Rs 2000 Notes: 2వేల నోట్లు మీదగ్గర ఇంకా ఉన్నాయా? ఆర్‌బీఐ మరో కీలక ప్రకటన చేసింది

రూ. 2వేల నోట్ల రద్దు ప్రక్రియ మరో రెండు నెలల్లో పూర్తవుతుంది. ఆ తరువాత రూ. 500 నోట్లను ఆర్బీఐ రద్దు చేస్తుందన్న వాదన ఉంది. అయితే..

Rs 2000 Notes: 2వేల నోట్లు మీదగ్గర ఇంకా ఉన్నాయా?  ఆర్‌బీఐ మరో కీలక ప్రకటన చేసింది

Rs 2000 Notes

RBI Update: దేశంలో రూ. 2000 నోట్లు ఉపసంహరణకు ఈ ఏడాది మే19న అధికారిక ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా వరకు రూ. 2వేల నోట్లు బ్యాంకుల్లోకి చేరాయి. తాజాగా రూ. 2వేల నోట్లు విషయంపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక సమాచారం అందించింది. దేశంలో ఇప్పటి వరకు ఎన్ని 2వేల నోట్లు బ్యాంకుల వద్దకు చేరాయి? ఇంకా ఎంత విలువ కలిగిన నోట్లు ప్రజల్లో ఉన్నాయనే విషయాలను ఆర్ బీఐ వెల్లడించింది. 2వేల నోట్లు ఉపసంహరణ ప్రకటన సమయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 88శాతం రూ.2వేల నోట్లు బ్యాంకులకు చేరినట్లు ఆర్బీఐ తెలిపింది. అంటే.. జూలై 31 నాటికి చూస్తే దాదాపు రూ. 3.14 ట్రిలియన్ విలువైన రూ. 2వేల నోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయి. ఇంకా 42వేల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు వ్యవస్థలో చెలామణిలో ఉన్నాయట. ఈ వివరాలన్నీ బ్యాంకుల నుంచి తీసుకున్న డేటా ఆధారంగా ఆర్బీఐ వెల్లడించింది.

Rs 2000 Notes

Rs 2000 Notes

అయితే, వీటిల్లో 87శాతం డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు చేరాయి. 13శాతం నోట్లు ఎక్స్చేంజ్ రూపంలో బ్యాంకులకు చేరాయి. రెండువేల నోట్లు ఎక్స్చేంజ్ కు సెప్టెంబర్ చివరి వరకు ఆర్బీఐ గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ గడువు పెంపు ఇక ఉండదని ఆర్బీఐ చెప్పుకొచ్చింది. దేశంలో 2018 మార్చి నెలలో రూ. 2వేల నోట్లు వ్యవస్థలో చాలా ఎక్కువగా అంటే రూ. 6.73 ట్రిలియన్లుగా ఉన్నాయి. 2023 మార్చి నాటికి ఆ నోట్లు రూ. 3.62 ట్రిలియన్లకు తగ్గాయి. ఆర్బీఐ తాజాగా నిర్ణయంతో వచ్చే రెండు నెలల్లో రూ.2వేల నోట్ల చెలామణి పూర్తిగా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు.

Rs 2000 Notes

Rs 2000 Notes

రూ. 2వేల నోట్ల రద్దు ప్రక్రియ మరో రెండు నెలల్లో పూర్తవుతుంది. ఆ తరువాత రూ. 500 నోట్లను ఆర్బీఐ రద్దు చేస్తుందన్న వాదన ఉంది. రూ.500 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో వెయ్యి నోట్లను అందుబాటులోకి తీసుకొస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. రూ. 1000 నోట్లు తిరిగి తీసుకొచ్చే ఆలోచన లేదని, రూ. 500 నోట్లను రద్దు చేసే ప్రతిపాదన ఏమీ లేదని ఆర్బీఐ వెల్లడించింది.