Kharge vs Dhankar: నాకు పెళ్లైంది, కోపం రాదు.. రాజ్యసభలో చైర్మన్ ధన్‭కడ్, విపక్ష నేత ఖర్గే మధ్య జోకులు

చిదంబరం చాలా విశిష్టమైన సీనియర్ న్యాయవాదని మనకు తెలుసునని, ఒక సీనియర్ అడ్వకేట్‌గా కనీసం అధికారుల ముందు మా కోపాన్ని ప్రదర్శించే హక్కు లేదని ధన్‌ఖడ్‭ అన్నారు

Kharge vs Dhankar: నాకు పెళ్లైంది, కోపం రాదు.. రాజ్యసభలో చైర్మన్ ధన్‭కడ్, విపక్ష నేత ఖర్గే మధ్య జోకులు

Parliament Monsoon Session: రాజ్యసభలో ప్రభుత్వం, విపక్షాల మధ్య నినాదాలు, కోలాహలం మధ్య గురువారం కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. చైర్మన్ ఆమోదంతో అత్యవసరమైన అంశంపై చర్చించేందుకు నిబంధనలను సస్పెండ్ చేసేందుకు వీలు కల్పించే రూల్ 267కు ప్రాధాన్యత ఇచ్చేలా సభా వ్యవహారాలను పక్కన పెట్టాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. ఒక విషయమై ‘‘నేను మీకు అదే అభ్యర్థన చేసాను, కానీ బహుశా మీరు కోపంగా ఉన్నారు’’ అని రాజ్యసభ చైర్మన్, ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖడ్‭తో కాంగ్రెస్ పార్టీ చీఫ్, రాజ్యసభ కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. కారణం చెప్పాను.

చిటికెలో సమాధానమిచ్చారు ధన్‌ఖడ్‭
దీనిపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‭ నుంచి వెంటనే చమత్కారమైన ఊహించని సమాధానం వచ్చింది. ‘‘నాకు పెళ్లై 45 ఏళ్లు అయింది. నాకు ఎప్పుడూ కోపం రాలేదు. ఇకపై కూడా రాదు. నన్ను నమ్మండి’’ ధన్‌ఖడ్‭ చమత్కరించారు. దీంతో సభ నవ్వులతో మారుమోగింది.

Manipur violence: మణిపూర్‭లో మళ్లీ చెలరేగిన హింస.. 17 మందికి తీవ్రగాయాలు, రాజధాని ఇంఫాల్‭లో కర్ఫ్యూ

చిదంబరం చాలా విశిష్టమైన సీనియర్ న్యాయవాదని మనకు తెలుసునని, ఒక సీనియర్ అడ్వకేట్‌గా కనీసం అధికారుల ముందు మా కోపాన్ని ప్రదర్శించే హక్కు లేదని ధన్‌ఖడ్‭ అన్నారు. అనంతరం ఖర్గే సరదాగా బదులిస్తూ.. ‘‘మీరు కోపం తెచ్చుకోవద్దు, కోపం ప్రదర్శించవద్దు, కానీ లోపల నుంచి మీరు కోపంగా ఉన్నారు’’ అని అన్నారు. దీంతో పార్లమెంటు సభ్యులు మళ్లీ నవ్వులు పూయించారు.