Vinayaka Chaviti 2023 : వినాయక చవితి ఏ రోజు జరుపుకోవాలి.. సెప్టెంబర్ 18, లేదా 19..? పండితులు ఏం చెబుతున్నారు?

శ్రావణ మాసం వెళ్లిపోతోంది. ఇక భాద్రపద మాసం వస్తోంది. భాద్రపద మాసం అంటే వినాయక చవితికి భక్తులు సిద్ధపడే మాసం. గణేషుడి నవరాత్రులకు లంబోధరుడి మండపాలు ఏర్పాటు చేసే మాసం. మరి గణేషుడు పండుగ ఏ రోజున జరుపుకోవాలనే సందేహంలో పడిపోయారు భక్తులు. సెప్టెంబర్ 18నా..లేదా 19న అనే ధర్మసందేహానికి పండితులు క్లారిటీ ఇచ్చారు.

Vinayaka Chaviti 2023 : వినాయక చవితి ఏ రోజు జరుపుకోవాలి.. సెప్టెంబర్ 18, లేదా 19..? పండితులు ఏం చెబుతున్నారు?

ganesh chaturthi festival

Ganesh Chaturthi 2023 : ఈ ఏడాది రెండు శ్రావణ మాసాలు రావటం. రక్షా బంధన్ వేడుక గురించి ఓ గందరగోళం నెలకొనటం. రాఖీ పౌర్ణమి ఆగస్టు 30నా, 31నా అనే పెద్ద సందేహం వచ్చింది. అలాగే ఈ ఏడాది వినాయక చవితి ఏరోజు జరుపుకోవాలనే విషయంపై కూడా గందరగోళం నెలకొంది. క్యాలెండర్లలో సెప్టెంబర్ 18న అనే ఉంది. కొంతమంది మాత్రం సెప్టెంబర్ 19న పండగ అనడంతో గణేశుడి భక్తులు సందిగ్ధ పడుతున్నారు. దీనిపై పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

ఏదైనా పండుగ చేసుకోవాలంటే ఆ పండుగకు సంబంధించిన శుభ ఘడియలు ఉన్న సమయంలోనే జరుపుకోవాలి. పండితులు కూడా అదే చెబుతుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది వినాయక చవితి పండుగ జరుపుకునే సమయంలో శుభ ఘడియలు ఎప్పుడు సెప్టెంబర్ 18వ తేదీనా,  19వ తేదీనా అనే గందరగోళం నెలకొంది. అంటే పండుగ తగుళ్లు మిగుళ్లు వస్తే ఇలాంటి గందరగోళం ఉంటుంది. అలాగే ఈ ఏడాది గణేష్ చతుర్థి విషయంలో కూడా తగుళ్లు మిగుళ్లు వచ్చాయి. దీనిపై పండితులు క్లారిటీ ఇచ్చారు. వినాయక చవితి పర్వ దినాన్ని సెప్టెంబర్ 18వ తేదీన జరుపుకోవాలని తెలంగాణ విద్వత్సభ మంళవారం ప్రకటించింది.

Raksha Bandhan 2023 : భద్ర కాలంలో రాఖీ అస్సలు కట్టొద్దు .. మరి ఈ ఏడాది రాఖీ ఎప్పుడు కట్టాలి? ఆగస్టు 30నా, 31నా..?

శోభకృత్​నామ సంవత్సరంలో భాద్రపద శుక్ల చతుర్థి రోజునే మధ్యాహ్నం వరకు చవితి తిథి ఉందని అదే రోజున వినాయక చవితిగా నిర్వహించుకోవాలని నిర్ధారించారు విద్వత్సభ అధ్యక్షుడు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి, కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి. తెలంగాణలోని సిద్ధాంతులు అంతా కలిసి విద్వత్సభ ఫోరం పెట్టుకున్నారు. దీంతో పండితులు అంతా కలిసి వినాయక చవితి వేడుక జరుపుకునే రోజును లెక్కలు వేసి శుభఘడియలున్న సమయంలోనే జరుపుకోవాలని అంటే సెప్టెంబర్ 18 నిర్వహించుకోవాలని చెబుతున్నారు. ఎటువంటి అనుమానం లేకుండా సెప్టెంబర్ 18న జరుపుకోవాలని ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిక కూడా ఇచ్చామని పండిత వర్గం తెలిపింది.

భాద్రపద మాసంలో చవితి తిథి 18న ఉదయం 9.58 ఆరంభమై 19వ తేదీ ఉదయం 10.28కి ముగుస్తుందని పండితులు తెలిపారు. దీని ప్రకారంగా చవితి తిథి సెప్టెంబర్ 18వ తేదీన ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని పండితులు వెల్లడించారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్​ కార్యాలయాలకు, ప్రభుత్వ సలహాదారులకు కూడా తెలియజేసామని దివ్యజ్ఞాన సిద్ధాంతి పేర్కొన్నారు.

Raksha bandhan 2023 : భారత్‌పై దండెత్తిన అలెగ్జాండర్ ప్రాణాలను కాపాడిన ‘రక్షాబంధన్’.. ఎలాగో తెలుసా?