Oppenheimer : శృంగార స‌న్నివేశంలో భగవద్గీత.. మండిప‌డుతున్న భార‌తీయులు.. తొల‌గించ‌క‌పోతే ఊరుకోం

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన హాలీవుడ్ సినిమా ఓపెన్‌ హైమర్‌. ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది.

Oppenheimer : శృంగార స‌న్నివేశంలో భగవద్గీత.. మండిప‌డుతున్న భార‌తీయులు.. తొల‌గించ‌క‌పోతే ఊరుకోం

Oppenheimer

BoycottOppenheimer : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిస్టోఫర్ నోలన్ (Chirstopher Nolan) డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన హాలీవుడ్ సినిమా ఓపెన్‌ హైమర్‌’ (Oppenheimer). ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. అయితే సినిమాలోని ఓ స‌న్నివేశంలో హీరో చెప్పే డైలాగులు వివాదాస్ప‌దంగా మారాయి. శృంగార స‌న్నివేశంలో హీరో భ‌గ‌వ‌ద్గీత‌లోని ఓ శ్లోకాన్ని చ‌ద‌వ‌డంపై కొంత మంది భార‌తీయులు మండిప‌డుతున్నారు.

భార‌తీయులు ఎంతో పవిత్రంగా భావించే భ‌గ‌వ‌ద్గీత ను ఆ సంద‌ర్భంలో చూపించ‌డం స‌రైన‌ది కాద‌ని, వెంట‌నే సినిమాలోంచి ఆ స‌న్నివేశాల‌ను తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. బాయ్‌కాట్ ఓపెన్‌హైమ‌ర్‌(#BoycottOppenheimer), రెస్పెక్ట్ హిందూక‌ల్చ‌ర్ (#RespectHinduCulture)అన్న హ్యాష్‌ట్యాగ్‌లు సోష‌ల్ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి.

Mukku Avinash : కొత్త కారు కొన్న అవినాష్‌.. మండిప‌డుతున్న నెటీజ‌న్లు.. ఎందుకంటే..?

అటు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్ సైతం ఆ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శృంగార సన్నివేశంలో హీరో చేత భగవద్గీత పఠింపజేయడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. సినిమాలోని అభ్యంతరకరమైన సన్నివేశాలను సెన్సార్‌ బోర్డు తొలగించకపోవడంపై కూడా మండిప‌డ్డారు. సెన్సార్ బోర్డు ఎలా స‌ర్టిఫికెట్ ఇచ్చింద‌ని ప్ర‌శ్నించారు. వెంట‌నే స‌న్నివేశాల‌ను తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు.

భారత ప్రభుత్వ సమాచార కమిషనర్ ఉదయ్ మహుర్కర్ ఈ సన్నివేశంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దానిని చిత్రం నుండి తొలగించాలని పిలుపునిచ్చారు. నోలన్‌కు రాసిన బహిరంగ లేఖలో.. మహూర్కర్ ఈ సన్నివేశాన్ని “హిందూ మతంపై కలవరపరిచే దాడి”గా పేర్కొన్నారు.

BiggBoss 7 : ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ కి అర్థం తెలిసిపోయింది.. నాగార్జున బ‌య‌ట పెట్టేశాడుగా..!

ఆట‌మ్ బాంబును క‌నుగొన్న జె.రాబ‌ర్ట్ ఓపెన్ హైమ‌ర్ జీవితం ఆధారంగా ఓపెన్‌ హైమర్‌ను తెర‌కెక్కించారు. సిలియ‌న్ మ‌ర్ఫీ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. జూలై 21 ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కాగా.. అటామిక్ బాంబు పితామ‌హుడు జే రాబ‌ర్ట్ ఓపెన్‌హైమ‌ర్‌కు, భ‌గ‌వ‌ద్గీత‌కు ప్రత్యేక అనుబంధం ఉంద‌న్న విష‌యాన్ని చెప్పేందుకు ఆ సీన్ తీసిన‌ట్లు నిర్మాత‌లు అంటున్నారు.