Infinix GT Pro Launch : రూ. 20వేల లోపు ధరలో గేమింగ్ కంట్రోల్‌తో ఇన్ఫినిక్స్ GT ప్రో ఫోన్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!

Infinix GT Pro Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అతి త్వరలో భారత మార్కెట్లో ఇన్ఫినిక్స్ నుంచి గేమింగ్ కంట్రోలింగ్ GT ప్రో ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీకయ్యాయి.

Infinix GT Pro Launch : రూ. 20వేల లోపు ధరలో గేమింగ్ కంట్రోల్‌తో ఇన్ఫినిక్స్ GT ప్రో ఫోన్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!

Infinix GT Pro with gaming controls to be priced below Rs 20,000 in India

Infinix GT Pro Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఇన్పినిక్స్ (Infinix) నుంచి అతి త్వరలో గేమింగ్-సెంట్రిక్ (Infinix GT 10 Pro) ఫోన్ భారత మార్కెట్లో కానుంది. ఆకట్టుకునే AMOLED డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ట్రిపుల్ కెమెరా సెటప్, కస్టమైజ్ చేసిన స్పీకర్ బాక్స్‌ను కలిగి ఉండనుంది. బ్రాండ్ నెక్స్ట్ పవర్‌ఫుల్ డివైజ్ అయిన Infinix GT 10 ప్రో ఆగష్టు 3న లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఫోన్ పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కొన్ని ఆసక్తికరమైన ఫీచర్లు లీక్ అయ్యాయి. ఈ స్పెక్స్‌ను కంపెనీ ఇంకా ధృవీకరించలేదని గమనించాలి.

Read Also : Twitter X Logo : మస్క్ వెనక్కి తగ్గేదే లే.. శాన్‌ఫ్రాన్సిస్కోలో ట్విట్టర్ X లోగో మార్చకుండా అడ్డుకున్న పోలీసులు.. అసలేం జరిగిందంటే?

ఇన్ఫినిక్స్ GT 10 Pro ఫోన్ మోడల్ 120Hz అధిక రిఫ్రెష్ రేట్‌తో ఆకట్టుకునే AMOLED డిస్‌ప్లేతో రానుంది. AMOLED టెక్నాలజీతో అధిక రిఫ్రెష్ రేట్, మొత్తం యూజర్ ఎక్స్ పీరియన్స్ మెరుగుపరిచే పవర్‌ఫుల్ కలర్లు, మృదువైన యానిమేషన్‌లను అందించగలదని భావిస్తున్నారు. ఈ డివైజ్ బ్యాక్ సైడ్‌లో వినియోగదారులు 108MP ప్రైమరీ సెన్సార్, రెండు 8MP కెమెరాలను కలిగిన పవర్‌ఫుల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను పొందవచ్చు. ఈ అడ్వాన్సడ్ కెమెరా సామర్థ్యాలు, అద్భుతమైన ఫొటోలను రూపొందించగలదని భావిస్తున్నారు. ఫొటోగ్రఫీ ఔత్సాహికులకు ఆకర్షణీయమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రస్తుత ట్రెండ్‌ను అనుసరించి Infinix GT 10 Pro ఫోన్ ఫ్రంట్ సైడ్ పంచ్-హోల్ డిస్‌ప్లేతో రూపొందించింది. వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. అదనంగా, డివైజ్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌కు అనుకూలమైన సురక్షితమైన యాక్సెస్‌ను అందిస్తుంది. ఇన్ఫినిక్స్ GT 10 Pro ఫోన్ మోడల్ స్పీకర్‌గా రూపాంతరం చెందుతుంది. ఈ ప్రత్యేకమైన ఆడియో ఎక్స్‌ఫీరియన్స్ తమ స్మార్ట్‌ఫోన్‌లలో విభిన్నమైన ఫీచర్ల కోసం చూస్తున్న యూజర్లను ఆకర్షించే అవకాశం ఉంది.

Infinix GT Pro with gaming controls to be priced below Rs 20,000 in India

Infinix GT Pro with gaming controls to be priced below Rs 20,000 in India

GT 10 ప్రో ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. ఫస్ట్ 5వేల మంది కస్టమర్‌లు ప్రత్యేక ప్రో గేమింగ్ కిట్‌ను పొందే అవకాశం ఉంటుంది. ఈ కిట్ ఫోన్ గేమింగ్-ఫోకస్డ్ అట్రిబ్యూట్‌లతో వస్తుంది. హై-పర్ఫార్మెన్స్ డివైజ్‌‌లను డిమాండ్ చేసే గేమర్‌లను అందిస్తుంది. ఈ డివైజ్ విస్తృత ప్రేక్షకులకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, సులభమైన ఫైనాన్స్ ఆప్షన్లను అందించనుంది.

అందులో భాగంగా Infinix Axis బ్యాంక్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువ సంఖ్యలో వినియోగదారులకు అందుబాటులో ఉంచనుంది. తద్వారా మార్కెట్లో ఫోన్ ధర పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇన్ఫినిక్స్ కంపెనీ ఫీచర్-రిచ్ స్మార్ట్‌ఫోన్‌లను అందించనుంది. రాబోయే ఇన్ఫినిక్స్ GT 10 ప్రో మోడల్ ఆకర్షణీయమైన ఫీచర్లతో రానుంది. లీకైన ఫీచర్‌లు, లాంచ్ డేట్ సమీపిస్తున్న కొద్దీ టెక్ ఔత్సాహికులు, స్మార్ట్‌ఫోన్ యూజర్లు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Also : Twitter X Logo : ట్విట్టర్ కొత్త లోగోను 2 సార్లు మార్చిన ఎలన్ మస్క్.. X లోగోలో అది నచ్చలేదట..!