ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఆడియో లీక్‌పై భార్య వాణి స్పందన

ఆయనను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని, వైపీపీ నుంచి సస్పెండ్ చేయాలని..

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఆడియో లీక్‌పై భార్య వాణి స్పందన

Updated On : August 31, 2024 / 6:47 PM IST

Duvvada Vani: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నిజ స్వరూపం బయటపడిందని ఆయన భార్య వాణి అన్నారు. మాధురి అనే మహిళతో దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితంగా ఉంటున్నాడని, ఆయన భార్య వాణి కొంత కాలంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

మాధురికి యాక్సిడెంట్లో గాయాలైతే అది ఆత్మహత్యాయత్నంగా చెప్పాలని ఆమెకు దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ చేసి చెప్పినట్లు ఆడియో లీక్ ద్వారా బట్టబయలైంది. దీనిపై శ్రీకాకుళం జిల్లాలో వాణి మీడియాతో మాట్లాడుతూ.. మాధురి కోసం కట్టుకున్న భార్యపై ఇలా అబద్ధాలు చెప్పించారని అన్నారు.

యాక్సిడెంట్‌ని ఆత్మహత్యాయత్నంగా చిత్రీకరించారని వాణి చెప్పారు. దువ్వాడ శ్రీనివాస్‌కి సరైన శిక్ష దేవుడు వేస్తాడని అన్నారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికి రాడని, ఆయనను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని, వైపీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన పార్టీకి అన్యాయం చేస్తారని జగన్‌కి అనేక సార్లు చెప్పానని అన్నారు. అబద్ధాలు కలకాలం మనుగడసాగించలేవని, ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ నిజ స్వరూపం బయటపడిందని అన్నారు.

Also Read: ‘యాక్సిడెంట్ కాదు.. ఆత్మహత్యాయత్నం అని చెప్పు’ అని మాధురికి చెప్పిన దువ్వాడ శ్రీనివాస్.. ఆడియో లీక్