Akira Nandan : పవన్ తనయుడు అకీరా.. హీరోగా కాదు మ్యూజిక్ డైరెక్టర్‌గా.. అందుకే ఫిలిం స్కూల్లో.. రేణూదేశాయ్ పోస్ట్!
పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ హీరోగా కాదు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వనున్నాడా..? రేణూదేశాయ్ పోస్ట్ వైరల్..!
![Akira Nandan : పవన్ తనయుడు అకీరా.. హీరోగా కాదు మ్యూజిక్ డైరెక్టర్‌గా.. అందుకే ఫిలిం స్కూల్లో.. రేణూదేశాయ్ పోస్ట్! Akira Nandan : పవన్ తనయుడు అకీరా.. హీరోగా కాదు మ్యూజిక్ డైరెక్టర్‌గా.. అందుకే ఫిలిం స్కూల్లో.. రేణూదేశాయ్ పోస్ట్!](https://10tv.in/wp-content/uploads/2023/08/Pawan-Kalyan-son-Akira-Nandan-debut-as-music-director-not-as-hero.jpg)
Pawan Kalyan son Akira Nandan debut as music director not as hero
Akira Nandan : ఇటీవల టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తన ట్విట్టర్ అకౌంట్లో.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తనయుడు అకీరా నందన్ ఫోటో షేర్ చేస్తూ యూఎస్ లోని ఫిలిం స్కూల్ లో జాయిన్ అవుతున్నట్లు పేర్కొన్నాడు. అయితే రాఘవేంద్రరావు ఆ పోస్ట్ ని కొంతసేపటికి డెలీట్ చేయడం, ఆ తరువాత రేణూ దేశాయ్ (Renu Desai).. అకీరాకి యాక్టింగ్ పై ప్రస్తుతం ఇంటరెస్ట్ లేదని చెబుతూ పోస్ట్ వెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
Akira Nandan : అకీరా నందన్‌తో ఉన్న ఫోటో షేర్ చేసిన రాఘవేంద్రరావు.. వెంటనే డెలీట్ చేశారు.. ఎందుకు..?
దీంతో కొన్ని రోజులు నుంచి అకీరా సినీ ఎంట్రీ పై నెట్టింట తెగ చర్చ జరుగుతుంది. తన ఎంట్రీ పై పవన్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. రేణూదేశాయ్ ఇలా చెప్పి షాక్ ఇచ్చింది ఏంటని ప్రతి ఒక్క ఫ్యాన్ ఆలోచనలో పడ్డారు. అయితే ఇక్కడ అభిమానులకు ఒక సందేహం కలుగుతుంది. హీరోగా ఎంట్రీ లేనప్పుడు అకీరా.. ‘ఫిలిం స్కూల్ లో ఎందుకు జాయిన్ అయ్యాడు’ అనే డౌట్ క్రియేట్ అయ్యింది. తాజాగా దీనికి రేణూదేశాయ్ క్లారిటీ ఇచ్చింది. అకీరా ఫిలిం స్కూల్ లో జాయిన్ అవ్వడానికి కారణం సంగీతం, ఫిలిం మేకింగ్ పై కోర్స్ నేర్చుకోవడానికి అని పేర్కొంది.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా ఎంట్రీ పై నెటిజెన్ విమర్శ.. రేణూదేశాయ్ కౌంటర్..
View this post on Instagram
అకీరా మంచి కీ బోర్డు ప్లేయర్ అని అందరికి తెలుసు. అకీరా మ్యూజిక్ చేస్తున్న కొన్ని వీడియోలను రేణూదేశాయ్ గతంలో షేర్ చేసింది. ఇటీవల ఒక షార్ట్ ఫిలింకి అకీరా మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా చేశాడు. ఇవన్నీ చూస్తుంటే అకీరా హీరోగా కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వనున్నాడా? అనే డౌట్ వస్తుంది. మరి చూడాలి అకీరా ఆడియన్స్ కి హీరోగా పరిచయం అవుతాడా? లేక సంగీత దర్శకుడిగా పరిచయం అవుతాడా?