Tech Tips in Telugu : మీ ఆధార్ కార్డులో బయోమెట్రిక్ డేటాను ఎలా అన్‌లాక్ చేయాలంటే? ఇదిగో ప్రాసెస్..!
Tech Tips in Telugu : మీ ఆధార్ కార్డులో బయోమెట్రిక్ డేటా లాక్ అయిందా? అయితే ఇలా ఈజీగా మీ డేటాను అన్‌లాక్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ ప్రాసెస్ ఫాలో అయిపోండి..

How to unlock Aadhaar biometric data, Follow These Steps in Telugu
Tech Tips in Telugu : మీ ఆధార్ కార్డులోని వివరాలను యాక్సస్ చేయలేకపోతున్నారా? అంటే.. మీ ఆధార్ బయోమెట్రిక్ డేటా లాక్ అయిందని అర్థం.. ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇన్‌యాక్టివ్ చేయొచ్చు. ఈ ఫీచర్ మీ ఐడెంటిటీని ధృవీకరించడంతో పాటు మీ ఫింగర్‌ఫ్రింట్, ఐరిస్ స్కాన్ డేటాను ఉపయోగించడాన్ని నిరోధిస్తుంది. మీ ఆధార్ బయోమెట్రిక్‌ని అన్‌లాక్ చేయాలనుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
Read Also : Update Aadhaar Card : ఆన్‌లైన్‌లో మీ ఆధార్ కార్డ్ ఫొటోను ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్!
ఉదాహరణకు.. మీరు భద్రతా కారణాల దృష్ట్యా మీ ఆధార్ బయోమెట్రిక్‌ను తాత్కాలికంగా లాక్ చేసినట్లయితే.. ఆధార్ అథెంటికేషన్ సర్వీసులను ఉపయోగించడానికి మీరు దాన్ని అన్‌లాక్ చేయాల్సి రావచ్చు. మీ ఆధార్ బయోమెట్రిక్‌ను అన్‌లాక్ చేయడానికి.. మీరు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ సందర్శించవచ్చు లేదా ఆన్‌లైన్ ఆధార్ పోర్టల్‌ని ఉపయోగించవచ్చు. మీ ఆధార్ బయోమెట్రిక్ డేటాను ఎలా అన్‌లాక్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

How to unlock Aadhaar biometric data, Follow These Steps in Telugu
ఆధార్ బయోమెట్రిక్ అన్ లాక్ చేయాలంటే? :
1. మీ వెబ్ బ్రౌజర్‌లో యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ‘https://uidai.gov.in’ విజిట్ చేయాలి.
2. యూఐడీఏఐ వెబ్‌సైట్ హోమ్‌పేజీలో ‘ఆధార్ సేవలు’ సెక్షన్ ఎంచుకోండి. వివిధ ఆప్షన్లతో కూడిన డ్రాప్‌డౌన్ మెనుని యాక్సెస్ చేసేందుకు దానిపై క్లిక్ చేయండి.
3. డ్రాప్‌డౌన్ మెనులో, ‘లాక్/అన్‌లాక్ బయోమెట్రిక్స్’ ఆప్షన్ ఎంచుకోండి. మిమ్మల్ని ‘లాక్/అన్‌లాక్ బయోమెట్రిక్స్’ పేజీకి రీడైరెక్ట్ చేస్తుంది.
4. ‘లాక్/అన్‌లాక్ బయోమెట్రిక్స్’ పేజీలో, మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయమని ప్రాంప్ట్ వస్తుంది. జాగ్రత్తగా టైప్ చేయండి.
5. ఆధార్ నంబర్ ఫీల్డ్ కింద.. మీకు సెక్యూరిటీ కోడ్ కనిపిస్తుంది. మీరు ఫొటోలో చూసే అక్షరాలను లేదా భద్రతా కోడ్ బాక్స్‌లో అందించిన టెక్స్ట్ టైప్ చేయండి.
6. ‘Send OTP’ బటన్‌పై క్లిక్ చేయండి. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని అందుకుంటారు.
7. ఓటీపీ కోసం మీ మొబైల్‌ను చెక్ చేసి, ఆపై వెబ్‌పేజీలో నిర్దేశించిన ఫీల్డ్‌లో ఎంటర్ చేయండి.

How to unlock Aadhaar biometric data, Follow These Steps in Telugu
8. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీ బయోమెట్రిక్‌లను అన్‌లాక్ చేసే ప్రక్రియను ప్రారంభించడానికి ‘సబ్మిట్’ లేదా ‘అన్‌లాక్’ బటన్‌పై క్లిక్ చేయండి.
9. మీరు సరైన ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే.. మీ ఆధార్ బయోమెట్రిక్‌లు అన్‌లాక్ అవుతాయి. మీరు వెబ్‌సైట్‌లో నిర్ధారణ మెసేజ్ అందుకుంటారు.
10. మీ బయోమెట్రిక్ డేటా విజయవంతంగా అన్‌లాక్ అయిందని నిర్ధారిస్తూ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ కూడా అందుకోవచ్చు.
11. మీ ఆధార్ బయోమెట్రిక్‌లు ఇప్పుడు అన్‌లాక్ అయ్యాయి. అవసరమైనప్పుడు అథెంటికేషన్ కోసం ఉపయోగించవచ్చు.
అన్‌లాక్ చేశాక.. ఆధార్ డేటా మళ్లీ లాక్ చేయాల్సిందే :
మీ ఆధార్ బయోమెట్రిక్ డేటాను అన్‌లాక్ చేయడం చాలా జాగ్రత్తగా చేయాలని గమనించడం ముఖ్యం. మెరుగైన భద్రత కోసం మీ ఆధార్ డేటాను మళ్లీ లాక్ చేయాలని సిఫార్సు చేస్తోంది. అన్‌లాకింగ్ ప్రక్రియలో ఓటీపీని పొందడానికి మీ మొబైల్ నంబర్ మీ ఆధార్‌తో రిజిస్టర్ చేసి ఉండాలి. మీ మొబైల్ నంబర్ రిజిస్టర్ కానట్లయితే లేదా అప్‌డేట్ కావాలంటే, అవసరమైన మార్పులను చేయడానికి మీరు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ సందర్శించాలి.
Read Also : PVC Aadhaar Card Online : ఆన్‌లైన్‌లో పీవీసీ ఆధార్ కార్డు ఎలా పొందాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!