Virat Kohli : సూర‌త్ వ్యాపార వేత్త అభిమానం.. విరాట్ కోహ్లీకి గిఫ్ట్‌గా వజ్రాల బ్యాటు..!

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు, ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి (Virat Kohli) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ అత‌డి సొంతం.

Virat Kohli : సూర‌త్ వ్యాపార వేత్త అభిమానం.. విరాట్ కోహ్లీకి గిఫ్ట్‌గా వజ్రాల బ్యాటు..!

Virat Kohli

Virat Kohli stardom : టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు, ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి (Virat Kohli) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ అత‌డి సొంతం. 2008 ఆగ‌స్టు 18న దంబుల్లా వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌తో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి అరంగ్రేటం చేశాడు. ఈ ఏడాది ఆగ‌స్టు 18తో 15 ఏళ్లు పూర్తి అయ్యాయి. కోహ్లి త‌న కెరీర్‌లో ప‌లు అత్యుత్త‌మ ఇన్నింగ్స్‌లు ఆడాడు. భార‌త్‌కు ఎన్నో చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాల‌ను సాధించి పెట్టాడు. అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి 25వేల కంటే ఎక్కువ ప‌రుగులు చేశాడు.

విరాట్ కోహ్లి 15 సంవ‌త్స‌రాల కెరీర్‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకోవ‌డంతో ప‌లువురు ఆట‌గాళ్లు, ఫ్యాన్స్ అత‌డికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అయితే.. సూర‌త్‌కు చెందిన ఓ వ్యాపార‌వేత్త మాత్రం విరాట్ కోహ్లికి ఓ అరుదైన బ‌హుమ‌తిని ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభానికి ముందు ఆ బ‌హుమ‌తిని కోహ్లికి అంద‌జేయ‌నున్నాడు. ఇంత‌కీ ఆ బ‌హుమ‌తి ఏంటో తెలుసా..? వ‌జ్రాల‌తో త‌యారు చేసిన బ్యాట్‌.

ODI World Cup : వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్‌లో మ‌ళ్లీ మార్పులు త‌ప్ప‌వా..? భద్రతపై హైద‌రాబాద్ పోలీసుల ఆందోళన..!

15mm పొడువు క‌లిగిన ఈ బ్యాట్ 1.04 క్యార‌ట్ల ఒరిజిన‌ల్ డైమండ్‌తో త‌యారు చేశార‌ట‌. ఈ వ‌జ్రం ధ‌ర మార్కెట్‌లో సుమారు రూ.10ల‌క్ష‌లుగా తెలుస్తోంది. డైమండ్ టెక్నాలజీ నిపుణుడు, సూరత్‌లోని లెక్సస్ సాఫ్ట్‌మాక్ కంపెనీ డైరెక్టర్ ఉత్పల్ మిస్త్రీ పర్యవేక్షణలో తయారు చేయబడిన ఈ బ్యాట్‌ను సిద్ధం చేయడానికి ఒక నెల సమయం పట్టింద‌ని, ప్ర‌స్తుతం స‌ర్టిఫికేష‌న్ కోసం పంపిన‌ట్లు ప‌లు నివేదిక‌లు తెలిపాయి.

ప్ర‌స్తుతం విరాట్ కోహ్లి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అదే ఫామ్‌ను ఆసియా క‌ప్‌తో పాటు ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ కొన‌సాగించాల‌ని అత‌డి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కోహ్లి వ‌య‌సు ప్ర‌స్తుతం 34. దీంతో మ‌రో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఆడేది క‌ష్ట‌మే. కోహ్లికి చివ‌రి ప్ర‌పంచ‌క‌ప్‌గా చాలా మంది బావిస్తున్నారు. స్వ‌దేశంలో జ‌ర‌గ‌నున్న ఈ మెగాటోర్నీలో విజ‌యం సాధించి టీమ్ఇండియాకు ప్ర‌పంచ‌క‌ప్‌ను అందించాల‌ని స‌గ‌టు భార‌త క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు.

Asia Cup : హార్దిక్ పాండ్యాకు షాక్‌.. రోహిత్‌ శర్మ డిప్యూటీగా స్టార్ పేస‌ర్‌..!