Singapore : కడుపునిండా పీతల కూర తిన్నారు..బిల్లు చూసి షాకయ్యారు.. రెస్టారెంట్ ఎంత బిల్లు వేసిందంటే?

కొత్త ప్రాంతాలకు వెళ్లినపుడు ప్రతీది రేట్లు తెలుసుకుని వెళ్లాలి. లేదంటే ప్రతి ఒక్కరి దగ్గర మోసపోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్‌తో సింగపూర్ వెళ్లిన ఓ జపాన్ టూరిస్టుకి ఓ రెస్టారెంట్‌లో చేదు అనుభవం ఎదురైంది. అదేంటో చదవండి.

Singapore : కడుపునిండా పీతల కూర తిన్నారు..బిల్లు చూసి షాకయ్యారు.. రెస్టారెంట్ ఎంత బిల్లు వేసిందంటే?

Singapore

Singapore : క్రాబ్ డిష్‌కి అక్షరాల రూ.56,000 బిల్లు వేసింది ఓ రెస్టారెంట్. షాకైన జపాన్ టూరిస్ట్ పోలీసులకు ఫోన్ చేసింది. ఎక్కడంటే?

Rail Coach Restaurant : రైల్ కోచ్ రెస్టారెంట్ ఓపెన్ అయ్యింది.. ఎక్కడో తెలుసా?

రీసెంట్‌గా జంకో షిన్బా అనే జపాన్ టూరిస్టు స్నేహితులతో కలిసి సింగపూర్‌లోని సీఫుడ్ ప్యారడైజ్‌ రెస్టారెంట్‌కి వెళ్లింది. క్రాబ్ డిష్‌కి $680 (ఇండియన్ కరెన్సీలో రూ. 56,503) బిల్లు వేయడంతో వారంతా షాకయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారు. వెయిటర్ సలహాతో అలస్కాన్ కింగ్ చిల్లీ క్రాబ్ డిష్ ఆర్డర్ చేసినట్లు షిన్బా చెప్పింది. వెయిటర్ క్రాబ్‌ను $20 ( ఇండియన్ కరెన్సీలో 1,662.08) అని మాత్రమే చెప్పాడని.. దాని బరువెంత ఉందో చెప్పలేదని షిన్బా వాపోయింది. ఇక నలుగురు కలిసి 3,500 గ్రాముల డిష్‌ను తిన్నారట. వారికి $680 బిల్లు వేసారు.

Sandwich: శాండ్‌విచ్‌ను కట్ చేసినందుకు కూడా బిల్ వేసిన రెస్టారెంట్ .. ప్రశ్నించిన కష్టమర్‌కు డబుల్ షాకులు

షిన్బా ఫిర్యాదుతో పోలీసులు రెస్టారెంట్‌కి చేరుకున్నారు. అయితే ఆమె బృందానికి ఎక్కువ ఛార్జీ విధించలేదని రెస్టారెంట్ సిబ్బంది పేర్కొంది. అయితే కొంతసేపు డిస్కషన్ తర్వాత రెస్టారెంట్ $78 (ఇండియన్ కరెన్సీలో రూ. 6,479) తగ్గించారు.  ఈ ఘటనపై షిన్బా సింగపూర్ టూరిజం బోర్డును సంప్రదించింది. కేసును సింగపూర్ వినియోగదారుల అసోసియేషన్‌కు సూచించింది.