China Smartphone : పిల్లలు స్మార్ట్‌‌ఫోన్‌ వాడకంపై కంట్రోల్ కోసం మైనర్‌ మోడ్‌‌ .. చైనా కొత్త ప్రతిపాదనలు

ఇకపై పిల్లలు ఇష్టమొచ్చినంతసేపు స్మార్ట్ ఫోన్లు చూడటానికి ఉండదు. టైమ్ కంట్రోల్ ఉండాల్సిందే. దీనికోసం చైనా కొత్త మార్గదర్శకాలను అమలు చేయనుంది.

China Smartphone :  పిల్లలు స్మార్ట్‌‌ఫోన్‌ వాడకంపై కంట్రోల్ కోసం మైనర్‌ మోడ్‌‌ .. చైనా కొత్త ప్రతిపాదనలు

China Smartphone Minor mode

China Minor mode In Smartphone : స్మార్ట్ ఫోన్..(smartphone) చిన్నారులు,పెద్దలు దీనికే అతుక్కుపోతున్నారు. ఆన్ లైన్ పాఠాల పుణ్యమాని చిన్నపిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇంకా అలవాటైపోయింది. ఇంకా చెప్పాలంటే బానిసలుగా మారిపోతున్నారని చెప్పాల్సిందే. పసిపిల్లలు పాలు తాగాలన్నా స్మార్ట్ ఫోన్ లో ఏదోకటి చూడాల్సిందే. అటువంటి స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరగటం వల్ల చిన్నపిల్లలకు లేని పోని సమస్యలొస్తున్నాయి.శారీరకంగాను మానసికంగా సమస్యలు వస్తున్నాయి.

దీంతో చైనా కొత్తగా ఆలోచించింది.చైనా అంటే అంతేమరి..టెక్నాలజీలో దూసుకుపోవటమే కాదు ప్రపంచ దేశాలన్నీ చైనామీద ఆధారపడేలా చేసుకుంటోంది. ఏకంగా సొంతంగా ఓ సూర్యుడిని తయారు చేసుకుందంటే చైనా టెక్నాలజీ ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోవచ్చు.

ఇదిలా ఉంటే చిన్నారులు స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించటానికి చైనా కొత్త మార్గదర్శకాలు చేపట్టింది. 18 ఏళ్లలోపువారు స్మార్ట్ ఫోన్ ను రోజుకు రెండు గంటలకు మించి వాడకుండా చైనా చర్యలు చేపట్టింది. చైనాలో చిన్నారులు (children) గంటలు గంటలు స్మార్ట్‌ ఫోన్‌తో గడిపేయకుండా కఠినమైన ప్రతిపాదనలతో ఈ వ్యసనాన్ని అరికట్టేందుకు చైనా(China) ఆలోచిస్తోంది.

Sunflower : సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరిగే పొద్దుతిరుగుడు పువ్వు వెనుక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ..!

దీంట్లో భాగంగా 18 ఏళ్లలోపు వారిలో ఫోన్‌ రోజుకు రెండు గంటలు మాత్రమే పని చేసేలా త్వరలో ‘మైనర్‌ మోడ్‌’(“minor mode”)ను ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలు రెడీ చేసింది. దీనికి సంబంధించి ముసాయిదా సెప్టెంబర్ 2 వరకు ప్రజల అభిప్రాయాలను సేకరించే గడువును పెట్టింది. మైనర్ మోడ్ ప్రవేశపెట్టేందుకు టెక్‌ కంపెనీలు కృషి చేయాలని చైనా సైబర్‌ స్పేస్‌ వాచ్‌డాగ్‌ (China cyberspace watchdog)సూచించింది.

ఈ ప్రతిపాదిత మార్గదర్శకాల ప్రకారం పిల్లలను ఐదు వర్గాలుగా విభజించగా..మూడేళ్ల లోపువారు 3 నుంచి 8, 8 నుంచి 12, 12 నుంచి 16, 16 నుంచి 18 ఏళ్ల వయస్సులవారీగా వర్గీకరించారు. ‘మైనర్‌ మోడ్’ అమల్లోకి వస్తే 8 ఏళ్ల లోపు చిన్నారులకు 40 నిమిషాలు మాత్రమే ఫోన్‌ పని చేస్తుంది. మూడేళ్లలోపు పిల్లలకు ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు చిన్న పిల్లల పాటలు, విద్యకు సంబంధించిన విషయాలను ఆడియో ద్వారా ప్రసారం చేయాలని సూచించారు.

ఇక 16 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న టీనేజ్‌ వారికి రెండు గంటలు మాత్రమే ఫోన్‌ను వాడుకోవడానికి అనుమతి ఉంటుంది. అది కూడా ఆంక్షలతో మాత్రమే. దీంట్లో భాగంగా రాత్రి 10 గంటల వరకే వినియోగించుకోవాలి. తిరిగి నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల సమయంలో పనిచేయదు.కాగా ఇటీవల చైనా ప్రభుత్వం చేయించిన పలు సర్వేల్లో యువత స్మార్ట్‌ఫోన్‌కు బానిసలుగా మారుతున్నట్లు వెల్లడైంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ కొత్త నిబంధనలను రూపొందిస్తున్నారు. ఈ కొత్త విధానానికి తల్లిదండ్రులు సహకారం అందించాలని కోరుతున్నారు.

NASA : అంతరిక్షంలో వ్యోమగాములు చనిపోతే మృతదేహాన్ని ఎలా భద్రపరుస్తారు..?భూమికి ఎలా తీసుకొస్తారు..?నాసా చెబుతున్న ఆసక్తికర విషయాలు

‘మైనర్‌ మోడ్‌’ అందుబాటులోకి వస్తే వారి పిల్లలు స్మార్ట్‌ఫోన్‌ను ఏ విధంగా నియోగించుకుంటున్నారనే విషయం కూడా తల్లిదండ్రులు తెలుసుకోవచ్చట.చైనా ఈ గైడ్‌లైన్స్ అనుకున్నట్లుగా అవలంబిస్తే..స్మార్ట్‌ఫోన్‌ల వినియోగంలో పిల్లల కోసం చైనా ప్రపంచంలోని అత్యంత కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టిన దేశంగా పేరొందుతుంది.