Chiranjeevi Remuneration : భోళా శంకర్ సినిమాకి రెమ్యునరేషన్ వ‌ద్ద‌న్న చిరంజీవి.. ఎందుకో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)) న‌టిస్తున్న చిత్రం భోళా శంకర్(Bholaa Shankar). మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా (Tamannaah) హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Chiranjeevi Remuneration : భోళా శంకర్ సినిమాకి రెమ్యునరేషన్ వ‌ద్ద‌న్న చిరంజీవి.. ఎందుకో తెలుసా?

Chiranjeevi

Chiranjeevi Remuneration Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రం ‘భోళా శంకర్’. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా (Tamannaah) హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి మెహ‌ర్ ర‌మేష్ (Meher Ramesh) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆగ‌స్టు 11న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌గా సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త ప్ర‌స్తుతం హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ సినిమాకి చిరంజీవి రెమ్యున‌రేష‌న్ వ‌ద్దు అని చెప్పార‌ట‌.

‘గాడ్ ఫాద‌ర్‌’, ‘వాల్తేరు వీర‌య్య’ లు ఘ‌న విజ‌యం సాధించ‌డంతో మంచి జోష్‌లో ఉన్నారు మెగాస్టార్‌. అదే ఊపును కంటిన్యూ చేయాల‌ని కోరుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే త‌మిళ చిత్రం ‘వేదాళం’ రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ‘భోళా శంక‌ర్‌’లో న‌టిస్తున్నారు. ఇక ఈ సినిమాకి చిరంజీవి ఒక్క రూపాయి కూడా తీసుకోలేద‌ట‌. మంచి రెమ్యున‌రేష‌న్ ఇస్తామ‌ని నిర్మాతలు చెప్పినా వ‌ద్ద‌న్నార‌ట‌.

Samantha : బాలిలో సమంత బుల్లి నిక్కరు డాన్స్ అదుర్స్.. 100 శాతం ఎంజాయ్ చేశానంటున్న వీడియో వైరల్..

అయితే.. విడుద‌ల అయ్యాక లాభాలు వ‌స్తే అందులో షేర్ తీసుకుంటాన‌ని మాత్రం చెప్పార‌ట‌. ఈ మేర‌కు ఓ వార్త వైర‌ల్‌గా మారింది. సినిమాపై ఎంతో న‌మ్మ‌కం ఉండ‌బ‌ట్టే చిరు రెమ్యున‌రేష‌న్ వ‌ద్దు అని చెప్పార‌ని ఆ వార్త సారాంశం. ఇక భోళా శంక‌ర్ సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి.

మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ (Keerthy Suresh) చిరంజీవికి చెల్లిగా న‌టించ‌నుండ‌గా ఆమెకు జోడిగా అక్కినేని సుశాంత్ కనిపించబోతున్నాడు. ర‌ఘుబాబు, ముర‌ళీ శ‌ర్మ‌, ర‌విశంక‌ర్‌, వెన్నెల కిశోర్ లు కీల‌క పాత్ర‌లు పోషించారు. ప్రొడ్యూసర్ అనిల్ సుంకర, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

Rangabali ott release : ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న రంగ‌బలి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?