New Ather Launch : ఏథర్ నుంచి సరసమైన ధరకే 2 సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే కొనేవరకు ఆగలేరంతే!

New Ather 450S : ఏథర్ ఎనర్జీ సరసమైన 450S, 450X రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. 2.9kWh బ్యాటరీ వేరియంట్ ధరలను కంపెనీ వెల్లడించింది. ఏ స్కూటర్ ధర ఎంతంటే?

New Ather Launch : ఏథర్ నుంచి సరసమైన ధరకే 2 సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే కొనేవరకు ఆగలేరంతే!

New Ather 450S and 450X launched, prices start at Rs 1.30 lakh

New Ather 450S : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ ఈవీ తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ (Ather Energy) నుంచి రెండు సరికొత్త 450S, 450X ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. ఈ రెండు ఈవీ స్కూటర్ల ధరలను కూడా ధరలను ఈవీ కంపెనీ వెల్లడించింది. 450Xకి మరింత సరసమైన వేరియంట్ 450Sని కూడా ఇటీవలే ఏథర్ వెల్లడించింది. ప్రస్తుతానికి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్‌లు 2.9kWh బ్యాటరీ ప్యాక్‌తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 450X ఈవీ స్కూటర్ 3.7kWh బ్యాటరీ ప్యాక్‌తో అక్టోబర్ 2023లో అందుబాటులోకి రానుంది.

ధర ప్రకటనపై అథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు & CEO తరుణ్ మెహతా మాట్లాడుతూ.. ‘మా రిఫ్రెష్డ్ పోర్ట్‌ఫోలియో ప్రారంభించాం. ఇప్పుడు 450 ప్లాట్‌ఫారమ్‌లో వివిధ ధరల విభాగాలలో 3 ప్రొడక్టులను కలిగి ఉన్నాం. విస్తృతమైన కొనుగోలుదారుల కోసం లేటెస్ట్ ఎంట్రీ లెవల్ వేరియంట్ 450S మొట్టమొదటిసారిగా డీప్‌వ్యూ డిస్‌ప్లే డ్యాష్‌బోర్డ్, వినూత్న ఫీచర్లను అందించడం ద్వారా 125cc పెర్ఫార్మెన్స్ స్కూటర్ సెగ్మెంట్‌లో కొత్త పుంతలు తొక్కింది.

Read Also : Tech Tips in Telugu : కంప్యూటర్‌లో పాస్‌వర్డ్ టైప్ చేస్తున్నారా? ఈ కొత్త ఏఐ టూల్ మీ పాస్‌వర్డ్‌ను ఇలా పసిగట్టేస్తుంది జాగ్రత్త..!

450S పెర్‌ఫార్మెన్స్‌ని అందిస్తూనే రైడింగ్, భద్రత పరంగా ఎంతో సురక్షితమైనదిగా చెప్పవచ్చు. ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లోకి ప్రవేశించాలనుకునే వారందరికీ 450S ఈవీ స్కూటర్ బెస్ట్ మోడల్ కానుంది. 450Sతో పాటు 3kWh, 4kWh సామర్థ్యంలో 450Xని కూడా ప్రవేశపెట్టాం. మా కస్టమర్‌లకు బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ ప్లాట్‌ఫారమ్ నుంచి ఎంచుకోవడానికి మరిన్ని ఆప్షన్లను అందిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.

కొత్త 2023 ఏథర్ 450S వేరియంట్ 2.9kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 115km IDC పరిధిని అందిస్తుంది. 7.24bhp, 22Nm ఎలక్ట్రిక్ మోటారుకు సపోర్టు చేస్తుంది. స్కూటర్‌కు 0 నుంచి 40kmph యాక్సిలరేషన్ సమయాన్ని 3.9 సెకన్లు, 90kmph గరిష్ట వేగాన్ని అందిస్తుంది. స్కూటర్ కొత్త డీప్‌వ్యూ TFT డిస్‌ప్లేతో పాటు అనేక రకాల ఫంక్షనాలిటీలను అందిస్తోంది. అలాగే, FallSafe వంటి కొత్త భద్రతా ఫీచర్లతో సహా ఫెయిర్ బిట్ కిట్‌తో వస్తుంది. ఎమర్జెన్సీని గుర్తిస్తే మోటార్‌ను స్లో చేస్తుంది. సిగ్నల్, కోస్టింగ్ రీజెన్‌ని నిలిపివేస్తుంది. ఈ ఫీచర్లు 450Xకి అందుబాటులో ఉన్నాయి.

New Ather 450S and 450X launched, prices start at Rs 1.30 lakh

New Ather 450S and 450X launched, prices start at Rs 1.30 lakh

2023 ఏథర్ 450 స్కూటర్ ధరలివే :
కొత్త ఏథర్ 450S ధర రూ. 1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్, పూణే). 2.9kWh బ్యాటరీతో Ather 450X ధర రూ. 1.38 లక్షలు (ఎక్స్-షోరూమ్, పూణే), అయితే, 3.7kWh బ్యాటరీతో టాప్-స్పెక్ ఏథర్ 450X ధర రూ. 1.44 లక్షలు (ఎక్స్-షోరూమ్, పూణే). ప్రో-ప్యాక్ ధర 450Sకి రూ.14,000, 450Xకి రూ.16వేలు, 3.9kWh బ్యాటరీతో కూడిన 450Xకి రూ.23వేలు, మరోవైపు 2023 Ather 450X ఇప్పుడు 2.9kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అయితే 3.7kWh బ్యాటరీతో టాప్-స్పెక్ 450X అక్టోబర్‌లో లాంచ్ కానుంది. చిన్న బ్యాటరీ 115km పరిధిని ఇస్తుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్ కన్నా 30km తక్కువగా ఉంటుంది. రైడ్ అసిస్ట్, ఏథర్ బ్యాటరీ ప్రొటెక్ట్, అథర్‌స్టాక్ అప్‌డేట్‌లు, ఏథర్ కనెక్ట్ వంటి ఫీచర్‌లను అందించే ప్రో ప్యాక్‌ను ఎంచుకోవడానికి కస్టమర్‌లకు అవకాశం ఉంది. మోటార్ అదే 8.4bhp యూనిట్‌తో వస్తుంది.

ఏథర్ 450S స్కూటర్ 1000:1 కాంట్రాస్ట్ రేషియో, ఆటో బ్రైట్‌నెస్, మల్టిపుల్ డిస్‌ప్లే మోడ్‌లతో 7-అంగుళాల డీప్‌వ్యూ డిస్‌ప్లేతో వస్తుంది. స్కూటర్ కొత్త స్విచ్ గేర్‌తో స్పర్శను మెరుగుపరుస్తుంది. కొత్త రివర్స్ స్విచ్, జాయ్‌స్టిక్‌తో వస్తుంది. కొత్త కోస్టింగ్ రీజెన్ ఫీచర్ స్కూటర్‌ను స్థిరమైన రేటుతో అందిస్తుంది. టైర్ నుంచి వచ్చే స్ప్రేని మెరుగుపరచడానికి, సస్పెన్షన్, బ్రేక్‌లకు మెరుగైన ప్రొటెక్షన్ అందించడానికి మడ్‌ఫ్లాప్ కూడా ఎడ్జెస్ట్ అయింది. 2.9kWh బ్యాటరీతో కూడిన కొత్త 450X డెలివరీలు ఆగస్టు 3వ వారంలో ప్రారంభం కానున్నాయి. కొత్త 450X 3.7kWh బ్యాటరీతో అక్టోబర్ నాటికి రానుంది.

Read Also : Flipkart Big Bachat Dhamaal Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్.. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు తగ్గింపు.. డోంట్ మిస్!