Tatyana Ozolina : రష్యన్ మోస్ట్ బ్యూటిఫుల్ బైకర్ టాట్యానా ఓజోలినా మృతి.. ఆమె ఇన్‌స్టా ఫాలోవర్స్ సంఖ్య ఎంతో తెలుసా..

సోషల్ మీడియాలో టాట్యానా ఓజోలినా పాపులర్ అయ్యారు. ఆమె ఫాలోవర్స్ సంఖ్య భారీగానే ఉంది. ఆమె ఖాతాకు ఇన్ స్టాలో

Tatyana Ozolina : రష్యన్ మోస్ట్ బ్యూటిఫుల్ బైకర్ టాట్యానా ఓజోలినా మృతి.. ఆమె ఇన్‌స్టా ఫాలోవర్స్ సంఖ్య ఎంతో తెలుసా..

Tatyana Ozolina

Russia’s Most Beautiful Biker : రష్యన్ మోస్ట్ బ్యూటీఫుల్ బైకర్ గా పేరుగడించిన టాట్యానా ఓజోలినా మృతి చెందింది. టర్కీలో జరిగిన ప్రమాదంలో ఆమె మరణించింది. ఆమె వయస్సు 38ఏళ్లు. టర్కీలోని మిలాస్ ప్రాంతంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న సమయంలో టాట్యానా నియంత్రణ కోల్పోయింది. దీంతో ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆమె వెనుక కూర్చున్న టర్కీకి చెందిన బైకర్ తీవ్రంగా గాయపడింది. ఓజోలినా బైక్ నడుపుతుండగా మరో రైడింగ్ గ్రూప్ ఒక్కసారిగా అడ్డొచ్చింది. ఈక్రమంలో ఆమె ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఎదురుగా వస్తున్న ట్రక్ ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అయితే, స్థానిక పోలీసులు బైక్ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : కొడుకు అగస్త్యతో కలిసి జూ పార్కులో నటాషా.. హార్దిక్ పాండ్యా ఆసక్తికర కామెంట్..

సోషల్ మీడియాలో టాట్యానా ఓజోలినా పాపులర్ అయ్యారు. ఆమె ఫాలోవర్స్ సంఖ్య భారీగానే ఉంది. ఆమె ఖాతాకు ఇన్ స్టాలో 10లక్షల మంది, యూట్యూబ్ లో 20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఓజోలినా ప్రపంచ వ్యాప్తంగా సాహసోపేతమైన బైక్ రైడింగ్ లు చేస్తుంటుంది. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తుంటుంది. ఆమె అందంగా ఉండటంతో రష్యా మోస్ట్ బ్యూటిఫుల్ బైకర్ గా అభిమానులు పేర్కొంటుంటారు. ఆమెకు 13ఏళ్ల కుమారుడు ఉన్నాడు.

Also Read : ఇష్టం లేని పెళ్లి చేశారని దారుణం..! వదిన, ఆమె ఇద్దరు పిల్లలను చంపి మరిది ఆత్మహత్య

ఓజోలినా చివరిసారిగా సోషల్ మీడియా వీడియోలో రష్యాతో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా యూరోపియన్ యూనియన్ ప్రవేశం నిరాకరించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టాట్యానా ఓజోలినా అందానికి, బైక్ రైడింగ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. మోటార్ సైకిళ్లపై అభిరుచితో ఆమె నిరంతరం వార్తల్లో వ్యక్తిగా మారారు.