Realme 11 5G Pre-Order : రియల్‌మి 11 5G ప్రీ-ఆర్డర్ సేల్.. మరెన్నో ఆఫర్లు, డిస్కౌంట్లు.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్లను కొనేసుకోండి!

Realme 11 5G Pre-Order : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? రియల్‌మి 11 5G ప్రీ ఆర్డర్ సేల్ మొదలుకానుంది. ఆగస్టు 23న ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో స్పెషల్ ఫ్లాష్ సేల్ అందుబాటులోకి రానుంది.

Realme 11 5G Pre-Order : రియల్‌మి 11 5G ప్రీ-ఆర్డర్ సేల్.. మరెన్నో ఆఫర్లు, డిస్కౌంట్లు.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్లను కొనేసుకోండి!

Realme 11 5G Pre-Order, Realme 11X 5G Flash Sale Date And Time Announced

Realme 11 5G Pre-Order : కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్.. రియల్‌మి 11 5G, రియల్‌మి 11X 5G ఫోన్లపై అదిరే ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:00 గంటల మధ్య ప్రత్యేక ఫ్లాష్ సేల్ ద్వారా అందుబాటులో ఉంటుంది. (Realme 11 5G) విషయానికొస్తే.. రియల్‌మి అభిమానులు రాబోయే (Realme 11x 5G) స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 23న మధ్యాహ్నం 01:15 గంటల నుంచి ఇ-కామర్స్ వెబ్‌సైట్ నుంచి ప్రీ-ఆర్డర్ చేయవచ్చు.

రియల్‌మి 11 5G, 11X 5G భారత మార్కెట్లో ఆగస్టు 23 (రేపు) మధ్యాహ్నం 12:00 గంటలకు ప్రారంభం కానుంది. లాంచ్‌కు కొన్ని గంటల ముందు, కంపెనీ Realme 11 5G ప్రీ-ఆర్డర్ తేదీలను Realme 11x 5G ప్రత్యేక ఫ్లాష్ సేల్ తేదీ సమయాన్ని ప్రకటించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లపై కంపెనీ కొన్ని ఆఫర్‌లను వెల్లడించింది. రియల్‌మి 11 5G ప్రీ-ఆర్డర్, బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో అందుబాటులో ఉంది.

Read Also : Samsung Galaxy A23 5G Price : కొత్త ఫోన్ కావాలా? శాంసంగ్ గెలాక్సీ A23 5G ఫోన్‌పై అదిరే డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోండి..!

ఆఫర్ల విషయానికి వస్తే.. HDFC, SBI కార్డ్‌ల ద్వారా 1,500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. కొనుగోలు సమయంలో ఎక్స్ఛేంజ్ ధర రూ. 1,000 వరకు తగ్గింపు కూడా అందుబాటులో ఉంటుంది. రియల్‌మి 11x 5G ఫ్లాష్ సేల్, ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు, రియల్‌మి 11x 5G డివైజ్ లాంచ్ తేదీన ఫ్లిప్‌కార్ట్‌లో మధ్య ప్రత్యేక ఫ్లాష్ సేల్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ డివైజ్‌లపై HDFC, SBI బ్యాంక్ కార్డ్‌ల ద్వారా రూ. 1,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

Realme 11 5G Pre-Order, Realme 11X 5G Flash Sale Date And Time Announced

Realme 11 5G Pre-Order, Realme 11X 5G Flash Sale Date And Time Announced

రియల్‌‌మి ఫోన్ల స్పెసిఫికేషన్‌లు, లాంచ్ తేదీ, ధర అంచనా :

రియల్‌‌మి 11 5G, 11X 5G ఫోన్లలో 3X జూమ్, 67W ఛార్జింగ్‌తో 108MP ప్రైమరీ లెన్స్‌ను కలిగి ఉంటుంది. లీకైన స్పెసిఫికేషన్‌ల ప్రకారం.. రెండు స్మార్ట్‌ఫోన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన LCD ప్యానెల్, డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ రీడర్, 11 5G, 13×5లో 31Wపై 67W ఛార్జింగ్‌తో కూడిన 5000mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చని టిప్‌స్టర్ వెల్లడించింది.

రియల్‌మి కస్టమ్ స్కిన్‌పై ఆండ్రాయిడ్ 13లో రన్ కానుంది. ఆప్టిక్స్ విషయానికొస్తే.. రియల్‌మి 11 5G వెనుకవైపు 108MP మెయిన్, 2MP సెకండరీ లెన్స్, 16MP సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంటుంది. మరోవైపు, 11x 5G వెనుక 64MP + 2MP సెటప్, 8MP సెల్ఫీ లెన్స్ ఉండవచ్చు. రెండు స్మార్ట్‌ఫోన్‌లు రెండు కలర్ ఆప్షన్లలో రావచ్చు. 8GB RAM, 256GB ROM వరకు స్టోరేజ్ ట్రిమ్‌లను అందించవచ్చు. ఈ రెండింటి ధర రూ. 20వేల లోపు ఉండే అవకాశం ఉంది.

Read Also : 2023 Royal Enfield Bullet 350 : కుర్రాళ్ల డ్రీమ్ బైక్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. సెప్టెంబర్‌లోనే లాంచ్..!