Heath Streak : నన్ను చంప‌కండ‌య్యా.. నేను ఇంకా బ‌తికే ఉన్నాను.. ఆ వార్త బాధించింది

తాను మృతి చెందిన‌ట్లు ఈ ఉద‌యం నుంచి సోష‌ల్ మీడియాలో వార్త‌లు రావ‌డం పై జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ (Heath Streak) తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఇలాంటి పుకార్లు మాన‌సికంగా బాధ‌కు గురి చేశాయ‌ని తెలిపాడు.

Heath Streak : నన్ను చంప‌కండ‌య్యా.. నేను ఇంకా బ‌తికే ఉన్నాను.. ఆ వార్త బాధించింది

Heath Streak

Heath Streak hurt by rumours : తాను మృతి చెందిన‌ట్లు ఈ ఉద‌యం నుంచి సోష‌ల్ మీడియాలో వార్త‌లు రావ‌డం పై జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ (Heath Streak) తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఇలాంటి పుకార్లు మాన‌సికంగా బాధ‌కు గురి చేశాయ‌ని తెలిపాడు. తాను క్యాన్స‌ర్‌తో పోరాడుతూ బ‌తికే ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశాడు. “అవ‌న్నీ పుకార్లు. నేనింకా బ‌తికే ఉన్నా. ఎవ‌రైనా స‌రే ఎలాంటి ధ్రువీక‌ర‌ణ లేకుండానే ఇలాంటివి వ్యాప్తి చేయ‌డం తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. ఈ సోష‌ల్ మీడియా యుగంలో ఇలాంటివి రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. ఈ వార్త‌ల‌ను వ్యాప్తి చేసిన వారు క్ష‌మాప‌ణ‌లు చెబుతార‌ని ఆశిస్తున్నాను. ఇవి న‌న్ను చాలా బాధించాయి.” అంటూ 49 ఏళ్ల హీత్ స్ట్రీక్ అన్నారు.

Serena Williams : రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సెరెనా విలియమ్స్.. భర్త ట్వీట్ వైరల్.. అభినందనలు తెలుపుతున్న అభిమానులు

ఒలొంగ ట్వీట్..

త‌న స‌హ‌చ‌రుడు, మాజీ కెప్టెన్‌, దిగ్గ‌జ ఆల్‌రౌండ‌ర్ హీత్ స్ట్రీక్ తుది శ్వాస విడిచాడు అంటూ ఈ ఉద‌యం హెన్రీ ఒలొంగ ట్వీట్ చేశాడు. సహచరుడిగా త‌న‌తో ఫీల్డ్‌ను పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. నిజ‌మైన ఆల్‌రౌండ‌ర్ అంటూ సంతాపం తెలిపాడు. అయితే.. కొద్ది సేప‌టి త‌రువాత త‌న పొర‌పాటును స‌రి చేసుకుంటూ మ‌రొక ట్వీట్ చేశాడు ఒలొంగ. ఈ ట్వీట్‌లో హీత్ స్ట్రీక్ చనిపోలేదని, బతికే ఉన్నాడంటూ పేర్కొన్నాడు. ‘హీత్ స్ట్రీక్ చనిపోయాడన్న పుకార్లు మరీ ఎక్కువగా వ్యాపించాయి. నేను ఇప్పుడే అతనితో చాట్‌ చేశాను. మూడో అంపైర్ అతన్ని మళ్లీ వెనక్కి పిలిచాడు. స్ట్రీక్ బతికే ఉన్నాడు.’ అంటూ వాట్స‌ప్ స్ర్కీన్ చాట్‌ను సైతం షేర్ చేశాడు. దీంతో హీత్ స్ట్రీక్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Heath Streak Not Dead: జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ బతికే ఉన్నాడు! థర్డ్ అంపైర్ వెనక్కి పిలిచాడంటూ మరో ట్వీట్ చేసిన హెన్రీ ఒలంగ

హీత్‌ స్ట్రీక్ జింబాబ్వే త‌రుపున‌ 65 టెస్టులు,189 వ‌న్డేలు ఆడాడు. మొత్తంగా 4,933 ప‌రుగులు చేయ‌డంతో పాటు 455 వికెట్లు ప‌డ‌గొట్టాడు. జింబాబ్వే నుంచి 100 వికెట్లు తీసిన ఏకైక క్రికెట‌ర్‌గా హీత్ స్ట్రీక్ రికార్డుల్లో నిలిచాడు. 2000-2004 మ‌ధ్య జింబాబ్వే జ‌ట్టుకు నాయ‌కత్వం వ‌హించాడు. క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ త‌రువాత జింబాబ్వే, స్కాట్లాండ్‌, బంగ్లాదేశ్‌, గుజ‌రాత్ ల‌య‌న్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్ల‌కు కోచ్‌గా వ్య‌వ‌హ‌రించాడు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు.