Infinix Zero 40 Series : సెల్ఫీ కెమెరాలతో ఇన్ఫినిక్స్ జీరో 40 సిరీస్ వచ్చేసింది.. ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?
Infinix Zero 40 Series : ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ ధర 399 డాలర్లు (దాదాపు రూ. 33,500), అయితే, 4జీ వెర్షన్ 289 డాలర్లు (సుమారు రూ. 24,200) వద్ద ప్రారంభమవుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌ల ధరలు ప్రాంతాల వారీగా మారుతాయని కంపెనీ ప్రకటనలో పేర్కొంది.

Infinix Zero 40 Series With 50-Megapixel Selfie Camera
Infinix Zero 40 Series : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఇన్పినిక్స్ నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. ఇన్ఫినిక్స్ జీరో 40 సిరీస్ ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించింది. ఇన్ఫినిక్స్ లైనప్‌లో ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ, ఇన్ఫినిక్స్ జీరో 40 4జీ హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయి.
108ఎంపీ ప్రైవరీ కెమెరా, 50ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో కూడిన 6.74-అంగుళాల కర్వ్డ్ అమోల్డ్డిస్‌ప్లేతో అమర్చి ఉన్నాయి. లైనప్‌లో గ్రోప్రో కనెక్టివిటీకి సపోర్టు అందిస్తుంది. మూడు ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లతో పాటు ఆండ్రాయిడ్ 16 వరకు రెండు ఓఎస్ అప్‌గ్రేడ్‌లను ఈ ఫోన్‌లు అందుకోనున్నాయి.
ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ, జీరో 40 4జీ ధర :
ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ ధర 399 డాలర్లు (దాదాపు రూ. 33,500), అయితే, 4జీ వెర్షన్ 289 డాలర్లు (సుమారు రూ. 24,200) వద్ద ప్రారంభమవుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌ల ధరలు ప్రాంతాల వారీగా మారుతాయని కంపెనీ ప్రకటనలో పేర్కొంది. ఈ హ్యాండ్‌సెట్‌లు మలేషియాలో కూడా లాంచ్ అయ్యాయి. ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ వేరియంట్ ధర (సుమారు రూ. 33వేల) నుంచి మొదలవుతుంది.
అయితే, 4జీ ఆప్షన్ ధర సుమారు రూ. 23,300 నుంచి ప్రారంభమవుతుంది. ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ వెర్షన్ మూవింగ్ టైటానియం, రాక్ బ్లాక్, వైలెట్ గార్డెన్ షేడ్స్‌లో అందుబాటులో ఉంది. 4జీ వేరియంట్, బ్లోసమ్ గ్లో, మిస్టీ ఆక్వా, రాక్ బ్లాక్ కలర్‌వేస్‌లో అందిస్తుంది. భారత్‌లో ఇన్ఫినిక్స్ జీరో 40 సిరీస్‌ను ప్రారంభించే ప్లాన్లను కూడా కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ, జీరో 40 4జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు :
ఇన్ఫినిక్స్ జీరో 40 సిరీస్ హ్యాండ్‌సెట్‌లు 6.78-అంగుళాల 3డీ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేలు 144Hz వరకు రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 1,300నిట్స్ వరకు బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, టీయూవీ రైన్‌ల్యాండ్ ఐ-కేర్ మోడ్ సర్టిఫికేషన్‌తో ఉంటాయి. ఇన్ఫినిక్స్ జీరో 40 సిరీస్ 5జీ వెర్షన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది.
అయితే, 4జీ వేరియంట్ మీడియాటెక్ హెలియో జీ100 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లు 24జీబీ వరకు డైనమిక్ ర్యామ్‌కు సపోర్టు ఇస్తాయి (హ్యాండ్‌సెట్ డిఫాల్ట్ మెమరీ స్పెసిఫికేషన్‌లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు). 512జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ అందిస్తుంది. రెండు మోడల్‌లు ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఇన్ఫినిక్స్ యూఐతో రన్ అవుతాయి.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఇన్ఫినిక్స్ జీరో 40 సిరీస్‌లో 108ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరాలు 50ఎంపీ అల్ట్రా-వైడ్ షూటర్‌లు, 50ఎంపీ సెల్ఫీ సెన్సార్ ఉన్నాయి. ఫోన్‌లు ప్రత్యేకమైన విలాగ్ మోడ్‌ను కలిగి ఉన్నాయి. లైనప్ 5జీ 4జీ వేరియంట్‌లు రెండూ గోప్రో మోడ్‌తో వస్తాయి. అలాగే వినియోగదారులు ఏదైనా గోప్రో డివైజ్ హ్యాండ్‌సెట్‌లతో కనెక్ట్ చేసేందుకు అనుమతిస్తుంది. యూజర్లు కనెక్ట్ చేసిన ఇన్ఫినిక్స్ జీరో 40 స్మార్ట్‌ఫోన్ నుంచి నేరుగా కనెక్ట్ చేసిన గోప్రో డివైజ్ రన్ చేయొచ్చు.
ఫుటేజీని స్క్రీన్ చేయడానికి ఫోన్ డిస్‌ప్లేను మానిటర్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇన్ఫినిక్స్ జీరో 40 సిరీస్‌లో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. రెండు హ్యాండ్‌సెట్‌లు 45డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. 5జీ వెర్షన్ 20డబ్ల్యూ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. కంపెనీ ప్రకారం.. ఈ ఫోన్ ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీ, గూగుల్ జెమిని ఏఐ అసిస్టెంట్‌కు కూడా సపోర్టు అందిస్తుంది.
Read Also : Apple iPhone 16 : ఆపిల్ ఐఫోన్ 16 లాంచ్ ఈవెంట్ ఎప్పుడో తెలిసిందోచ్.. ఫీచర్లు, ధర పూర్తి వివరాలు మీకోసం..!