Honda Elevate Prices Hike : కొత్త కారు కావాలా? భారీగా పెరిగిన హోండా ఎలివేట్ ధరలు.. ఇప్పుడు ఎంతంటే?

Honda Elevate Prices Hike : కొత్త కారు కోసం చూస్తున్నారా? హోండా ఎలివేట్ కారు ధర భారీగా పెరిగింది. ఈ ఎస్‌యూవీ కారు ఒకే ఇంజన్ ఆప్షన్‌తో వచ్చింది. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.

Honda Elevate Prices Hike : కొత్త కారు కావాలా? భారీగా పెరిగిన హోండా ఎలివేట్ ధరలు.. ఇప్పుడు ఎంతంటే?

Honda Elevate prices hiked by up to Rs 58,000

Honda Elevate Prices Hike : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ హోండా కార్స్ ఇండియా సరికొత్త ఎలివేట్ ఎస్‌యూవీ మోడల్ కారు ధర అమాంతం పెరిగిపోయింది. గత 2023 సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఈ ఎస్‌యూవీ కారు ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కానీ, ఇప్పుడు, ఎలివేట్ కారు మొదటి ధర రూ. 58వేలు పెరిగింది.

దాంతో ఇప్పుడు ఎలివేట్ కారు ధర రూ. 11.58 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు మొత్తం SV, V, VX, ZX అనే 4 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఎంట్రీ-లెవల్ ఎస్‌యూవీ వేరియంట్ V, VX, ZX వేరియంట్‌లు రూ. 58వేల ధర పెంపును పొందాయి.

Read Also : Amazon Great Republic Day Sale : త్వరలో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌.. ఆపిల్ ఐఫోన్ 13, వన్‌‌ప్లస్ 11 ఫోన్లపై భారీ డీల్స్..!

హోండా ఎలివేట్ భారీ పియానో-బ్లాక్ గ్రిల్ అప్-ఫ్రంట్ వైపు ఆకర్షణీయమైన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. ఓవర్సీస్‌లో విక్రయించే ఇతర హోండా ఎస్‌యూవీల మాదిరిగానే బోనెట్‌పై నడిచే మందపాటి క్రోమ్ బార్‌ను కలిగి ఉంది. ఎస్‌యూవీ 215/60-సెక్షన్ టైర్లలో 17-అంగుళాల మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంది. వెనుక వైపున ఎలివేట్ విలోమ ఎల్-ఆకారపు ఎల్ఈడీ టెయిల్ లైట్‌లను కలిగి ఉంది. ఇందులో కొంచెం విండ్‌స్క్రీన్ ఉంటుంది. రెండు రిఫ్లెక్టర్‌లతో బ్యాక్ స్కిడ్ ప్లేట్‌లను పొందుతుంది.

Honda Elevate prices hiked by up to Rs 58,000

Honda Elevate prices hike

ఒకే పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ మాత్రమే :
ఎలివేట్ పొడవు 4,312ఎమ్ఎమ్, వెడల్పు 1,790ఎమ్ఎమ్, ఎత్తు 1,650ఎమ్ఎమ్, 2,650ఎమ్ఎమ్ వీల్‌బేస్ కలిగి ఉంది. ఎస్‌యూవీ 458 లీటర్ల బూట్ స్పేస్‌ను పొందుతుంది. అంతేకాదు.. సెగ్మెంట్-లీడింగ్ 220ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంది.

ఎలివేట్ ఒకే ఇంజన్ ఆప్షన్‌తో అందిస్తుంది. 1.5-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజన్ 119బీహెచ్‌పీ, 145ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ ఆటోమేటిక్‌తో వస్తుంది. ఈ ఆఫర్‌లో డీజిల్ లేదా హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ లేదని గమనించాలి.

ఎలివేట్ మరెన్నో సేఫ్టీ ఫీచర్లు :
హోండా ఎలివేట్ ఫీచర్లలో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, సెమీ-డిజిటల్ క్లస్టర్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 8 స్పీకర్లు, బ్రౌన్ లెథెరెట్ అప్హోల్స్టరీ, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌వీఎమ్, సైడ్ & కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, మల్టీ అడాస్ ఫీచర్లు ఉన్నాయి.

కొలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్ (CMBS), అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, రోడ్ డిపార్చర్ మిటిగేషన్ (RDM), లేన్ కీపింగ్ అసిస్ట్ సిస్టమ్ (LKAS), లీడ్ కార్ డిపార్చర్ నోటిఫికేషన్ సిస్టమ్ ఆటో హై-బీమ్ అసిస్ట్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

Read Also : Vivo Y28 Launch : రెడ్‌మి నోట్ 13 5జీకి పోటీగా వివో Y28 ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, కేవలం రూ. 13,999 మాత్రమే..!