Anand Mahindra : చెట్టు తొర్రలో టీ దుకాణానికి ఆనంద్ మహీంద్రా ఫిదా.. ‘టెంపుల్‌ ఆఫ్‌ టీ సర్వీస్‌’కు వెళ్తానంటూ ప్రశంసలు

ఆపెద్దాయన వ్యక్తిత్వానికి ఆనంద్ మహీంద్రా ఫిదా అయిపోయారు. చెట్టు తొర్రలో టీ షాపును ‘టెంపుల్‌ ఆఫ్‌ టీ సర్వీస్‌’ అంటూ అభివర్ణించారు.తప్పకుండా నేను వెళ్తా..ఆయన చేతి టీ రుచి చూస్తానంటూ తెలిపారు.

Anand Mahindra : చెట్టు తొర్రలో టీ దుకాణానికి ఆనంద్ మహీంద్రా ఫిదా.. ‘టెంపుల్‌ ఆఫ్‌ టీ సర్వీస్‌’కు వెళ్తానంటూ ప్రశంసలు

Anand Mahindra..Temple of Tea Service

Anand Mahindra – Temple of Tea Service : అదో పెద్ద మర్రి చెట్టు..ఆ చెట్టు కింద ఓ పెద్దాయన టీ షాపు (Tea Shop) నడుపుతున్నారు. ఆయన టీకి ఆయన షాపు ఉన్న స్థలానికి స్థానికులు ఫిదా అయిపోతుంటారు. అక్కడికొచ్చి పెద్దాయన చేత్తో ఓ గాజు గ్లాసుతో ఇచ్చే టీ తాగటానికి ఎంతో ఇష్టపడుతుంటారు. ‘చెట్టు కింద తొర్రలో చెట్టు తొర్రలో టీ దుకాణానికి.. వృద్ధాప్యంలో ఎవరిమీదా ఆధారపడకుండా ఆపెద్దాయన వ్యక్తిత్వానికి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra)కూడా ఫిదా అయిపోయారు.

దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తు ‘టెంపుల్‌ ఆఫ్‌ టీ సర్వీస్‌’ అంటూ అభివర్ణించారు. ఆ టెంపు ఆఫ్ టీ సర్వీసు కు నేను కూడా తప్పకుండా వెళ్తాను అని పేర్కొన్నారు. 40 ఏళ్లుగా ఆయన టీ దుకాణం నిర్వహిస్తున్నారు… ఆయనను ఆదరిస్తున్న మన హృదయాలు పెద్ద దేవాలయాలు అంటూ ట్వీట్‌ చేశారు. అంతేకాదు ‘‘అమృత్‌సర్‌లో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఈ సారి నేను అమృత్‌సర్‌కు వెళ్లినప్పుడు గోల్డెన్‌ టెంపుల్‌తోపాటు బాబాజీ ‘టెంపుల్‌ ఆఫ్‌ టీ సర్వీస్‌’కు కూడా తప్పక వెళ్తాను. 40 ఏళ్లుగా ఆయన టీ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయనను ఆదరిస్తున్న మన హృదయాలు పెద్ద దేవాలయాలు’’ అని మహీంద్రా ట్వీట్‌ చేశారు.

Silver Wedding chappal : వధూవరుల కోసం వెండి చెప్పులు .. ముత్యాలు, రత్నాలతో డిజైన్

ఓ పెద్ద మర్రి చెట్టు కింద టీ అమ్ముకుంటున్న వృద్ధుడి వీడియోను మహీంద్రా ట్విటర్‌లో షేర్ చేస్తు పంజాబ్ లోనే అమృత్ సర్ కు చెందిన అజిత్ సింగ్ అనే పెద్దాయన 40 ఏళ్లుగా అదే చెట్టు తొర్రలో టీ షాపు నిర్వహిస్తున్నారు. స్థానికులు ఆయన్ని బాబా అంటూ ఆప్యాయంగా గౌరవంగా పిలుచుకుంటారు. ప్రతీరోజు ఉదయం 9గంటలనుంచి సాయంత్రం 4 గంటలవరకు టీ షా కొనసాగుతుంది. బాబాజీ టీ ఎంతో బావుంటుందని ఓ కస్టమర్‌ చెబుతున్నాడు ఈ వీడియోలో.

ఎన్నో సామాజిక అంశాలను.. కష్టపడి జీవించే వారి గురించి ట్వీట్ చేస్తే ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ టెంపుల్ ఆఫ్ ట్రీ సర్వీస్ కు చూసిన నెటిజన్లు అమృత్‌సర్‌ వెళ్లినప్పుడు తాము కూడా తప్పకుండా బాబాజీ టీ దుకాణానికి వెళ్తామని కామెంట్లు చేస్తున్నారు.

Twins Bananas : జంట అరటిపండ్లు తింటే కవలపిల్లలు పుడతారా..? వెరీ ఇంట్రస్టింగ్..!

ఈ వీడియోనే కాదు ఇలాంటి వ్యక్తుల స్ఫూర్తిగాథలను ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ద్వారా వెలుగులోకి తెస్తుంటారు. అలాగే వినూత్నం ఎవరైనా పనులు చేసినా టెక్నాలజీని వినూత్నంగా వినియోగించినా ఇలా ఒకటీ రెండు కాదు వినూత్నంగా ఏది కనిపించినా ఆనంద్ మహీంద్రా స్పందిస్తుంటారు.