Old Plane Boarding Pass : అప్పట్లో విమానం పాత బోర్డింగ్ పాస్ చూశారా? ఇంటర్నెట్‌లో ఇదే ట్రెండింగ్..!

Old Plane Boarding Pass : విమాన ప్రయాణాల్లో ధూమపానంపై విమానయాన సంస్థలు, ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నాయి. ఒకప్పుడు విమానంలో స్వేచ్ఛగా ఆమోదించిన కార్యకలాపాలను పూర్తిగా నిషేధించాయి.

Old Plane Boarding Pass : అప్పట్లో విమానం పాత బోర్డింగ్ పాస్ చూశారా? ఇంటర్నెట్‌లో ఇదే ట్రెండింగ్..!

Pic Of Old Plane Boarding Passes Goes Viral, ( Image Source : Google )

Old Plane Boarding Pass : సంవత్సరాలు గడిచేకొద్ది విమాన ప్రయాణం గణనీయంగా మారిపోయింది. విమానంలో ధూమపానం చేయడం అనేది డ్రింక్ ఆర్డర్ చేసినంత సాధారణమైనది. విమానంలో సీటు బుక్ చేసుకునేటప్పుడు “స్మోకింగ్ లేదా నాన్ స్మోకింగ్” అనేది ప్రయాణికులను తరచుగా అడిగే ప్రశ్న.

Read Also : Apple iPhone 16 : ఆపిల్ ఐఫోన్ 16 లాంచ్ ఈవెంట్‌ ఎప్పుడో తెలిసిందోచ్.. ఫీచర్లు, ధర పూర్తి వివరాలు మీకోసం..!

విమాన ప్రయాణాల్లో ధూమపానం చేసే వారి సంఖ్య పెరగడంతో విమానయాన సంస్థలు, ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నాయి. ఒకప్పుడు విమానంలో స్వేచ్ఛగా ఆమోదించిన కార్యకలాపాలను పూర్తిగా నిషేధించాయి. ఇటీవల, సోషల్ మీడియా యూజర్లు “నాన్-స్మోకింగ్ క్యాబిన్” పేరుతో కూడిన పాత బోర్డింగ్ పాస్‌ ఫొటోను షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.

సోషల్ యూజర్ కొనుగోలు చేసిన సెకండ్‌హ్యాండ్ బుక్ మొదటి పేజీ నుంచి పడిపోయిన పాత బోర్డింగ్ పాస్‌ల ఫొటోను షేర్ చేశారు. లండన్ హీత్రూ నుంచి మొరాకోలోని కాసాబ్లాంకాకు వెళ్తున్న విమానంలో “నాన్-స్మోకింగ్ క్యాబిన్” కోసం పాస్‌లు ఉన్నాయి.

“నేను ఇలాంటి వాటిని చూడటానికి ఆన్‌లైన్‌లో ప్రతిచోటా వెతకడానికి ప్రయత్నించాను. వారి వయస్సు ఎంత అని నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. కానీ ఏమీ కనుగొనలేకపోయాను. నాన్ స్మోకింగ్ క్యాబిన్ నన్ను 1980ల కన్నా ముందే ఆలోచించేలా చేస్తోంది. మీరు ఎవరైనా ఇలాంటిది గమనించారా?” అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్న అడిగాడు.

ఈ సాధారణ ప్రశ్న సోషల్ మీడియాలో చాలా మంది దృష్టిని ఆకర్షించింది. చాలామందికి విమానాల్లో ధూమపానం అనుమతించారని గ్రహించలేదు. “ధూమపానం ఒకప్పుడు సాధారణం. విమానాలలో కూడా 2000 సంవత్సరం నాటికి అనుమతించేవారు” ఒక యూజర్ పేర్కొన్నారు.

టిక్కెట్లు హీత్రో టీ2, ఎయిర్ ఫ్రాన్స్ కొత్త టీ2ని ఉపయోగించనందున ఇది 1955 నుంచి 2009 మధ్య అయి ఉంటుందని మరో యూజర్ వివరించారు. ఎఎఫ్‌ఎస్ఎల్ అనేది ఎయిర్ ఫ్రాన్స్ సర్వీసెస్ లిమిటెడ్ అని పేర్కొన్నారు. 1996లో ఏర్పడి 2009లో రద్దు అయింది. 2000లో ఎయిర్ ఫ్రాన్స్ ధూమపానాన్ని నిషేధించిందని, ఈ విమాన టిక్కెట్ 1996 నుంచి 2000 మధ్య చెందినది కావచ్చునని మరో యూజర్ తెలిపాడు.

ధూమపానం నిషేధించిన చాలా కాలం తర్వాత వాటిపై “నాన్-స్మోకింగ్” అని రాసి ఉన్న విమాన టిక్కెట్లను కొనుగోలు చేసినట్లు గుర్తుంది. విమానంలో చాలాకాలం వరకు టికెటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేయలేదన్నారు. అది అంత ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. డిజైన్ ఆధారంగా మాత్రమే అంచనా వేయాల్సి వస్తే.. 1990 నాటిదిగా సోషల్ యూజర్లు కామెంట్లు పెడుతున్నారు.

Is anyone able to date these boarding passes?
byu/Hour-Work6565 inAskUK

Read Also : Jio PhoneCall AI : జియో ఫోన్‌కాల్ ఏఐ అంటే ఏంటి? ఇదేలా పనిచేస్తుంది? ఎప్పుడు వస్తుంది?