Suzuki India : ఈ పాపులర్ 125సీసీ స్కూటర్‌లో సమస్యలు.. 2.64 లక్షల యూనిట్లు రీకాల్..!

Suzuki India : అధికారిక ఎస్ఐఏఎమ్ డేటా ప్రకారం.. ఏప్రిల్ 30, 2022 నుంచి డిసెంబర్ 3, 2022 మధ్య తయారైన సుజుకి యాక్సెస్ 125 మోడల్ 263,788 యూనిట్లకు రీకాల్ చేసింది.

Suzuki India : ఈ పాపులర్ 125సీసీ స్కూటర్‌లో సమస్యలు.. 2.64 లక్షల యూనిట్లు రీకాల్..!

2.64 lakh units of this popular 125cc scooter recalled ( Image Source : Google )

Suzuki Motorcycle India : ప్రముఖ టూవీలర్ కంపెనీ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా హైటెన్షన్ కార్డ్‌కి సంబంధించిన సమస్య కారణంగా పాపులర్ సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ దాదాపు 264,000 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో ఇదొకటి. సుజుకి యాక్సెస్ 125 హోండా యాక్టివా 125, టీవీఎస్ జూపిటర్ 125, హీరో డెస్టినీ 125 వంటి వాటికి పోటీగా నిలుస్తుంది.

Read Also : Honda Elevate Prices Hike : కొత్త కారు కావాలా? భారీగా పెరిగిన హోండా ఎలివేట్ ధరలు.. ఇప్పుడు ఎంతంటే?

అధికారిక ఎస్ఐఏఎమ్ డేటా ప్రకారం.. ఏప్రిల్ 30, 2022 నుంచి డిసెంబర్ 3, 2022 మధ్య తయారైన సుజుకి యాక్సెస్ 125 మోడల్ 263,788 యూనిట్లకు రీకాల్ చేసింది. “డ్రాయింగ్ అవసరాలకు (NG) సరిపోని హై టెన్షన్ కార్డ్, ఇగ్నిషన్ కాయిల్‌కు ఇన్‌స్టాల్ చేసిన రన్నింగ్ సమయంలో ఇంజిన్ లోపం వల్ల పదేపదే వంగడం వల్ల హైటెన్షన్ కార్డ్‌లో పగుళ్లు, విరిగిపోయాయి. ఫలితంగా ఇంజిన్ స్టాల్, స్టార్టింగ్ ఫెయిల్యూర్ జరుగుతుందని ఎస్ఐఏఎమ్ డేటా పేర్కొంది.

ఇంకా, పగిలిన హైటెన్షన్ వాహనం స్పీడ్ సెన్సార్, థొరెటల్ పొజిషన్ సెన్సార్‌లు లీక్ అయిన ఇగ్నిషన్ అవుట్‌పుట్ వల్ల దెబ్బతింటాయి. ఫలితంగా, స్పీడ్ డిస్‌ప్లే ఫెయిల్యూర్ సమస్య ఏర్పడవచ్చునని తెలిపింది. సుజుకి యాక్సెస్ 125 కాకుండా, సుజుకి అవెనిస్ మోడల్ 52,578 యూనిట్లు, సుజుకి బర్గ్‌మాన్ 72,045 యూనిట్లు కూడా ఇదే సమస్యపై రీకాల్ చేసింది. ఏప్రిల్ 30, 2022, డిసెంబర్ 3, 2022 మధ్య తయారయ్యాయి. మొత్తంమీద, సుజుకి యాక్సెస్ 125, సుజుకి అవెనిస్, సుజుకి బర్గ్‌మాన్ 388,411 యూనిట్లకు రీకాల్ చేసింది.

Read Also : Scooters Colour Options : ఈ 125సీసీ స్కూటర్లకు కొత్త స్పెషల్ కలర్ ఆప్షన్లు.. అదిరే ఫీచర్లు, ధర ఎంతంటే?