Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదులో పురావస్తు సర్వే ప్రారంభం

జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం సోమవారం శాస్త్రీయ సర్వేను ప్రారంభించింది. కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు ఆలయంపై నిర్మించబడిందా లేదా అని నిర్ధారించడానికి ఈ సర్వే చేపట్టారు....

Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదులో పురావస్తు సర్వే ప్రారంభం

Gyanvapi Mosque survey

Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) బృందం సోమవారం శాస్త్రీయ సర్వేను ప్రారంభించింది. కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు ఆలయంపై నిర్మించబడిందా లేదా అని నిర్ధారించడానికి ఈ సర్వే చేపట్టారు. జ్ఞానవాపి మసీదులో సోమవారం నుంచి సర్వే ప్రారంభమైందని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ ఎస్ రాజలింగం చెప్పారు. (ASI begins survey of Gyanvapi Mosque complex) ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం వారణాసికి ఆదివారమే చేరుకుందని, సోమవారం ఉదయం 7 గంటలకు జ్ఞానవాపి కాంప్లెక్స్ సర్వే ప్రారంభించిందని హిందువుల తరపు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ చెప్పారు.

Pakistani Seema Haider : సచిన్ ప్రేమ కోసమే భారత్ వచ్చా…సీమా హైదర్ తాజా వ్యాఖ్య

సర్వే బృందంతో పాటు పిటిషనర్లలో ఒక్కో న్యాయవాది ఉన్నారని ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని వరణాసిలోని మసీదు ఆలయంపై నిర్మించారో లేదో తెలుసుకోవడానికి అవసరమైన చోట తవ్వకాలతో సహా వివరణాత్మక శాస్త్రీయ సర్వేను నిర్వహించాలని జిల్లా న్యాయమూర్తి ఎకె విశ్వేష్ శుక్రవారం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆదేశించారు.

Indian woman : భారతీయ మహిళ ఫేస్‌బుక్ స్నేహితుడిని కలవడానికి పాక్ వెళ్లింది…

మసీదులోని వజుఖానాలో శివలింగం ఉందని హిందూ న్యాయవాదులు పేర్కొంటున్నారు. మసీదు కాంప్లెక్స్‌లోని ఆ స్థలాన్ని పరిరక్షిస్తూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అనుసరించి సర్వే ప్రక్రియకు సంబంధించిన వీడియోలు, ఫొటోలతో కూడిన నివేదికను ఆగస్టు 4వతేదీ లోగా కోర్టుకు సమర్పించాలని ఏఎస్‌ఐని న్యాయమూర్తి ఆదేశించారు. మసీదు కాంప్లెక్స్ మొత్తం కాశీ దేవాలయానికి చెందిందని, ఈ సర్వేలో ఈ విషయం బయటపడుతుందని సుభాష్ నందన్ చతుర్వేది చెప్పారు.