IND vs WI 1st T20 Match: భారత్ కుర్రాళ్లకు సవాల్.. ఆ ఇద్దరి అరంగేట్రం ఉంటుందా? పరుగుల వరద ఖాయమంటున్న విండీస్ బ్యాటర్లు

టెస్టు, వన్డే సిరీస్ లను కోల్పోయిన వెస్టిండీస్ జట్టు ఆటగాళ్లు టీ20 సిరీస్ ను దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. టీ20 ఫార్మాట్ లో విండీస్ ఆటగాళ్లకు మెరుగైన రికార్డు ఉంది.

IND vs WI 1st T20 Match: భారత్ కుర్రాళ్లకు సవాల్.. ఆ ఇద్దరి అరంగేట్రం ఉంటుందా? పరుగుల వరద ఖాయమంటున్న విండీస్ బ్యాటర్లు

IND vs WI 1st T20 Match,

IND vs WI 1st T20 Match: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. గురువారం రాత్రి 8గంటలకు (భారత కాలమానం ప్రకారం) ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్‌పై కన్నేసింది. ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భారత్ ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే, టెస్టు, వన్డే సిరీస్ లలో తేలిపోయిన కరీబియన్ జట్టు ఆటగాళ్లు.. టీ20 సిరీస్ లో చలరేగిపోయేందుకు సిద్ధమవుతున్నారు. టీ20 ఫార్మాట్‌లో విండీస్ ఆటగాళ్లకు మంచి రికార్డు ఉంది. తమకు కలిసొచ్చిన ఫార్మాట్ లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాలని ఆ జట్టు కీలక బ్యాట్స్‌మెన్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మరోవైపు రోహిత్, కోహ్లీ లాంటి కీలక ప్లేయర్లు లేకుండానే హార్దిక్ పాండ్యా సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగుతుంది. ఈ టీ20 సిరీస్ లో ఎక్కువగా కుర్రాళ్లు ఉండటంతో భారత్ కుర్రాళ్లకు ఈ సిరీస్ సవాల్ గా మారనుంది.

Hardik Pandya: మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు: హార్దిక్ పాండ్యా

ఆ ఇద్దరికి అరంగేట్రం ఉంటుందా..

వెస్టిండీస్‌తో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ తుదిజట్టు ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మతో పాటు మరో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ అరంగ్రేటం చేస్తారని తెలుస్తోంది. అయితే, తుది జట్టు ఎంపిక సమయానికి వీరిలో ఒక్కరికి అవకాశం ఉంటుందా? ఇద్దరికి అవకాశం కల్పిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. శుభ్‌మన్ గిల్‌తో కలిసి యశస్వి జైస్వాల్‌ను ఓపెనర్‌గా బరిలోకి దింపేందుకు టీమిండియా మేనేజ్ మెంట్ భావిస్తోంది. అదే ఖాయమైతే.. హైదరాబాద్ కుర్రాడికి తుది జట్టులో అవకాశం ఉంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇషాన్ కిషన్ మూడో స్థానంలో బరిలోకి దిగేఅవకాశం ఉంది. ఒకవేళ ఇషాన్ కిషన్ తుది జట్టులో చేరితే సంజు శాంసన్‌కు అవకాశం దక్కడం కష్టమే. వీరిద్దరిలో ఒక్కరికి మాత్రమే తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది. బౌలింగ్ విభాగంలో ముకేశ్ కుమార్‌కు తుదిజట్టులో బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యా ఎలాగూ బౌలింగ్ చేస్తాడు. మరో బౌలర్ ఉమ్రాన్ మాలిక్ లేదా అవేష్ ఖాన్‌లో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. స్పిన్ విభాగంలో ఆల్‌రౌడర్ కోటాలో అక్షర్ పటేల్‌కు చోటు ఖాయంగా కనిపిస్తుంది. మరో స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ ఉన్నారు. మరొకరికి అయితే చాహల్ లేదా రవి బిష్ణోయ్‌కు తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

Suresh Raina : సురేష్ రైనా వ్యాయామం వీడియో చూశారా.. ఇలాచేస్తే ఫుల్ ఫిట్‌నెస్ అట.. ఎంట్రీ ఇచ్చిన శ్రీశాంత్

టీ20 సిరీస్‌పై కన్నేసిన విండీస్..

టెస్టు, వన్డే సిరీస్ లను కోల్పోయిన వెస్టిండీస్ జట్టు ఆటగాళ్లు టీ20 సిరీస్ ను దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. టీ20 ఫార్మాట్ లో విండీస్ ఆటగాళ్లకు మెరుగైన రికార్డు ఉంది. బ్యాట్ తో విధ్వంసం సృష్టించే ఆటగాళ్లు ఈ జట్టులో చాలామందే ఉన్నారు. ఒకరిద్దరు బ్యాటర్లు క్రీజులో పాతుకుపోయినా భారీ స్కోర్ రాబట్టడం ఖాయం. ఈ క్రమంలో రోహిత్, కోహ్లీ లాంటి ప్లేయర్లు లేకుండా బరిలోకి దిగుతున్న భారత్ కుర్రాళ్లకు ఈ సిరీస్ సవాల్‌గా మారిందనే చెప్పొచ్చు.

భారత్‌ తుది జట్టు (అంచనా) ..

శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్/సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ / ఆవేష్ ఖాన్.

వెస్టిండీస్ తుది జట్టు (అంచనా)..

మేయర్స్, కింగ్, హోప్/ చార్లెస్, పూరన్, హెట్మయర్, రోమన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ చేజ్, జేసన్ హోల్డర్, రోమారియో షెపర్డ్ / ఒడియన్ స్మిత్, అకీల్, అల్జారి జోసెఫ్