Hero Karizma XMR : కొత్త బైక్ కొంటున్నారా? అక్టోబర్ 1 నుంచి పెరగనున్న హీరో కరిజ్మా XMR బైక్ ధర.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..!
Hero Karizma XMR : కొత్త బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. వచ్చే నెల (అక్టోబర్ 1) నుంచి హీరో కరిజ్మా XMR ధర భారీగా పెరగనుంది.
![Hero Karizma XMR : కొత్త బైక్ కొంటున్నారా? అక్టోబర్ 1 నుంచి పెరగనున్న హీరో కరిజ్మా XMR బైక్ ధర.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..! Hero Karizma XMR : కొత్త బైక్ కొంటున్నారా? అక్టోబర్ 1 నుంచి పెరగనున్న హీరో కరిజ్మా XMR బైక్ ధర.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..!](https://10tv.in/wp-content/uploads/2023/09/Hero-Karizma-XMR-to-cost-Rs-7000-more-from-October-1.jpg)
Hero Karizma XMR to cost Rs 7,000 more from October 1
Hero Karizma XMR : ప్రముఖ హీరో మోటోకార్ప్ కంపెనీ హీరో కరిజ్మా (XMR) బైక్ కొనేందుకు చూస్తున్నారా? అయితే వెంటనే బుకింగ్ చేసుకోండి. లేదంటే మరికొద్దిరోజుల్లో ఈ బైక్ ధర భారీగా పెరగనుంది. అంటే.. అక్టోబరు 1 నుంచి హీరో కరిజ్మా XMR బైక్ ధర రూ. 7వేలు పెంచనున్నట్టు కంపెనీ ప్రకటించింది.
ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ (Hero Karizma XMR Launch) అయిన ఈ మోటార్‌సైకిల్ ధర రూ. 1,72,900 (ఎక్స్-షోరూమ్) ఉండగా.. రూ. 1,79,900 (ఎక్స్-షోరూమ్) వరకు పెరగనుంది. కొత్త కరిజ్మా XMR రూ. 1 లక్ష 72 వేల 900 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర (రూ. 3వేలు)తో బుకింగ్‌లు సెప్టెంబర్ 30 అర్ధరాత్రి వరకు ఓపెన్ అయి ఉంటాయి. కొత్త బుకింగ్ విండో కోసం కంపెనీ తర్వాత తేదీని ప్రకటించనుంది. అయితే, అది కొత్తగా సవరించిన ధరతో ఉంటుంది.
హీరో Karizma XMR బైక్ ఆగష్టు 29న లాంచ్ అయింది. 210cc, 4V, DOHC, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. హీరో మోటోకార్ప్‌కు ఈ బైక్ మొదటిది. పవర్, టార్క్ ఫిగర్లు రెండూ వరుసగా 25.5PS, 20.4Nm వద్ద క్లాస్-లీడింగ్‌లో ఉన్నాయి. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
హీరో కరిజ్మా స్పెషిఫికేషన్లు ఇవే :
కొత్త కరిజ్మా XMR డైనమిక్ ఏరో-లేయర్డ్ డిజైన్‌ను కలిగి ఉంది. LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ సెగ్మెంట్-ఫస్ట్ అడ్జస్టబుల్ విండ్‌షీల్డ్‌ను పొందుతుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పూర్తిగా డిజిటల్ LCD యూనిట్. మోటార్‌సైకిల్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది.
![Hero Karizma XMR : కొత్త బైక్ కొంటున్నారా? అక్టోబర్ 1 నుంచి పెరగనున్న హీరో కరిజ్మా XMR బైక్ ధర.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..! Hero Karizma XMR to cost Rs 7,000 more from October 1](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2023/09/Hero-Karizma-XMR-Price-Offer.jpg)
Hero Karizma XMR to cost Rs 7,000 more from October 1
ఇందులో, సెగ్మెంట్-ఫస్ట్ టర్న్-బై-టర్న్ నావిగేషన్ సిస్టమ్ కూడా ఉంది. మోటారుసైకిల్ ఇతర ముఖ్యమైన ఫీచర్లలో తేలికైన క్లిప్-ఆన్ హ్యాండిల్బార్లు, స్లిప్, అసిస్ట్ క్లచ్, సిక్స్-స్టెప్ మోనోషాక్, డ్యూయల్-ఛానల్ ABS ఉన్నాయి. అంతేకాదు.. ఐకానిక్ ఎల్లో, టర్బో రెడ్, మ్యాట్ ఫాంటమ్ బ్లాక్ అనే 3 కలర్ ఆప్షన్లలో అందిస్తుంది. హీరో కరిజ్మా XMR బజాజ్ పల్సర్ RS200, సుజుకి Gixxer SF 250 యమహా R15 V4లకు పోటీదారుగా మార్కెట్లోకి వచ్చింది.