Tech Tips in Telugu : గత 6 నెలల్లో మీరు ఎవరెవరితో మాట్లాడారో ఫోన్ కాల్ హిస్టరీ చెక్ చేయొచ్చు..!

Check Phone Call History : మీ మొబైల్ నెంబర్ నుంచి ఎవరితో ఎప్పుడు మాట్లాడారో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? గత ఆరు నెలల్లో మీ కాల్ హిస్టరీని సులభంగా యాక్సెస్ చేయవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Tech Tips in Telugu : గత 6 నెలల్లో మీరు ఎవరెవరితో మాట్లాడారో ఫోన్ కాల్ హిస్టరీ చెక్ చేయొచ్చు..!

Trying to check your call history of last six months ( Image Source : Google )

Check Phone Call History : మీ మొబైల్ నెంబర్‌కు ఎన్ని ఫోన్ కాల్స వచ్చాయి? మీరు ఎవరెవరితో ఎన్నిసార్లు ఫోన్ కాల్స్ మాట్లాడారు. అలాగే, 2023 ఏడాదిలో మీ ఫోన్ నెంబర్ నుంచి ఎన్ని ఔట్ గోయింగ్ కాల్స్ వెళ్లాయి. అలాగే, ఎన్ని ఇన్ కమింగ్ కాల్స్ వచ్చాయి.. ఇలా కాల్ హిస్టరీ డేటా మొత్తాన్ని యాక్సస్ చేయొచ్చు. అయితే, కాల్ హిస్టరీ అనేది పోస్టు పెయిడ్ యూజర్లకు స్టేట్ మెంట్ ద్వారా పొందే అవకాశం ఉంది. కానీ, ప్రీపెయిడ్ కస్టమర్లు మాత్రం కాల్ హిస్టరీని పొందడానికి అవకాశం లేదు. అయితే, మీరు మీ ప్రీపెయిడ్ ఫోన్ నెంబర్లకు సంబంధించి కాల్ హిస్టరీని ఈజీగా తెలుసుకోవచ్చు. కాల్ హిస్టరీని ఆరు నెలల వ్యవధిలో డేటాను పొందవచ్చు. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ కాల్ హిస్టరీ అవసరం పడుతుంది. అప్పుడు ఎలా పొందాలో చాలామందికి అవగాహన ఉండదు.

Read Also : Tech Tips in Telugu : మీ గూగుల్ క్రోమ్ స్లో అయిందా? ఈ సింపుల్ సెట్టింగ్ మార్చుకోండి చాలు.. జెట్ స్పీడ్‌తో పనిచేస్తుంది..!

ఇప్పుడు, ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ మీ కాల్ హిస్టరీని పొందడం చాలా సులభం. మీరు చేయాల్సిందల్లా.. మీ ఫోన్‌లో కాల్ లాగ్‌ను ఓపెన్ చేయండి. అందులో గత ఆరు నెలల నుంచి మీ డయిల్ హిస్టరీని పొందవచ్చు. వ్యాపార ప్రయోజనాల కోసం లేదా వ్యక్తిగత సూచన లేదా ముఖ్యమైన కాంటాక్టులను ట్రాక్ చేయడం కోసం, గత ఆరు నెలల మీ కాల్ హిస్టరీని ఎలా చెక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానంగా భారతీయ రెండు ప్రధాన టెలికాం ప్రొవైడర్‌లలో ఎయిర్ టెల్, రిలయన్స్ జియోకు సంబంధించి ఫోన్ కాల్ హిస్టరీని ఎలా పొందాలో తెలుసుకుందాం.

ఎయిర్‌టెల్ నంబర్‌లలో కాల్ హిస్టరీని ఇలా చెక్ చేయొచ్చు :
ఎయిర్‌టెల్ యూజర్ల కోసం గత ఆరు నెలల మీ కాల్ హిస్టరీని యాక్సెస్ చేయడానికి రెండు అనుకూలమైన పద్ధతులు ఉన్నాయి.

ఎస్ఎంఎస్ (SMS) ద్వారా పొందాలంటే? :

  • మీ ఎయిర్‌టెల్ మొబైల్‌లో మెసేజ్ యాప్‌ని ఓపెన్ చేసి.. రిసీవర్‌గా ‘121’ని ఎంటర్ చేయండి.
  • మెసేజ్ పంపేటప్పుడు ‘EPREBILL’ అని టైప్ చేయండి.
  • మీకు కాల్ వివరాలు అవసరమైన వ్యవధి లేదా నిర్దిష్ట తేదీలను పేర్కొనండి.
  • కాల్ వివరాలను స్వీకరించడానికి మీ ఇమెయిల్ ఐడీని కూడా ఎంటర్ చేయండి.
  • మీ ఎయిర్ మొబైల్ నంబర్ నుంచి పై విధంగా మెసేజ్ పంపండి.

ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ ద్వారా :
మీరు ఎయిర్‌టెల్ కస్టమర్ సర్వీస్ నుంచి మీ కాల్ రికార్డ్‌ల కాపీని రిక్వెస్ట్ చేయొచ్చు. ఎయిర్‌టెల్ కస్టమర్ కేర్ నంబర్‌ను సంప్రదించడం ద్వారా లేదా వ్యక్తిగతంగా ఎయిర్‌టెల్ స్టోర్‌ను సందర్శించడం ద్వారా పొందవచ్చు. దీనికి అనుబంధిత రుసుములు చెల్లించవచ్చునని గుర్తుంచుకోండి. అకౌంట్ ధృవీకరణ కోసం మీరు ఐడెంటిటీని అందించాల్సి రావచ్చు.

Trying to check your call history of last six months

call history of last six months

ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌ను విజిట్ చేసి.. మీ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి మీ అకౌంట్ లాగిన్ అవ్వండి.
‘Usage Details’ సెక్షన్‌కు నావిగేట్ చేయండి.
‘Usage Details’ కింద, నిర్దిష్ట కాలానికి కాల్ రికార్డ్‌లను వీక్షించే ఆప్షన్ గుర్తించండి.
కావలసిన తేదీ పరిధిని ఎంచుకుని, ‘Submit’పై క్లిక్ చేయండి.
మీ కాల్ రికార్డ్‌లు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

జియో నంబర్లలో కాల్ హిస్టరీని చెక్ చేయాలంటే? :
* మైజియో యాప్‌ని ఉపయోగించి జియో వినియోగదారులు తమ కాల్ రికార్డ్‌లను తిరిగి పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

MyJio యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి :
* గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి మైజియో యాప్‌ని మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయండి.

Trying to check your call history of last six months

check your call history

లాగిన్ చేయండి. మీ జియో నంబర్‌ను లింక్ చేయండి :
* యాప్‌లోకి లాగిన్ చేసి, మీ జియో నంబర్‌ను లింక్ చేయండి.

‘My Statement’ సెక్షన్ యాక్సెస్ చేయండి :
* యాప్ లెఫ్ట్ టాప్ కార్నర్‌లో ఉన్న హాంబర్గర్ ఆప్షన్ క్లిక్ చేయండి.
* ‘My Statement’ ఆప్షన్ నొక్కండి.

తేదీలను ఎంటర్ చేయండి. ఆపై వీక్షించండి:
* మీరు కాల్ రికార్డ్‌లను చూడాలనుకుంటున్న నిర్దిష్ట తేదీలను ఎంటర్ చేయండి.
* ‘View’పై నొక్కండి. ఆపై ఆరు నెలల వరకు కాల్ రికార్డ్‌లు మీకు కనిపిస్తాయి.

Read Also : Tech Tips in Telugu : మీ ఆధార్ కార్డులో బయోమెట్రిక్ డేటాను ఎలా అన్‌లాక్ చేయాలంటే? ఇదిగో ప్రాసెస్..!