Realme 13 Pro Plus 5G : రియల్‌మి 13 ప్రో ప్లస్ 5జీ ఫోన్ ఇదిగో.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. లాంచ్ ఆఫర్లు, ధర ఎంతంటే?
Realme 13 Pro+ 5G Launch : రియల్‌మి 13ప్రో ప్లస్ 5జీ ఫోన్ సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి ఇండియా వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ మెయిన్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొత్త మోనెట్ పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.

Realme 13 Pro Plus 5G Monet Purple Colour Variant Launched in India
Realme 13 Pro+ 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి నుంచి సరికొత్త రియల్‌మి 5జీ ఫోన్ వచ్చేసింది. జూలై 30న రియల్‌మి 13ప్రో 5జీతో పాటుగా రియల్‌మి 13ప్రో ప్లస్ ఫోన్ ఆవిష్కరించింది.
Read Also : Tech Tips in Telugu : గత 6 నెలల్లో మీరు ఎవరెవరితో మాట్లాడారో ఫోన్ కాల్ హిస్టరీ చెక్ చేయొచ్చు..!
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 ఎస్ఓసీ ద్వారా 12జీబీ వరకు ర్యామ్ అందిస్తుంది. 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ అమోల్డ్ స్క్రీన్, 50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 32ఎంపీ సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ దేశంలో గ్రీన్, గోల్డ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మూడో పర్పుల్ షేడ్‌లో కూడా అందుబాటులో ఉంది.
భారత్‌లో రియల్‌మి 13ప్రో ప్లస్ 5జీ ధర, ఆఫర్‌లు :
రియల్‌మి 13ప్రో ప్లస్ 5జీ ఫోన్ సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 12 గంటల నుంచి దేశ మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి ఇండియా వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ మెయిన్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొత్త మోనెట్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. భారత్‌లో రియల్‌మి 13ప్రో+ 5జీ 8జీబీ+ 256జీబీ ఆప్షన్ ప్రారంభ ధర రూ. 32,999కు పొందవచ్చు. అయితే, 12జీబీ + 256జీబీ, 12జీబీ+ 512జీబీ వేరియంట్ ధర వరుసగా రూ. 34,999 రూ. 36,999కు అందిస్తుంది.
సెప్టెంబర్ 2 మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి మధ్య మోనెట్ పర్పుల్ కలర్ ఆప్షన్ కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ. రూ. 3వేలు బ్యాంక్ ఆఫర్‌తో పాటు రూ. 4వేల ఎక్స్చేంజ్ ఆఫర్ పొందవచ్చు. ముఖ్యంగా, బ్యాంక్ ఆఫర్ ఈ నిర్దిష్ట వ్యవధిలో మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కొత్త పర్పుల్ వేరియంట్‌పై మాత్రమే అందిస్తోంది. సెప్టెంబర్ 2 నుంచి కొనుగోలుదారులు రియల్‌మి 13ప్రో ప్లస్ 5జీ మోనెట్ గోల్డ్, ఎమరాల్డ్ గ్రీన్ వెర్షన్‌లపై రూ. 4వేల ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అందిస్తుంది. అదే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు సెప్టెంబర్ 3 నుంచి హ్యాండ్‌సెట్‌లోని అన్ని కలర్‌వేలకు విస్తరిస్తుంది.
రియల్‌మి 13 ప్రో ప్లస్ 5జీ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
రియల్‌మి 13 ప్రో ప్లస్ 5జీ ఫోన్ 6.7-అంగుళాల 120హెచ్‌జెడ్ ఫుల్-హెచ్‌డీ+ అమోల్డ్ స్క్రీన్, 50ఎంపీ టెలిఫోటో షూటర్‌తో సహా 50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, అల్ట్రావైడ్ లెన్స్‌తో 8ఎంపీ సెన్సార్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సెల్ఫీలకు 32ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 ఎస్ఓసీతో అమర్చి ఉంటుంది. రియల్‌మి 13ప్రో+ 5జీ ఆండ్రాయిడ్ 14-ఆధారిత రియల్‌మి యూఐ 5.0, 80డబ్ల్యూ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,200mAh బ్యాటరీ అందిస్తుంది.