కొడుకు అగస్త్యతో కలిసి జూ పార్కులో నటాషా.. హార్దిక్ పాండ్యా ఆసక్తికర కామెంట్..
కొడుకు అగస్త్యతో కలిసి తీసుకున్న ఫొటోలను నటాషా తన ఇన్ స్టాగ్రామ్ లో ఖాతాలో షేర్ చేసింది. ఆమె పోస్టుకు మాజీ భర్త హార్దిక్ పాండ్యా కామెంట్స్ చేశాడు.

Natasa Stankovic with Agastya
Natasa Stankovic : టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, నటి నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే, గత వారంరోజుల క్రితం తన కుమారుడు అగస్త్యను తీసుకొని నటాషా తన సొంత దేశం సెర్బియాకు వెళ్లింది. సెర్బియాలో కొడుకుతో కలిసి నటాషా జూ పార్క్ కు వెళ్లింది. అక్కడ కొడుకుతో కలిసి తీసుకున్న ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.
నటాషా పోస్టుకు మాజీ భర్త హార్దిక్ పాండ్యా కూడా రెండు సార్లు స్పందించాడు. మొదటి కామెంట్ లో హార్ట్ సింబల్ ఎమోజీని పెట్టాడు. రెండో కామెంట్ లో హార్ట్ సింబల్ తో పాటు సూపర్ అనే సింబల్ ను పెట్టాడు. అయితే, నటాషాతో విడాకుల ప్రకటన తరువాత హార్దిక్ పాండ్యా స్పందించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెటింట వైరల్ అవుతున్నాయి. విడిపోయిన తరువాత కూడా హార్దిక్ పాండ్యా తన మాజీ భార్య పట్ల అదే గౌరవాన్ని, ప్రేమను వ్యక్తపరుస్తున్నాడని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Also Read : Rohit Sharma : మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఎసరు పెట్టిన రోహిత్ శర్మ..! శ్రీలంక సిరీస్‌లోనే..!
View this post on Instagram