Mobile Charger : గుండెలు పిండే తీవ్ర విషాదం.. ఫోన్ ఛార్జర్ పిన్ నోట్లో పెట్టుకుని 8నెలల చిన్నారి మృతి, తల్లిదండ్రులూ బీకేర్ ఫుల్

8నెలల సానిధ్య ఆడుకుంటూ వెళ్లి స్విచ్ బోర్డుకు పెట్టిన ఫోన్ ఛార్జర్ పిన్ ను నోట్లో పెట్టుకుంది. Mobile Charger

Mobile Charger : గుండెలు పిండే తీవ్ర విషాదం.. ఫోన్ ఛార్జర్ పిన్ నోట్లో పెట్టుకుని 8నెలల చిన్నారి మృతి, తల్లిదండ్రులూ బీకేర్ ఫుల్

Mobile Charger(Photo : Google)

Karnataka Mobile Charger : మొబైల్ ఫోన్ ఛార్జర్ ఓ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది. ఓ చిన్నారి ప్రాణం తీసింది. 8 నెలల పాపను పొట్టన పెట్టుకుంది. మొబైల్ ఫోన్ ఛార్జర్ పిన్ నోట్లో పెట్టుకుని కరెంట్ షాక్ తో 8 నెలల పాప చనిపోయింది. గుండెలు పిండే ఈ విషాద ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఉత్తర కన్నడ జిల్లా కర్వార్ తాలూకా సిద్దరాద గ్రామానికి చెందిన సంతోశ్ కల్గుట్కర్, సంజన కల్గుట్కర్ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. ఓ కూతురు బర్త్ డే సందర్భంగా కుటుంబసభ్యులు అందరూ ఏర్పాట్లలో మునిగిపోయారు. ఇంతలో వారి చిన్న కూతురు 8నెలల సానిధ్య ఆడుకుంటూ వెళ్లి స్విచ్ బోర్డుకు పెట్టిన ఫోన్ ఛార్జర్ పిన్ ను నోట్లో పెట్టుకుంది. పిన్ ను కొరకడం ప్రారంభించింది. ఆ సమయంలో ఫోన్ ఛార్జర్ స్విచ్చాన్ చేసి ఉంది. అంతే, కరెంట్ షాక్ కు గురై పాప మరణించింది.

Also Read..Cleric Kiss : ఛీ..ఛీ.. బరితెగించిన మతగురువు, అమ్మాయితో అసభ్యకర ప్రవర్తన, అక్కడ తాకుతూ ముద్దులు పెడుతూ.. వీడియో వైరల్

పాపను తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, లాభం లేకపోయింది. పాప అప్పటికే చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. పాప తండ్రి సంతోశ్ హుబ్బలి పవర్ సప్లయ్ కంపెనీలో పని చేస్తాడు. చిన్నారి మృతితో ఆ ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. చిన్నారి ఇక లేదు అని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన స్థానికులను కలిచివేసింది. అయ్యో పాపం ఎంత ఘోరం జరిగిపోయింది అంటూ కన్నీటిపర్యంతం అయ్యారు. కాగా, ఫోన్ ఛార్జర్ సాకెట్ లో ఉంది. ఛార్జర్ ను స్విచ్చాఫ్ చేయడం మరిచిపోయారు. ఇదే వారి పాప పాలిట మృత్యువైంది.

ఈ ప్రమాదం ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఓ హెచ్చరికలాంటిది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ చాలా కేర్ ఫుల్ గా ఉండాలని చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. ఏమీ తెలియని వయసు. పసి పిల్లలు చేతికి ఏది దొరికితే అది నోట్లో పెట్టుకుంటారు. అందుకే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలను నిత్యం కనిపెట్టుకుని ఉండాలి. ప్రమాదకరమైన వస్తువులను పిల్లలకు దూరంగా ఉండేలా చూసుకోవాలి. వారికి అందనంత ఎత్తులో ఉంచుకోవాలి.

Also Read..Burnt Alive : షాకింగ్.. విద్యుత్ తీగ తగిలి వృద్ధురాలు సజీవదహనం.. వెన్నులో వణుకు పుట్టించే వీడియో

ఇక ఫోన్ చార్జర్ విషయంలో చాలామంది ఇలానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. సాకెట్ లో పెట్టి స్విచ్చాఫ్ చేయడం మర్చిపోతారు. ఫోన్ చార్జర్ ను వాడుకోకపోయినా స్విచ్చాఫ్ మాత్రం చేయరు. ఆ ఏమవుతుందిలే అని నిర్లక్ష్యంగా ఉంటారు. ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు పాప పాలిట మృత్యువైంది. అందుకే, చిన్నపిల్లలు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. ఆ తర్వాత ఎంత ఏడ్చినా, బాధ పడినా ప్రయోజనం మాత్రం శూన్యం.