Pushpa 2 : అల్లు అర్జున్‌కి పోటీగా కమల్ హాసన్, అజయ్ దేవగణ్.. పుష్ప 2 ఆ సినిమాలకు పోటీ ఇస్తుందా?

పుష్ప 2 సినిమా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో పుష్ప 2 సినిమాని రిలీజ్ చేయనున్నారు. అయితే అదే డేట్ కి మరో రెండు భారీ సినిమాలు కూడా రిలీజ్ కానున్నట్టు సమాచారం.

Pushpa 2 : అల్లు అర్జున్‌కి పోటీగా కమల్ హాసన్, అజయ్ దేవగణ్.. పుష్ప 2 ఆ సినిమాలకు పోటీ ఇస్తుందా?

Pushpa 2 tough fight with Indian 2 and Singam Again Movies Allu Arjun Kamal Haasan Ajay Devgn movies

Allu Arjun Pushpa 2 : సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న పుష్ప 2 కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అందరికి సర్ ప్రైజ్ ఇస్తూ నిన్న పుష్ప సెకండ్ పార్ట్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్రయూనిట్. వచ్చే ఏడాది 2024 ఆగష్టు 15న పుష్ప 2 సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

పుష్ప 2 సినిమా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో పుష్ప 2 సినిమాని రిలీజ్ చేయనున్నారు. అయితే అదే డేట్ కి మరో రెండు భారీ సినిమాలు కూడా రిలీజ్ కానున్నట్టు సమాచారం. కమల్ హాసన్ – శంకర్ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఇండియన్ 2(Indian 2) సినిమా కూడా 15 ఆగస్టు 2024 రాబోతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇది కూడా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు.

ఇక బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ – రోహిత్ శెట్టి కాంబోలో సింగం సినిమాలకు ఇంకో సీక్వెల్ సింగం ఎగైన్(Singam Again) రాబోతుంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన సింగం, సింగం రిటర్న్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ కూడా 2024 ఆగస్టు 15 అని గతంలోనే ప్రకటించారు.

Pushpa 2 Movie : పుష్ప 2.. 1000 కోట్ల టార్గెట్.. అందుకే రిలీజ్ డేట్ అది సెలెక్ట్ చేసుకున్నారా?

మరి ఈ రెండు సినిమాలు పుష్ప 2కి పోటీ ఇస్తాయా లేక తప్పుకుంటాయా చూడాలి. ఒకవేళ ఈ రెండు సినిమాలు కూడా అదే రోజు రిలీజ్ అయితే పుష్ప 2 సినిమాకు బాలీవుడ్, తమిళ్ లో కలెక్షన్స్ కచ్చితంగా తగ్గుతాయి. ఇక పుష్ప 2 యూనిట్ ఈసారి 1000 కోట్లు టార్గెట్ పెట్టుకొని దిగుతుందని సమాచారం.