Tomato prices : ప్రజలు తినడం మానేస్తే టమోటా ధరలు తగ్గుతాయి…యూపీ మంత్రి ప్రతిభా శుక్లా వివాదాస్పద వ్యాఖ్యలు

ఆకాశన్నంటిన టమోటా ధరలపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా మంత్రి ప్రతిభా శుక్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టమోటాలు తినడం మానేస్తే పెరిగిన ధరలు తగ్గుతాయని ప్రతిభా శుక్లా వ్యాఖ్యానించారు....

Tomato prices : ప్రజలు తినడం మానేస్తే టమోటా ధరలు తగ్గుతాయి…యూపీ మంత్రి ప్రతిభా శుక్లా వివాదాస్పద వ్యాఖ్యలు

UP Minister Pratibha Shukla

Updated On : July 24, 2023 / 8:59 AM IST

Tomato prices will decline : ఆకాశన్నంటిన టమోటా ధరలపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా మంత్రి ప్రతిభా శుక్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టమోటాలు తినడం మానేస్తే పెరిగిన ధరలు తగ్గుతాయని ప్రతిభా శుక్లా వ్యాఖ్యానించారు. (if you quit eating) పెరుగుతున్న టమోటాల ధరలు అంతుచిక్కనివిగా మారాయని ఆమె చెప్పారు. ఖరీదైన టమోటాలను ఎవరూ కొనుగోలు చేయనందున ధర తగ్గుతుందని ఆమె పేర్కొన్నారు. (Tomato prices will decline)

Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదులో పురావస్తు సర్వే ప్రారంభం

టమోటాలు కొనుగోలు చేయకపోతే, వ్యర్థాలను నివారించడానికి ధరలు తగ్గుతాయని మంత్రి (UP Minister Pratibha Shukla) అన్నారు. వీటి ధరలను తగ్గించడానికి తోటలు ఎక్కువగా పెంచాలని, ఇళ్లలోని కుండీల్లోనూ టమోటా మొక్కలు నాటాలని మంత్రి సూచించారు.

Indian woman : భారతీయ మహిళ ఫేస్‌బుక్ స్నేహితుడిని కలవడానికి పాక్ వెళ్లింది…

ఖరీదైన టమోటాల స్థానంలో నిమ్మకాయలు ప్రత్యామ్నాయం కావచ్చని మంత్రి చెప్పారు. టమోటా ధరలు ఆకస్మాత్తుగా పెరగడం వల్ల దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపించిందని, అధిక ధరలతో వీటి వినియోగం తగ్గిందని మంత్రి తెలిపారు.