్రాణం. నేనెప్పుడూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటాను. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలి. నేను ఉంటే కాంగ్రెస్ లో ఉంటాను లేకపోతే కోళ్ల వ్యాపారం, సినిమాలు చేసుకుంటాను. ఇంకో పార్టీలోకి వెళ్ళను అంటూ క్లారిటీ ఇచ్చారు.
దీంతో బండ్ల గణేష్ తెలంగాణలో కాంగ్రెస్ లోనే ఉంటాడని, పవన్ కోసం జనసేనలోకి వెళ్లడని మరోసారి క్లారిటీ ఇచ్చాడు.