బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకలు.. టాలీవుడ్‌లోని ఇద్దరు బ్రదర్స్‌కు నో ఇన్విటేషన్?
ఇదే సమయంలో నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు కల్యాణ్‌రామ్‌కు ఆహ్వానం అందలేదని..

NBK 50 Years Celebrations: నందమూరి నటసింహం.. ఎన్‌బీకే గోల్డెన్ జూబ్లీ వేడుక అరుదైన సన్నివేశాలకు వేదిక కానుందా? సినీ, రాజకీయ దిగ్గజాలకు ఆహ్వానాలు అందాయి. ఒకే వేదికపై మెరవనున్న సెలబ్రెటీలు ఎందరు? అభిమానులకు కనువిందు చేసే గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ ఎలా జరగబోతోంది?
బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్‌బీకే గోల్డెన్‌జూబ్లీ వేడుకులకు రంగం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ఆదివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ నోవోటెల్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయబోతోంది టాలీవుడ్. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్న ఈ కార్యక్రమం వేదికపై మెగాస్టార్ చిరంజీవితోపాటు బాలకృష్ణ కనువిందు చేయనున్నారు. దేశంలోని అన్ని సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులకు ఈ ఈవెంట్ ఆహ్వానాలు అందగా టాలీవుడ్‌లోని ఇద్దరు బ్రదర్స్‌కు ఎటువంటి ఇన్విటేషన్ పంపలేదని సమాచారం హాట్‌టాపిక్‌గా మారింది.
బాలకృష్ణ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 వసంతాలు అవుతున్న సందర్భంగా ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది టాలీవుడ్. 1974లో తాతమ్మకల సినిమా ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన బాలకృష్ణ.. 50 ఏళ్లలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. తనకంటూ ఓ మాస్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఇక రాజకీయంగా సక్సెస్ అయిన బాలయ్య.. తెలుగు సినీ ఇండస్ట్రీలో అందరితో సన్నిహితంగా మెలుగుతుంటారు. దీంతో గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్‌లో అథితుల రాకపై అంచనాలు ఎక్కువయ్యాయి.
ఇదే సమయంలో నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు కల్యాణ్‌రామ్‌కు ఆహ్వానం అందలేదని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి మరోసారి ఒకే వేదికపై కలవబోతోండటం రెండు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరు కొత్తగా ముఖ్యమంత్రులు అయ్యాక ఒకసారి ఉమ్మడి సమావేశం నిర్వహించగా, ఇప్పుడు ఈ ఈవెంట్‌తో రెండోసారి కలవనున్నారు. అటు మెగా బ్రదర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ రాక కూడా బాలయ్య గోల్డెన్‌జూబ్లీ ఫంక్షన్‌కు మరింత హైప్ తెస్తోందని అంటున్నారు.
Also Read: తల్లిని టీవీ షోలోకి తీసుకొచ్చిన తమన్.. తమన్ చిన్నప్పటి సీక్రెట్స్ అన్ని చెప్పేసారుగా..