Twin Bananas : జంట అరటిపండ్లు తింటే కవలపిల్లలు పుడతారా..? వెరీ ఇంట్రస్టింగ్..!

జంట అరటిపండ్లు తింటే కవలపిల్లలు పుడతారా..? ఇది కేవలం నమ్మకమేనా..? నిజమా..? పెద్దలు పెళ్లికాని ఆడపిల్లలను, గర్భిణులకు జంట అరటిపండ్లు తినవద్దని ఎందుకు చెబుతారు..?

Twin Bananas : జంట అరటిపండ్లు తింటే కవలపిల్లలు పుడతారా..? వెరీ ఇంట్రస్టింగ్..!

pregnant woman eat Twins Bananas

Twin Bananas : అరటి పండు శరీరానికి తక్షణ శక్తినించే పండు అంటారు నిపుణులు. గుండెను పదిలంగా ఉంచే అరటిపండ్లు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణలు సూచిస్తుంటారు. అటువంటి అరటిపండ్లు భారతీయ సంప్రదాయంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంటాయి. శుభకార్యం ఏదైనా అరటి పండ్లు ఉండాల్సిందే. ఇంకా చెప్పాలంటే ఆరోగ్యాలను కలిగించేవన్నీ భారతీయ సంప్రదాయంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఉదాహరణకు అరటిపండ్లు, కొబ్బరి వంటివి. అరటి పండ్లు ఎంత ఆరోగ్యమో అరటి కాండం పూజల్లో అత్యంత ప్రధానమైనది. అరటి కాండం (అరటి డొప్పలు) కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తారు. ఇలా అరటి గురించి చెప్పుకోవాలంటే ఎన్నో విశేషాలున్నాయి.

గర్భిణులకు కూడా అరటి పండ్లు బలాన్నిస్తాయి. మంచి శక్తినిస్తాయి. కానీ గర్భిణులు అరటిపండ్లు తినవచ్చు గానీ ‘జంట అరటిపండ్లు’ అంటే కవల అరటిపండ్లను తినకూడదని పెద్దలు చెబుతుంటారు. జంట అరటిపండ్లు తింటే కవల పిల్లలు పుడతారని అంటుంటారు. అలాగే పెళ్లికాని ఆడపిల్లలు కూడా ఈ జంట అరటి పండ్లు తినకూడదంటారు. అలా తింటే వారికి వివాహం అయ్యాక కవల పిల్లలు పుడతారని పెద్దలు చెబుతుంటారు.

Names of Rains : వానల్లో ఎన్ని రకాలున్నాయో తెలుసా..? వాటి పేర్లు, అర్థాల్లో ఆసక్తికర విషయాలు..

కానీ ఇటువంటివి నమ్మవద్దని డాక్టర్లు చెబుతుంటారు. కానీ పెద్దలు మాత్రం అటువంటి జంట అరటిపండ్లు తినవద్దనే చెబుతుంటారు. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ చాలా మంది ఈ విషయాన్ని నమ్ముతారు. ఇది మన భారతీయులకే కాదు ఇతరదేశాల్లో కూడా ఇటువంటి నమ్మకాలున్నాయట. ఫిలిప్పీన్స్ కూడా జంట అరటిపండ్లు తింటే కవల పిల్లలు పుడతారని నమ్ముతారట. అంటే గర్భిణీ స్త్రీ తన మొదటి మూడు నెలల్లో జంట అరటిపండు తింటే, ఆమెకు ఖచ్చితంగా కవలలు పుడతారని ఫిలిప్పీన్స్ గాఢంగా నమ్ముతారట.

కానీ కవల పిల్లలు పుట్టాలని కోరుకునేవారు కావాలని ఇటువంటి జంట అరటిపండ్లను ఏరి కోరి మరీ తింటారట. అలా తిన్నవారికి కవలపిల్లలు పుట్టారట. దీంతో ఫిలిప్పీన్స్ లో ఇది బాగా నాటుకుపోయింది. దీంతో కవలపిల్లలు పుట్టాలని ఆశపడేవారు జంట అరటిపండ్లను తింటారట. కానీ భారతీయుల్లో మాత్రం అది నిజమోకాదో గానీ పెద్దలు చెప్పింది వినాలనే భావన ఉంది.

అయితే ఈ మాట ఎంతవరకు నిజం అనే ప్రశ్న చాలామందిలో మెదులుతోంది నిజానికి, ఒక జత అరటిపండ్లు కవలలను ఉత్పత్తి చేస్తాయనే ఆలోచన శాస్త్రీయంగా ఎక్కడా నిరూపించబడలేదు. అరటిపండు తినడం ఆరోగ్యానికి మంచిది. ఇందులో పోటాషియం ఎక్కువగా ఉండటం వలన గర్భిణీలు తినవచ్చు. అందుకే అరటి పండ్లు తినాలని చెబుతుంటారు. కానీ ఎక్కువగా తినవద్దని చెబుతుంటారు.

Laughter Benefits : బీపీని దూరం చేయటంతో పాటు, గుండె ఆరోగ్యానికి మేలు చేసే నవ్వు !

అరటిపండ్లను ఎక్కుకవగా తింటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం, అంతర్గత రక్తస్రావం, గుండె కొట్టుకునే వేగం తగ్గడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని కాబట్టి ఎక్కువగా తినవద్దని చెబుతుంటారు.

కానీ మానవ సైకాలజీ ప్రకారం శాస్త్రీయం కంటే నమ్మకమే ఎక్కువగా పనిచేస్తుంది. దీంతో చాలామంది గర్బిణులు కవల అరటిపండ్లు తినటానికి భయపడుతుంటారు పెద్దలు చేసే హెచ్చరికల వల్ల. కానీ ఇదంతా వారి వారి నమ్మకాలమీద ఆధారపడి ఉంటుంది. ఇది కేవలం అందించిన సమాచారం మేరకే తప్ప ఎటువంటి నిర్ధారణలేదనే విషయాన్ని గ్రహించగలరు..