Rohit Sharma : ప్ర‌పంచ‌క‌ప్‌లో రోహిత్‌, కోహ్లి బౌలింగ్ చేస్తారు.. మ‌రీ అంత కామెడీ చేయ‌క్క‌ర్లేదు భ‌య్యా..!

ఆసియా క‌ప్‌(Asia Cup)లో పాల్గొనే భార‌త జ‌ట్టును సెలక్ట‌ర్లు సోమ‌వారం ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు.

Rohit Sharma : ప్ర‌పంచ‌క‌ప్‌లో రోహిత్‌, కోహ్లి బౌలింగ్ చేస్తారు.. మ‌రీ అంత కామెడీ చేయ‌క్క‌ర్లేదు భ‌య్యా..!

Rohit Sharma

Rohit Sharma Comedy : ఆసియా క‌ప్‌(Asia Cup)లో పాల్గొనే భార‌త జ‌ట్టును సెలక్ట‌ర్లు సోమ‌వారం ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(Rohit Sharma)తో పాటు చీఫ్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ (Ajit Agarkar) కూడా పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు వారు స‌మాధానాలు చెప్పారు.

ఆసియ క‌ప్‌లో 17 మందితో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించారు. అయితే.. ఈ బృందంలో ఒకే ఒక్క స్పెష‌లిస్టు స్పిన్న‌ర్‌కు చోటు ఇచ్చారు. అది చైనామ‌న్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ మాత్ర‌మే. ర‌వీంద్ర జ‌డేజా, అక్ష‌ర్ ప‌టేల్‌లు ఉన్నా వీరికి ఆల్‌రౌండ‌ర్ల కోటా కింద స్థానం ద‌క్కింది. దీనిపైనే మీడియా ప్ర‌తినిధులు ఓ ప్ర‌శ్న‌ను అడిగారు. జ‌ట్టులో స్పెష‌లిస్ట్ స్పిన్ ఆప్ష‌న్లు ఎక్కువ లేకపోవ‌డానికి కార‌ణం ఏంటి అని ప్ర‌శ్నించ‌గా రోహిత్ చెప్పిన స‌మాధానంతో అక్క‌డ న‌వ్వులు విరిసాయి.

ODI World cup : ఆసియాక‌ప్‌లో అశ్విన్‌, చాహ‌ల్‌, సుంద‌ర్‌ల‌కు ద‌క్క‌ని చోటు.. ఈ ముగ్గురు ప‌రిస్థితి ఏంట‌ని రోహిత్‌ను అడిగితే..

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిలు కొన్ని ఓవ‌ర్లు బౌలింగ్ వేస్తార‌ని ఆశిస్తున్నా అంటూ రోహిత్ చెబుతుండ‌గా ప‌క్క‌నే ఉన్న అజిత్ అగార్క‌ర్‌తో పాటు మీడియా ప్ర‌తినిధులు కూడా న‌వ్వేశారు. ఆసియాక‌ప్‌కు ప్ర‌క‌టించిన జ‌ట్టులోని ఆట‌గాళ్ల‌తోనే ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టును ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు అగార్క‌ర్ తెలిపారు.

భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5న నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ జ‌ర‌గ‌నుంది. ఇక టీమ్ఇండియా త‌న తొలి మ్యాచ్‌ను అక్టోబ‌ర్ 8న ఆడ‌నుంది. చెన్నై వేదిక‌గా ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డ‌నుంది. ఇక చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్‌తో అక్టోబ‌ర్ 14న అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఆడ‌నుంది. ప్ర‌పంచ‌క‌ప్ కంటే ముందు టీమ్ఇండియా ఆసియా క‌ప్ ఆడ‌నుంది.

Olga Carmona : జ‌ట్టును విశ్వ‌విజేత‌గా నిలిపింది.. తీవ్ర విషాదంలో ముగిపోయింది.. ఓ ఛాంపియన్‌ వ్యథ

హైబ్రిడ్ మోడ్‌లో జ‌ర‌గ‌నున్న ఈ టోర్నీకి పాకిస్తాన్‌, శ్రీలంక‌లు ఆతిథ్యం ఇవ్వ‌నున్నాయి. ఆగ‌స్టు 30 నుంచి సెప్టెంబ‌ర్ 17 వ‌రకు టోర్నీ జ‌ర‌గ‌నుంది. ఈ టోర్నీలో పాల్గొనే భార‌త జ‌ట్టునే సోమ‌వారం సెల‌క్ట‌ర్లు ప్ర‌క‌టించారు.

ఆసియా క‌ప్‌కు భార‌త జ‌ట్టు ఇదే..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ. సంజూ శాంసన్(రిజర్వ్ ప్లేయర్).