Chandrayaan 3 : ప్రతికూలంగా ఉంటే చంద్రయాన్ 3 ల్యాండింగ్ వాయిదా.. ఇస్రో శాస్త్రవేత్త వెల్లడి

చంద్రయాన్ 3 ల్యాండింగ్‌పై అందరి దృష్టి పడింది. చంద్రుడిపై కారకాలు ప్రతికూలంగా ఉంటే చంద్రయాన్ 3 ల్యాండింగ్‌ను వాయిదా వేస్తామని ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త తాజాగా వెల్లడించారు. ఆగస్టు 23వతేదీన చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ జరగనున్న నేపథ్యంలో...

Chandrayaan 3 :  ప్రతికూలంగా ఉంటే చంద్రయాన్ 3 ల్యాండింగ్ వాయిదా.. ఇస్రో శాస్త్రవేత్త వెల్లడి

Chandrayaan-3

Chandrayaan-3 landing : చంద్రయాన్ 3 ల్యాండింగ్‌పై అందరి దృష్టి పడింది. చంద్రుడిపై కారకాలు ప్రతికూలంగా ఉంటే చంద్రయాన్ 3 ల్యాండింగ్‌ను వాయిదా వేస్తామని ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త తాజాగా వెల్లడించారు. ఆగస్టు 23వతేదీన చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ జరగనున్న నేపథ్యంలో… ఆ రోజు పరిస్థితులు అనుకూలిస్తేనే జాతీయ అంతరిక్ష సంస్థ ల్యాండింగ్‌కు ముందుకు వెళుతుందని సీనియర్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) శాస్త్రవేత్త తెలిపారు. (will postpone Chandrayaan-3 landing) లేకుంటే చంద్రయాన్ 3 ల్యాండింగుకు ఆగస్టు 27వతేదీన ప్రయత్నం చేస్తామని ఇస్రో శాస్త్రవేత్త పేర్కొన్నారు. (ISRO scientist)

Coronavirus Cases : కొవిడ్ కేసుల వ్యాప్తిపై కేంద్రం అలర్ట్…పిరోలా, ఎరిస్ వేరియెంట్లపై రాష్ట్రాలు అప్రమత్తం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆగస్టు 23వతేదీన చంద్రునిపై చంద్రయాన్-3 ల్యాండింగ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. మిషన్ యొక్క ల్యాండర్ మాడ్యూల్ అయిన విక్రమ్ బుధవారం సాయంత్రం 6 గంటల తర్వాత చంద్రుని ఉపరితలంతో సంబంధాన్ని ఏర్పరచుకోవాల్సి ఉంది. ‘‘చంద్రయాన్-3 చంద్రుడిపై దిగడానికి రెండు గంటల ముందు, ల్యాండర్ మాడ్యూల్ చంద్రునిపై పరిస్థితుల ఆధారంగా ఆ సమయంలో దానిని ల్యాండ్ చేయడం సముచితమా లేదా అనే దానిపై మేం నిర్ణయం తీసుకుంటాం. ఒకవేళ ఏదైనా అంశం అనుకూలంగా లేనట్లు అనిపిస్తే, ఆగస్టు 27వతేదీన చంద్రునిపై మాడ్యూల్ ల్యాండ్ చేస్తాం’’ అని ఇస్రోలోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ ఎం దేశాయ్ తెలిపారు.

Rekha Nayak : కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే..? అధికార పార్టీలో ఫస్ట్ లిస్ట్ ప్రకంపనలు

మిషన్ ల్యాండర్ మాడ్యూల్ అయిన విక్రమ్ అసలు షెడ్యూల్ ప్రకారం చంద్రుని ఉపరితలంపైకి చేరుకుంటుందని దేశాయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రయాన్ ల్యాండింగ్ విజయవంతమైతే, భారతదేశం ఎలైట్ లిస్ట్‌లోకి ప్రవేశించనుంది. చంద్రునిపై సాఫ్ట్-ల్యాండింగ్ సాధించిన నాల్గవ దేశంగా అవతరించనుంది. యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా దేశాల సరసన భారత్ చేరనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (ఎస్‌డిసిసి) నుంచి చంద్రయాన్-3 జులై 14వతేదీన ప్రయోగించారు.