Moto G55 And G35 Phone : భారీ బ్యాటరీతో మోటో G35, మోటో G55 సిరీస్ ఫోన్లు.. కెమెరా ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Moto G55 And G35 Phone : లెనోవా యాజమాన్యంలోని బ్రాండ్ లేటెస్ట్ బడ్జెట్ ఆఫర్‌గా ఈ రెండు మోడల్ ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. లేటెస్ట్ మోటో జీ సిరీస్ ఫోన్‌లు స్పెసిఫికేషన్‌లు, డిజైన్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి.

Moto G55 And G35 Phone : భారీ బ్యాటరీతో మోటో G35, మోటో G55 సిరీస్ ఫోన్లు.. కెమెరా ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Moto G55 And G35 Phone With Primary Camera, 5,000mAh Battery Launched ( Image Source : Google )

Moto G55 And G35 Phone : కొత్త ఫోన్ కొంటున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ మోటో జీ55, మోటో జీ35 రెండు సిరీస్ ఫోన్లు యూరోపియన్ మార్కెట్‌లలో లాంచ్ అయ్యాయి. లెనోవా యాజమాన్యంలోని బ్రాండ్ లేటెస్ట్ బడ్జెట్ ఆఫర్‌గా ఈ రెండు మోడల్ ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. లేటెస్ట్ మోటో జీ సిరీస్ ఫోన్‌లు స్పెసిఫికేషన్‌లు, డిజైన్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి.

Read Also : Motorola Edge 50 Neo : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటోరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ సిరీస్ వచ్చేసింది.. ధర, ఫీచర్ల వివరాలివే..!

మోటో జీ55 మీడియాటెక్ డైమన్షిటీ 7025 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. మోటో జీ35 హుడ్ కింద యూనిసోక్ టీ760 చిప్‌ను కలిగి ఉంది. 50ఎంపీ మెయిన్ సెన్సార్, హౌస్ 5,000mAh బ్యాటరీ యూనిట్లతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్లు కలిగి ఉన్నాయి.

మోటో జీ55, మోటో జీ35 ధర ఎంతంటే? :
మోటో జీ55 ఫోన్ యూరోప్‌లో ధర ఈయూఆర్ 249 (దాదాపు రూ. 24వేలు) నుంచి ప్రారంభమవుతుంది. ఫారెస్ట్ గ్రే, స్మోకీ గ్రీన్, ట్విలైట్ పర్పుల్ షేడ్స్‌లో వస్తుంది. మరోవైపు, మోటో జీ35 ధర ఈయూఆర్ 199 (దాదాపు రూ. 19వేలు). లీఫ్ గ్రీన్, జామ రెడ్, మిడ్‌నైట్ బ్లాక్, సేజ్ గ్రీన్ కలర్‌వేస్‌లో అందిస్తుంది. ఈ రెండు ఫోన్‌లు ఎంపిక చేసిన లాటిన్ అమెరికా, ఆసియా-పసిఫిక్ మార్కెట్‌లలో అందుబాటులో ఉంది.

మోటో జీ55 స్పెసిఫికేషన్స్ :
డ్యూయల్ సిమ్ (నానో+ఇసిమ్) మోటో జీ55 ఆండ్రాయిడ్ 14తో 120హెచ్‌జెడ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.49-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080×2,400 పిక్సెల్‌లు) ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే 405పీపీఐ పిక్సెల్ సాంద్రత, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కలిగి ఉంది. మోటో జీ55 ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 256జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌పై రన్ అవుతుంది.

మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా అందుబాటులో ఉన్న స్టోరేజీని 1టీబీ వరకు విస్తరించవచ్చు. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఓఐఎస్‌తో కూడిన 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌లు 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ద్వారా కాప్చర్ చేయొచ్చు.

మోటో జీ55లోని కనెక్టివిటీ ఆప్షన్లలో బ్లూటూత్ 5.3, ఎఫ్ఎమ్ రేడియో, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, ఎ-జీపీఎస్, ఎల్‌టీఈపీపీ, జీఎల్ఓఎన్ఎఎస్ఎస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, బెయిడూ, వై-ఫై802.11 ఎ/బి/జి/ఎన్/ఎసి, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ కూడా ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు సపోర్టు ఇస్తుంది.

ఆన్‌బోర్డ్‌లోని ఇతర సెన్సార్‌లు యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, ఇ-కంపాస్, గైరోస్కోప్, ఎస్ఏఆర్ సెన్సార్, సెన్సార్ హబ్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది. డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీతో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. మోటో జీ55 33డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ కొలతలు 161.56×73.82×8.09ఎమ్ఎమ్, బరువు 179 గ్రాములు, వేగన్ లెదర్ వెర్షన్ బరువు 182 గ్రాములు ఉంటుంది.

మోటో జీ35 స్పెసిఫికేషన్లు :
మోటో జీ35 ఫోన్ కొన్ని స్పెసిఫికేషన్‌లను షేర్ చేసింది. మోటో జీ55 మాదిరిగానే కనిపిస్తుంది. అయినప్పటికీ, 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 1000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ స్థాయితో భారీ 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 8జీబీ వరకు ర్యామ్, 128జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో యూనిసోక్ టీ760 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజీని 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. మోటో జీ35 విధమైన 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. అయితే, ప్రైమరీ సెన్సార్‌కు ఓఐఎస్ సపోర్టు లేదు. 16ఎంపీ సెల్ఫీ షూటర్‌ను కూడా కలిగి ఉంది. 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లు, సెన్సార్లు మోటో జీ55 మాదిరిగానే ఉంటాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్, డాల్బీ అట్మోస్‌తో కూడిన స్టీరియో స్పీకర్‌లను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ కొలతలు 166.29x 75.98 x 7.79ఎమ్ఎమ్, బరువు 188 గ్రాములు ఉంటుంది.

Read Also : Tech Tips in Telugu : గత 6 నెలల్లో మీరు ఎవరెవరితో మాట్లాడారో ఫోన్ కాల్ హిస్టరీ చెక్ చేయొచ్చు..!