Pakistani Seema Haider : సచిన్ ప్రేమ కోసమే భారత్ వచ్చా…సీమా హైదర్ తాజా వ్యాఖ్య

పబ్ జి ఆట ద్వారా పరిచయమైన ప్రేమికుడు సచిన్ కోసం పాకిస్థాన్ వదిలి వీసా లేకుండా అక్రమంగా భారతదేశంలోకి వచ్చిన పాక్ పౌరురాలు సీమా హైదర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు....

Pakistani Seema Haider : సచిన్ ప్రేమ కోసమే భారత్ వచ్చా…సీమా హైదర్ తాజా వ్యాఖ్య

Pakistani Seema Haider

Pakistani Seema Haider : పబ్ జి ఆట ద్వారా పరిచయమైన ప్రేమికుడు సచిన్ కోసం పాకిస్థాన్ వదిలి వీసా లేకుండా అక్రమంగా భారతదేశంలోకి వచ్చిన పాక్ పౌరురాలు సీమా హైదర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సచిన్ మీనాపై ఏర్పడిన ప్రేమతోనే తాను స్వదేశాన్ని వదిలి భారతదేశానికి వచ్చానని సీమా హైదర్ చెప్పారు. (I am here only for my love for Sachin)  నోయిడాలోని తన మెట్టినింట్లో పిల్లలు, భర్తతో కలిసి నివాసం ఉంటున్న సీమా తనకు క్షమాభిక్ష ప్రసాదించి భారత పౌరసత్వం ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. (Pakistani Seema Haider) తన కేసును నోయిడా పోలీసులు, ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

Indian woman : భారతీయ మహిళ ఫేస్‌బుక్ స్నేహితుడిని కలవడానికి పాక్ వెళ్లింది…

తాను పాకిస్థాన్‌కు తిరిగి వెళితే తన ప్రాణాలతో పాటు తన పిల్లల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని సీమా అన్నారు. ‘‘నేను తల్లిని సార్, నా పిల్లల భద్రత గురించి నేను పట్టించుకుంటాను, సచిన్ పై నాకున్న ప్రేమ కోసమే ఇక్కడకు వచ్చాను’’ అని ఆమె పేర్కొన్నారు. ఒకప్పటి తన మాతృదేశమైన పాకిస్థాన్ ఇప్పుడు తనకు శత్రు దేశమని సీమా హైదర్ వ్యాఖ్యానించారు. (Pakistan is now my enemy)

Plane Crash : పోర్ట్ సుడాన్ విమానాశ్రయంలో కూలిన విమానం…9మంది మృతి

పాకిస్థాన్‌లోని ప్రజలు తన గురించి ఏం మాట్లాడుతున్నారో తనకు తెలుసునన్నారు. కాబట్టి పాకిస్థాన్ తిరిగి వెళ్లడం తనకు ఎంతో ప్రమాదకరమని ఆమె ఉద్ఘాటించారు. ‘‘భారతీయులు నన్ను నమ్మాలి. నేను నిజం చెబుతున్నాను’’ అని సీమా వివరించారు.