Jio PhoneCall AI : జియో ఫోన్‌కాల్ ఏఐ అంటే ఏంటి? ఇదేలా పనిచేస్తుంది? ఎప్పుడు వస్తుంది?
Jio PhoneCall AI : జియో యూజర్లు రియల్ టైమ్‌లో సంభాషణలను రికార్డ్ చేయడం, ట్రాన్స్‌స్ర్కైబ్, ట్రాన్సులేషన్ చేసేందుకు అనుమతిస్తుంది.

Jio PhoneCall AI _ What is it ( Image Source : Google )
Jio PhoneCall AI : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో 47వ వార్షిక సాధారణ సమావేశంలో జియో ఫోన్‌కాల్ ఏఐ, ఏఐ ఆధారిత సర్వీసును ప్రవేశపెట్టింది. జియో అందించిన ఈ కొత్త సర్వీసు ఏఐ టెక్నాలజీతో ఫోన్ కాల్‌లకు ఇంటిగ్రేట్ అవుతుంది.
జియో యూజర్లు రియల్ టైమ్‌లో సంభాషణలను రికార్డ్ చేయడం, ట్రాన్స్‌స్ర్కైబ్, ట్రాన్సులేషన్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్ జియో “కనెక్టెడ్ ఇంటెలిజెన్స్” లో భాగంగా జియో యూజర్ల కోసం అన్ని భాషలలో ఫోన్ కాల్ మేనేజ్‌మెంట్ యాక్సస్ మెరుగుపరచడమే లక్ష్యంగా కంపెనీ చెబుతోంది. జియో అందించే ఈ కొత్త ఏఐ సర్వీస్ ఫీచర్లతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో వివరంగా చూద్దాం.
జియో ఫోన్‌కాల్ ఏఐ అంటే ఏమిటి? :
జియో ఫోన్‌కాల్ ఏఐ అనేది జియో అందించిన కొత్త ఏఐ-ఆధారిత సర్వీసు. ఫోన్ కాల్‌ల కోసం ఏఐ-ఆధారిత ఫీచర్‌లను అందిస్తుంది. రికార్డింగ్,ట్రాన్స్‌స్ర్కైబ్, ట్రాన్సులేషన్ వంటివి ఉంటాయి. మాట్లాడే పదాలను టెక్స్ట్‌గా మార్చడం, సంభాషణలను సేవ్ చేయడం, బహుళ భాషల్లోకి ట్రాన్సులేట్ చేయడం ద్వారా వినియోగదారులు తమ కాల్‌లను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చు.
జియో ఫోన్‌కాల్ ఏఐని ఎలా ఉపయోగించాలి? :
- మీరు మరో పార్టిసిపెంట్‌ని జాయిన్ చేయడానికి కొనసాగుతున్న కాల్‌కు జియో ఫోన్‌కాల్ ఏఐ నంబర్ (1-800-732-673)ని డయల్ చేయాలి.
- కనెక్ట్ అయిన తర్వాత ఏఐ అసిస్టెంట్ కోసం రెడీగా ఉందని నిర్ధారిస్తూ వెల్‌కమ్ మెసేజ్ ప్లే అవుతుంది.
- సంభాషణను రికార్డ్ చేయడం, ట్రాన్సుస్ర్కైబ్ చేయడం కోసం #1ని నొక్కండి.
- ఏఐ రియల్ టైమ్ మాట్లాడే పదాలను టెక్స్ట్‌గా వినడం మార్చడం చేస్తుంది.
- కాల్‌లో పాల్గొనే వారందరికీ తెలియజేయడానికి కాల్ రికార్డ్ అవుతుందని ఇండికేషన్ వస్తుంది.
- మీరు ఏ సమయంలోనైనా ట్రాన్స్‌క్రిప్షన్‌ను పాజ్ చేయవలసి వస్తే.. #2 నొక్కండి.
- ట్రాన్స్‌స్ర్కైబ్ పాజ్ చేసినట్టుగా ఏఐ నిర్ధారిస్తుంది.
- మళ్లీ రీస్టార్ట్ చేయడానికి #1ని ట్యాప్ చేయండి. ఏఐ కాల్‌ని ట్రాన్స్‌స్ర్కైబ్ కొనసాగిస్తుంది.
- ఏఐ షేరింగ్ ఆపడానికి #3 ట్యాప్ చేయండి.
- కాల్‌ని రికార్డ్ చేయడం, ట్రాన్స్‌స్క్రైబ్ చేయడం ఆపివేసినట్లు ఏఐ నిర్ధారిస్తుంది.
కాల్ ఎండ్ తర్వాత అన్ని రికార్డింగ్‌లు, ట్రాన్స్‌స్క్రైబ్, ట్రాన్సులేషన్స్ సురక్షితంగా జియో క్లౌడ్‌లో స్టోర్ అవుతాయి. వినియోగదారులు తమ కాల్ డేటాను మేనేజ్ చేసేందుకు రివ్యూ లేదా షేరింగ్ కోసం ఎప్పుడైనా ఈ ఫైల్‌లను యాక్సెస్ చేయొచ్చు.
జియో ఫోన్‌కాల్ ఏఐ లభ్యత :
జియో కొత్త ఫీచర్‌ను ప్రకటించినప్పటికీ, జియో లభ్యత ఎప్పుడు అనేది రివీల్ చేయలేదు. రాబోయే వారాల్లో జియో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏఐ ఫీచర్ వినియోగదారులకు అనేక ఫీచర్లను అందించనుంది.