Grapes village in Kashmir : కశ్మీర్‌లో పండుతున్న అరుదైన ద్రాక్షకు అంతర్జాతీయ మార్కెట్‌లో ఫుల్ డిమాండ్

కశ్మీర్‌లో ఉద్యానవన పంటలకు మళ్లీ మమర్దశ పడుతోంది. కశ్మీర్ అంటే యాపిల్సే కాదు ద్రాక్ష కూడా ఫేమస్ అనేలా కశ్మీర్ రైతులు అరుదైన ద్రాక్ష రకాలను పండిస్తున్నారు.

Grapes village in Kashmir : కశ్మీర్‌లో పండుతున్న అరుదైన ద్రాక్షకు అంతర్జాతీయ మార్కెట్‌లో ఫుల్ డిమాండ్

kashmir grepe

Repora Grapes village in Kashmir : కశ్మీర్‌ (Kashmir)అంటే ఠక్కున గుర్తుకొచ్చేది యాపిల్( Kashmir Apple). అందాల ప్రకృతి, రకరకాల పండ్ల తోటలు ఇలా కశ్మీర్ అంటేనే అందాలకు నెలవు. కశ్మీర్ వాతావరణ ఎన్నో రకరాల పండ్ల తోటకు అనుకూలమైనది.కానీ కొన్నేళ్లుగా కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల్లో పండ్ల సాగు గణనీయంగా తగ్గిపోయింది. ఐతే ఇప్పుడు ప్రపంచంలోని మరెక్కడా పండనటువంటి అరుదైన ద్రాక్ష కశ్మీర్‌లో పండుతోంది. సాధారణ ద్రాక్ష కంటే నాలుగైదు రెట్లు ఎక్కువ పరిమాణంలో పండుతున్న ద్రాక్ష విశేషంగా ఆకర్షిస్తోంది.

కశ్మీర్‌లో ఉద్యానవన పంటలకు మళ్లీ మమర్దశ పడుతోంది. కశ్మీర్ అంటే యాపిల్సే కాదు ద్రాక్ష కూడా ఫేమస్ అనేలా కశ్మీర్ రైతులు అరుదైన ద్రాక్ష రకాలను పండిస్తున్నారు. గతంలో విస్తృతంగా పండే ద్రాక్ష దాదాపు కనుమరుగు అవ్వగా, మళ్లీ ఆ పంటల సాగుపై దృష్టిపెట్టారు కశ్మీర్‌ రైతులు. కశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లా(Ganderbal district)లో రెపోరా అనే గ్రామం (Repora village)ఇప్పుడు అత్యుత్తమ ద్రాక్ష పంటకు ప్రసిద్ధి చెందింది. మారుమూల ఉన్న ఈ కుగ్రామంలో పండుతున్న ద్రాక్ష అంతర్జాతీయంగా మంచి గిరాకీ, గుర్తింపు సంపాదించింది. అత్యుత్తమ నాణ్యతతో పండుతున్న రెపోరా ద్రాక్ష (Repora grape) రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది.

Mango Fruit Yield : అధిక దిగుబడుల కోసం ప్రస్తుతం మామిడిలో చేపట్టాల్సిన యాజమాన్యం

అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉత్తమ నాణ్యమైన ద్రాక్ష బరువు 4-5 గ్రాములు ఉండాలి. కానీ రెపోరా గ్రామంలో పండుతున్న ద్రాక్ష 12-14 గ్రాముల పరిమాణంలో ఉంటోంది. అంతర్జాతీయ పరిణామాలకు రెండు మూడు రెట్లు పెరగడంతో ఈ ద్రాక్షకు డిమాండ్‌ పెరుగుతోంది. అంతేకాకుండా రెపోరాలో పండుతున్న ద్రాక్ష పండుకు మరో గొప్పతనం కూడా ఉంది. ప్రపంచంలో ఇటలీలో తప్ప ఎక్కడా తాజా ద్రాక్ష అందుబాటులో లేనప్పుడు రెపోరో ద్రాక్ష పండుతోంది. అంటే ప్రపంచ దేశాల్లో ఇటలీతోపాటు భారతదేశంలోని కశ్మీర్‌లో మాత్రమే అన్ని సీజన్లలోనూ ద్రాక్ష లభిస్తుంది.

రెపోరా గ్రామంలో సాహిబీ(Sahibi), హుస్సేనీ(Hussaini ), అబ్షారీ ( Abshari) అనే మూడు రకాల ద్రాక్ష పండుతోంది. ఏటా జూలై నుంచి సెప్టెంబర్ వరకు దిగుబడి ఉంటుంది. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవక నెల రోజుల పాటు సాగు ఆలస్యమైంది. కానీ ప్రస్తుతం దిగుబడులు సమృద్ధిగా ఉన్నాయి. ప్రపంచ ప్రమాణాలకు మించి నాణ్యమైన పండ్లు పండుతుండటంతో ఇక్కడ ద్రాక్షకు గణనీయమైన డిమాండ్‌ ఉంటోంది. దీంతో సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది.

ప్రస్తుతం 500 హెక్టార్లలో సాగు చేస్తుండగా, మొత్తం 2 వేల 200 మెట్రిక్ టన్నుల ద్రాక్ష ఉత్పత్తి అవుతోంది. గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయి.. అన్నిరకాల పంటలు దెబ్బతింటుండగా, రెపోరోలో మాత్రం పెరుగుతున్న ఉష్ణోగ్రతలే రైతులకు కలిసివచ్చాయి. ఎప్పుడు శీతల వాతావరణం ఉండే కశ్మీర్‌లో కొన్నేళ్లుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఉద్యాన పంటలకు అనువుగా మారుతోంది. ముఖ్యంగా ఇక్కడి వాతావారణంతో ద్రాక్ష తోటలకు ఉజ్వల భవిష్యత్‌ కనిపిస్తోందని అంటున్నారు ఉద్యాన వన శాస్త్రవేత్తలు.